MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/happy-sundayb347b6ad-09cc-4431-903c-d6dbc5962371-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/happy-sundayb347b6ad-09cc-4431-903c-d6dbc5962371-415x250-IndiaHerald.jpgఆదివారం ఈ పేరు వినగానే అందరికీ సంతోషం పొంగుకొస్తుంది. వారంలో ఈ రోజు చాలా స్పెషల్, అందరూ ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. దీనికంతటికీ కారణం ఆదివారం సెలవు దినం కావడం. వారమంతా పనిచేసి అలసిన మనసులకు కాస్త ఊరట కలిగించే రోజు. ఉద్యోగస్తులకు, కార్మికులకు, వ్యాపారులకు ఇలా ఎందరికో ఆదివారం సెలవుగా ఎప్పటినుండో పరిగణించబడుతోంది. HAPPY-SUNDAY{#}GEUM;you tube;News;Manam;Santosham;oil;Smart phone;sunday;Andhra Pradesh;Evening;Coronavirusఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !HAPPY-SUNDAY{#}GEUM;you tube;News;Manam;Santosham;oil;Smart phone;sunday;Andhra Pradesh;Evening;CoronavirusSun, 04 Jul 2021 09:00:00 GMTఆదివారం ఈ పేరు వినగానే అందరికీ సంతోషం పొంగుకొస్తుంది. వారంలో ఈ రోజు చాలా స్పెషల్, అందరూ ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. దీనికంతటికీ కారణం ఆదివారం సెలవు దినం కావడం. వారమంతా పనిచేసి అలసిన మనసులకు కాస్త ఊరట కలిగించే రోజు. ఉద్యోగస్తులకు, కార్మికులకు, వ్యాపారులకు ఇలా ఎందరికో ఆదివారం సెలవుగా ఎప్పటినుండో పరిగణించబడుతోంది. అందుకే సండే అంటేనే అందరికీ ఫన్ డే...! గతంలో అయితే ఆదివారం అనగానే మనకు చాలా ప్లానింగ్స్ ఉండేవి. మార్నింగ్ నాన్ వెజ్ తో బ్రేక్ ఫాస్ట్, ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడం, బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేదా ఏదైనా హోటల్ కు వెళ్లి తినడం, సినిమాలకు షికార్లకు వెళ్ళడం. ఇలా మన లైఫ్ లో సండే అంటే చాలా స్పెషల్ గా, హ్యాపీగా ఉండేది. కానీ ఇదంతా బిఫోర్ కరోనా, ప్రస్తుతం కరోనా సీజన్ నడుస్తోంది. కాబట్టి సండేని మరీ ఇంత ఎంజాయ్ చేయడం కుదరదు. కానీ ఈ కరోనా కష్ట సమయంలో కూడా కొంతలో కొంత ఎలా సంతోషంగా సెలవు దినమైన ఆదివారాన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు. అందుకు తగ్గ ప్లానింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

* ఆదివారం ఈరోజు సెలవు కాబట్టి కాస్త లేట్ గానే నిద్ర లేస్తారు. లేచిన వెంటనే చాలా మందికి సెల్ ఫోన్ లో న్యూస్ చూడటం అలవాటు, ఎక్కువగా మూవీకి సంబందించిన స్పెషల్ అండ్ తాజా న్యూస్ ల కోసం తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. ఏ న్యూస్ ఛానల్ లో మంచి తాజా వార్తలు, మంచి వార్తలు వస్తాయా అని వెతుకుతుంటారు. ఇలాంటి వారు మన ఏపీ హెరాల్డ్ న్యూస్ ఛానల్ ని చూస్తే మరింత  తాజా సమాచారం, ఎంటర్టైన్మెంట్ పక్కాగా దొరుకుతుంది.

* అంతే కాకుండా నేటి  పరిస్థితులలో బయట ఫుడ్ ప్రమాదం కాబట్టి ఇంట్లోనే వండుకుని తినడం శ్రేయస్కరం. కాకపోతే రోజులా కాకుండా కాస్త స్పెషల్ గా బయట హోటల్స్ లో దొరికే ఫుడ్ ఐటెమ్స్ లాగా ట్రై చేస్తే బాగుంటుంది. బయట స్పెషల్ ఐటమ్స్ మిస్ అవుతున్నామనే బాధ కాస్తయినా తగ్గుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో మనకు కావలసిన అన్ని రకాల రెసిపీ గురించి క్లియర్ గా ఉంటుంది. 

* కాబట్టి రొటీన్ గా కాకుండా యూట్యూబ్ లో చూసి కొత్త వంటకాలు జాగ్రత్తగా ఇంట్లోనే చేసుకుని సంతోషంగా భోజనం చేయవచ్చు. ఇది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రుచికరమైన భోజనం ఎప్పుడూ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.

* ఇక మధ్యాహ్నం మనకు నచ్చిన కొత్త సినిమాలను ముందుగానే ప్లాన్ చేసుకుని సెల్ ఫోన్ లో చూసేయొచ్చు. అందులోనూ ఇపుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. వాటిలో మనకు నచ్చింది ఎంపిక చేసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. 

* సాయంత్రం ఎలాగూ ఈ కరోనా పీరియడ్ లో మన బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ మన  సొంత ఊళ్లకు వెళ్లి  మన కుటుంబ సభ్యులను కానీ కలిసే పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఎవరిని అయితే బాగా మిస్ అవుతూ ఉంటామో వారితో వీడియో కాల్ చేసి మాట్లాడేలా ప్లాన్ చేసుకుంటే ఆ లోటు కూడా తీరిపోతుంది.

* కుదిరితే ఈవెనింగ్ స్నాక్స్, మన ఫ్యామిలీ లతో మన ఇంటి ముందు కాస్త సందడిగా కూర్చుని మాట్లాడటం. చిన్న గేమ్ ఎదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక రాత్రికి బోజనానికి బదులుగా ఏవైనా స్పెషల్ ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది. అలా అని ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి. ఆయిల్ లెస్ స్పెషల్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి అలాంటివి సెలెక్ట్ చేసుకోండి.

* ఇక ఆ తర్వాత వీలైతే ఏదైనా వెబ్ సిరీస్ , లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడటం కాసేపు ఇంట్లోని సభ్యులతో సరదాగా మాట్లాడి సమయానికి నిద్రపోతే సండే ప్రశాంతంగా సంతోషంగా గడచిపోతుంది.

మరి మీరు మీ ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేసుకుని చూడండి.



కరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

టీ సర్కార్ జీవో రద్దు చేయండి!

పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

పామును అందులో దూర్చి ఏం చేశాడో తెలుసా..?

మా’ ఎన్నికాలు ఇప్పట్లో జరగవా ?

ఆమె దొంగ ప్రేమ యువకుడి ప్రాణాలు తీసిందా..?

పెట్రో మంట.. మళ్ళీ మొదలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>