PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8d05427f-5525-4454-8226-fa7c030acab5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8d05427f-5525-4454-8226-fa7c030acab5-415x250-IndiaHerald.jpgప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని పార్టీకి ప‌నిచేశారు.. ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పార్టీకి విధేయులంటే వీరేన‌ని ఓదార్పు యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారికి మంత్రి ప‌ద‌వులిస్తాన‌ని, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వీరి సంగ‌తి మాత్రం గాలికొదిలేశారా? లేదంటే కావాల‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అనేది ఆయ‌న‌కే తెలియాలి. వారెవ‌రంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుtag{#}Telugu Desam Party;Ponnur;Vinukonda;Y. S. Rajasekhara Reddy;Ayodhya;Guntur;Party;Ministerక‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?క‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?tag{#}Telugu Desam Party;Ponnur;Vinukonda;Y. S. Rajasekhara Reddy;Ayodhya;Guntur;Party;MinisterSun, 04 Jul 2021 10:56:04 GMT
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని పార్టీకి ప‌నిచేశారు.. ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పార్టీకి విధేయులంటే వీరేన‌ని ఓదార్పు యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారికి మంత్రి ప‌ద‌వులిస్తాన‌ని, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వీరి సంగ‌తి మాత్రం గాలికొదిలేశారా?  లేదంటే కావాల‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అనేది ఆయ‌న‌కే తెలియాలి. వారెవ‌రంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి విధేయులుగా ఉంటూ వ‌స్తోన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌,మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. చిత్ర‌మేమిటంటే వీరంతా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

ప‌ద‌వుల పంప‌కంలో అన్యాయం?
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అమ‌లుచేస్తోన్న ప‌ద‌వుల పంప‌కమ‌నేది గుంటూరు జిల్లా నేత‌ల‌ను తీవ్ర అన్యాయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్సీగా పంపిస్తాన‌ని, మంత్రి ప‌ద‌విస్తాన‌ని చెప్పి ఏరుదాటిన త‌ర్వాత తెప్ప త‌గ‌లేసే రీతిలో వ్య‌వ‌హ‌రించారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయంగా, పారిశ్రామికంగా త‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తార‌నుకునేవారికే ఆయ‌న ప‌దవులు కేటాయిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డికి న‌ర‌స‌రావుపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశం క‌ల్పించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రాజ్య‌స‌భ స‌భ్యుణ్ని చేశారు. అలాగే లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవ‌కాశం ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ తాజాగా ఎమ్మెల్సీ ప‌ద‌విని కేటాయించార‌నే విష‌యాన్ని విశ్లేష‌కులు గుర్తుచేస్తున్నారు.

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు తీవ్ర అన్యాయం?
చిల‌క‌లూరిపేట నుంచి విడుద‌ల ర‌జ‌నికి అవ‌కాశం ఇస్తున్నాను.. అధికారంలోకి రాగానే రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. రెండు సంవ‌త్స‌రాలు దాటిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు ఆ హామీ ఊసే లేదు. ఈ విష‌యంలో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న వారంద‌రిలో ఉంది. అలాగే వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావుకు అవ‌కాశం క‌ల్పిస్తాన‌న్నారు. ఇవ్వ‌లేదు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న జీవీ ఆంజ‌నేయుల‌ను ఓడించ‌డంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. అలాగే పొన్నూరు నుంచి కిలారి రోశ‌య్య‌కు ఎమ్మెల్యేగా అవ‌కాశం క‌ల్పిస్తూ రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ప‌ద‌వి ఇస్తాన‌న్నారు. ఇంత‌వ‌ర‌కు ఆయ‌న గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా వీరేకాకుండా చివ‌రి నిముషంలో పార్టీచేరి గెలుపున‌కు స‌హ‌క‌రించిన నేత‌లు మ‌రికొంద‌రు కూడా ఉన్న‌ప్ప‌టికీ వారంతా తీవ్ర  అన్యాయానికి గుర‌వుతున్నారు.






వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి త‌న దూకుడును మొద‌లుపెట్టేశారు. మాట‌ల‌తోనే నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఎవ‌రిపైనైనా, ఏ విష‌యంలోనైనా విమ‌ర్శించ‌డానికి తాను వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కేసీఆర్ అనుచ‌రులు నోటికొచ్చిన‌ట్లు తిడుతుంటే విజ‌య‌మ్మ‌కానీ, జ‌గ‌న్‌కానీ ఏం చేస్తున్న‌ట్ల‌ని ప్ర‌శ్నించారు.

రాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?

అలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని పార్టీకి ప‌నిచేశారు.. ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పార్టీకి విధేయులంటే వీరేన‌ని ఓదార్పు యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారికి మంత్రి ప‌ద‌వులిస్తాన‌ని, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వీరి సంగ‌తి మాత్రం గాలికొదిలేశారా? లేదంటే కావాల‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అనేది ఆయ‌న‌కే తెలియాలి. వారెవ‌రంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి విధేయులుగా ఉంటూ వ‌స్తోన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌,మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. చిత్ర‌మేమిటంటే వీరంతా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఉత్తరాఖండ్ కొత్త సిఎం.. ఎవరు ఈ పుష్కర్ సింగ్ దామీ?

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>