PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfc9129e4-11a4-4e4a-8d39-d81ea6957d9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfc9129e4-11a4-4e4a-8d39-d81ea6957d9a-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా నెమ్మదించినట్టే కనిపిస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దేశం మొత్తం మీద 50 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. మరణాలు కూడా వెయ్యి లోపే నమోదవుతున్నాయి. అయితే.. కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్coronavirus{#}Coronavirusకరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!కరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!coronavirus{#}CoronavirusSun, 04 Jul 2021 09:00:00 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా నెమ్మదించినట్టే కనిపిస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దేశం మొత్తం మీద 50 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. మరణాలు కూడా వెయ్యి లోపే నమోదవుతున్నాయి. అయితే.. కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్ చేశారు.


డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో చాలా దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోందని గుర్తు చేసిన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌.. ఏ దేశమూ దీన్నుంచి బయటపడలేదని స్పష్టం చేశారు. అంతే కాదు.. వైరస్‌లో ఉత్పరివర్తనం జరుగుతూనే ఉంటుందన్నారు. అంటే ఇంకా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నమాట. ఇది ప్రపంచానికి మరింత ప్రమాదకరంగా మారబోతోందన్నమాట. అందుకే ఈ వేరియంట్లకు తగ్గట్టుగా దేశాలన్నీ ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌  సూచించారు.


ప్రపంచానికే సవాల్‌ గా మారిన ఈ డెల్టా వేరియంట్‌ను తొలుత భారత్‌లో గుర్తించారు. ఇప్పటివరకు ఈ డెల్టా వేరియంట్  98 దేశాలకు విస్తరించింది. డెల్టా వేరియంట్ ప్రభావం, వ్యాప్తిని తగ్గించేందుకు రెండు మార్గాలున్నాయని టెడ్రోస్‌ అంటున్నారు. అదే టెస్టింగ్‌, ట్రేసింగ్‌.. ఈ రెండింటి ద్వారా  వైరస్‌ మ్యుటేషన్లను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చు. ఆ తరవాత ఐసోలేషన్‌, చికిత్స వసతులు మెరుగుపరచడం ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు. వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పదు. అంతే కాదు.. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ చెబుతున్నారు.


కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమంటున్న డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌.. తక్కువ వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో ఆస్పత్రులు మరోసారి నిండిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. 2022జులై నాటికి అన్ని దేశాల్లో 70శాతం మందికి టీకాలు అందించేలా ప్రపంచ నేతలు కృషి చేయాలని ఆయన సూచించారు.





ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!

కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్ చేశారు.

మళ్ళీ జనంలోకి జనసేనాని?

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?

అన్నమా, ఆన్ లైన్ తరగతులా?

కరోనా తగ్గుముఖంతో ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ ....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>