PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-db99581b-5db0-4230-a3ce-6ec4fb6469a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-db99581b-5db0-4230-a3ce-6ec4fb6469a8-415x250-IndiaHerald.jpgసిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని, మారుతున్న కాలానికనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మనం మారాలని రైతులకు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే మాత్రమే అనుకూలంగా ఉండేవని కానీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతం పెరగడం వలన ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలPolitical {#}mandalam;kaleshwaram;vegetable market;Manam;oil;Minister;District;CM;Government;Telanganaరైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!Political {#}mandalam;kaleshwaram;vegetable market;Manam;oil;Minister;District;CM;Government;TelanganaSun, 04 Jul 2021 09:05:00 GMTసిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని,  మారుతున్న కాలానికనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మనం మారాలని రైతులకు మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే మాత్రమే  అనుకూలంగా ఉండేవని కానీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతం పెరగడం వలన  ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు అనుకూలంగా ఉన్నాయన్నారు.  ఆయిల్ ఫామ్ లాభసాటి పంటని 60 వేల కోట్ల పామాయిల్ మొక్కలను  ఇతర దేశాల నుంచి కొనుగోలు, దిగుమతి చేసి మన దేశంలో నాటుతున్న మని మనమే పామాయిల్ తోటలు పెడితే ఎగుమతి చేసేలా ఎదుగుతామని రైతులకు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా తెలంగాణలో ఈ ఏడాది అత్యధిక పంట పండిందన్నారు. 52 లక్షల ఎకరాల్లో యాసంగి, 1 కోటి 40 లక్షల వడ్లు, ధాన్యం పండించిందని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వడ్లు ఎఫ్ సీఐ కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్య మన్నారు. పామాయిల్ సాగుకు అవసరమైన వనరులన్నీ సబ్సిడీ రూపంలో పెట్టుబడిగా ప్రభుత్వమే సాయం చేస్తుందని మంత్రి తెలిపారు. రైతు బాగుపడాలన్నదే కెసిఆర్ లక్ష్యమన్నారు. పామాయిల్ సాగు డ్రిప్ కై హెక్టారుకు 43 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతు కేవలం 4300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, మిగతా 39 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు . ఒక్క ఎకరానికి 1 లక్షా 20 వేల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు హరీష్ రావు సూచించారు.

దేశ వ్యాప్తంగా 8 లక్షల 25 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నదని, దేశ అవసరాలకు 70 లక్షల ఎకరాల పామాయిల్ సాగు చేయాలని, ఆ దిశగా సాగు చేస్తే విదేశాల నుంచి దిగుమతి నిలిచిపోతుందని  అందుకని  సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల 25 వేల ఎకరాలు పెట్టాలని నిర్ణ యించారన్నారు. అయితే 50 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలిపారు.
పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉందని, అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా, అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,  రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు కోరారు.



ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

అలాంటి సినిమాలకు హీరోయిన్లు దూరం..!

జగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..

టీ సర్కార్ జీవో రద్దు చేయండి!

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

పెట్రో మంట.. మళ్ళీ మొదలు!

నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?

ఇడుపుల పాయలో జగన్, షర్మిల భేటీ ఎప్పుడంటే..?

పెళ్లై ఏడేళ్లు.. ఇద్దరు పిల్లలు..అయినా ప్రియుడితో కలసి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>