PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan908fd717-aef8-4fe9-896e-af6930b968c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan908fd717-aef8-4fe9-896e-af6930b968c5-415x250-IndiaHerald.jpgజగన్ రాజకీయ జీవితం పుష్కర కాలం పూర్తి అయింది. ఈ మధ్యలో ఎన్నో దశలను జగన్ చూశారు. ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నారు. జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో రకాలైన ఇబ్బందులను ఫేస్ చేశారు. సరే ముఖ్యమంత్రి అయ్యారు. మనశ్శాంతి ఉందా అంటే అదే కరవు అన్నట్లుగా పరిస్థితి ఉంది. jagan{#}Jaganజగన్... శతృవులు పెరుగుతున్నారే... ?జగన్... శతృవులు పెరుగుతున్నారే... ?jagan{#}JaganSun, 04 Jul 2021 20:00:28 GMTజగన్ రాజకీయ జీవితం పుష్కర కాలం పూర్తి అయింది. ఈ మధ్యలో ఎన్నో దశలను జగన్ చూశారు. ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నారు. జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో రకాలైన ఇబ్బందులను ఫేస్ చేశారు. సరే ముఖ్యమంత్రి అయ్యారు. మనశ్శాంతి ఉందా అంటే అదే కరవు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

ఒక రాజకీయ నాయకుడిగా జగన్ తిన్నన్ని తిట్లు ఎవరూ తిని ఉండరేమో. రాజకీయాలలో ప్రత్యర్ధులే ఉంటారు. శత్రువులు కారు అంటారు. కానీ జగన్ విషయంలో అది తప్పు అని తేలుతోంది. జగన్ కి ప్రత్యర్ధులు లేరు. శతృవులే ఉంటున్నారు. వారు వాడే పరుషమైన భాష ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జగన్ ని దేవుడుగా భావించే వారు ఒక వైపు ఉంటే ఆయన్ని దారుణంగా విమర్శించే వారు మరో వైపు ఉన్నారు.

ఈ మధ్యనే తెలంగాణా మంత్రులు జగన్ని నీటి దొంగ అని గజదొంగ అంటూ నానా మాటలు అన్నారు. ఇక తెలంగాణా రాజకీయాల్లో కూడా జగన్ని విమర్శించేవారే ఎక్కువగా  ఉన్నారు. ఒక వర్గం మీడియా అయితే జగన్ మీద అనేక రకాలుగా వార్తలు వండి వారుస్తోంది. ఇక ఏపీలో జగన్ కి మిత్ర పక్షం అంటూ ఎవరూ లేరు. అందరూ ఆయన్ని టార్గెట్ చేసేవారు. అందరూ నిందించేవారే.

ఇది చాలదు అన్నట్లుగా ఈ మధ్యనే జైలు నుంచి బెయిల్ మీద విడుదలై వచ్చిన జిల్లా న్యాయమూర్తి ఒకరు జగన్ మీద దారుణంగానే విమర్శలు చేశారు. జగన్ ని మతిలేని వాడిగా ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అభిమానులు బావురు మనాల్సిందే. ఇంతకు ముందే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు జగన్ విషయంలో చాలానే కామెంట్స్ చేశారు. ఇక టీడీపీ జగన్ కి ఇచ్చిన బిరుదులు చాలానే ఉన్నాయి. ఫ్రాక్షనిస్టు అని, లక్ష కోట్లను దోచుకున్న అవినీతి పరుడు అని వారు అంటారు. మొత్తం మీద చూసుకుంటే ఇన్నేసి విమర్శలు, తిట్లు భరిస్తూ ముందుకు సాగుతున్నారు అంటే జగన్ కి ఉన్న సహనం మెచ్చాల్సిందే. ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉండవచ్చు. శత్రువులు పెరిగితే ప్రమాదమే సుమా.





జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

ఫోన్లు వదిలేసి పారిపోతున్నారంట!

వైసీపీలో ఆమె వ‌న్ టైం ఎంపీగా మిగిలిపోతారా.. ?

ఈ వైసీపీ రాజు గారు మంత్రి అవుతారా... ?

ఆ విష‌యంలో జ‌గ‌న్ డ‌బుల్ డిగ్రీ పట్టాలు తీసుకున్నారట‌...?

పోలవరం ప్రాజెక్టుతో మూడు లక్షల మందికి ప్రమాదమా...?

జ‌గ‌న్ కేబినెట్లో ఈ డిప్యూటీ సీఎంలు అవుటేనా ?

జ‌గ‌న్ కేబినెట్లో ప‌శ్చిమ కొత్త మంత్రులు వీళ్లేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>