Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaeb3eb80-1387-4c2f-a000-ef656652c090-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaeb3eb80-1387-4c2f-a000-ef656652c090-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక మెజారిటీ వచ్చిన బిజెపి కాకుండా తక్కువ సీట్లు వచ్చిన మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారూ. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ అటు బీజేపీకి షాక్ ఇస్తూ వచ్చింది ఇక ఇటీవల మరోసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ కి ఊహించని షాక్ ఇచ్చింది అధికార పార్టీ. ఇటీవల ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటింBjp{#}yogesh;Abhimanyu Mithun;Maha;Joseph Vijay;bhaskar;Baba Bhaskar;Maharashtra;ram pothineni;Assembly;Bharatiya Janata Party;Governmentమళ్ళీ రాజుకున్న 'మహా' రాజకీయం.. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్?మళ్ళీ రాజుకున్న 'మహా' రాజకీయం.. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్?Bjp{#}yogesh;Abhimanyu Mithun;Maha;Joseph Vijay;bhaskar;Baba Bhaskar;Maharashtra;ram pothineni;Assembly;Bharatiya Janata Party;GovernmentMon, 05 Jul 2021 19:15:00 GMTమహారాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక మెజారిటీ వచ్చిన బిజెపి కాకుండా తక్కువ సీట్లు  వచ్చిన మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారూ.  మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ అటు బీజేపీకి షాక్ ఇస్తూ వచ్చింది  ఇక ఇటీవల మరోసారి వర్షాకాల అసెంబ్లీ  సమావేశాల్లో బీజేపీ కి ఊహించని షాక్ ఇచ్చింది అధికార పార్టీ. ఇటీవల ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను  ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ ప్రకటనతో పాటు మహా రాజకీయాలు మరోసారి రాజుకున్నాయి.


 ఓబిసి రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ ఇటీవలే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది   అయితే ఓబీసీ రిజర్వేషన్ ల కోసం 12 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రతిపక్ష నేత  దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు  ఈ క్రమంలోనే ఇక బిజెపి ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు  దీంతో అసెంబ్లీ మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం అటు స్పీకర్ భాస్కర్ జాదవ్ ను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక అటు వెంటనే స్పందించిన సభాపతి ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.



 స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు భౌతికంగా దాడి చేసేందుకు 12 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నించారు అనే కారణంతో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ భాస్కర్ జాదవ్. సభ వాయిదా పడిన సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అందరూ కూడా తన క్యాబిన్ కి వచ్చి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై విచారణ చేపట్టాల్సిందిగా శాసనసభ వ్యవహారాల మంత్రిని కూడా కోరారు. ఇటీవలే సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యేలలో..సంజయ్ కుటే, అశీష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరగ్ అల్వని, హరీశ్ పింపలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే, కృతికుమార్ బంగ్డియాను లు ఉన్నారు.


మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బీరు ధర?

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!

పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై అపోహ‌లొద్దు - ఏపీ డీజీపీ

అమరావతి కోసం రంగంలోకి రఘురామ కృష్ణంరాజు !

జిల్లాల‌కు బండి సంజ‌య్...ఆ ఎఫెక్టేనా...?

సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

ఏపీ : అధిక ధ‌ర‌కు ఇసుక విక్ర‌యిస్తే కఠిన చ‌ర్య‌లు.. !

కేసీఆర్ చెప్పినా నాకు గ‌న్ లైసెన్స్ ఇవ్వ‌డం లేదు : రాజా సింగ్

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>