PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/history-a12672e1-8a90-4ee4-a071-e337611bebbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/history-a12672e1-8a90-4ee4-a071-e337611bebbe-415x250-IndiaHerald.jpgస్వాతంత్రోద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన మహావీరులు అల్లూరి యొక్క ఉద్యమ స్ఫూర్తి చాలా గొప్పది. ఆయనను చూస్తేనే తెల్లోనికి నిద్ర పట్టేది కాదు. సాయుధ పోరాటం ద్వారానే మనకు స్వేచ్ఛ దొరుకుతుందని నమ్మిన సిద్ధాంతం కోసం భరతజాతి కొరకు ప్రాణాలు అర్పించాడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన మన్యం పులి ఈ అల్లూరి. ఈయన బ్రతికింది 27 సంవత్సరాలు కానీ, చరిత్రలో నిలిచిపోయాడు. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయక గిరిజన ప్రజల కోసం పోరాడి వారందరికీ పోరాట స్ఫూర్తిని నేHistory {#}Vijayanagaram;East Godavari;West Godavari;village;king;Tiger;Police Station;Bhimavaram;Vizianagaram;police;Father;Magadheera;sree;Traffic police;Alluri Sitarama Raju;Indiaఅగ్గి పిడుగు అల్లూరి..?అగ్గి పిడుగు అల్లూరి..?History {#}Vijayanagaram;East Godavari;West Godavari;village;king;Tiger;Police Station;Bhimavaram;Vizianagaram;police;Father;Magadheera;sree;Traffic police;Alluri Sitarama Raju;IndiaSun, 04 Jul 2021 11:05:00 GMTస్వాతంత్రోద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన మహావీరులు అల్లూరి యొక్క ఉద్యమ స్ఫూర్తి చాలా గొప్పది. ఆయనను చూస్తేనే తెల్లోనికి నిద్ర పట్టేది కాదు. సాయుధ పోరాటం ద్వారానే మనకు స్వేచ్ఛ దొరుకుతుందని  నమ్మిన సిద్ధాంతం కోసం భరతజాతి కొరకు ప్రాణాలు అర్పించాడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన  మన్యం పులి  ఈ అల్లూరి. ఈయన బ్రతికింది 27 సంవత్సరాలు కానీ, చరిత్రలో నిలిచిపోయాడు. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయక గిరిజన ప్రజల కోసం పోరాడి  వారందరికీ  పోరాట స్ఫూర్తిని నేర్పించి దేశభక్తి జ్వాలను రగిల్చిన మహోన్నత వ్యక్తి. తెల్లోళ్లను తల్లఢిల్లించిన ఈ అడవి బిడ్డ  1897 జూలై 4వ తేదీన తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మలకు  జన్మించారు.

ఈయన అసలు పేరు శ్రీ రామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్లు సొంత ఊరు. కానీ తమ తాతగారి స్వగ్రామమైన విజయనగరం జిల్లా దగ్గర్లోని  పాండ్రంగిలో తన తాత ఇంట్లో పుట్టాడు. అల్లూరి ఆరో తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి మృతి చెందాడు. కటిక పేదరికం కారణంగా కుటుంబమంతా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. తర్వాత 1909  లో భీమవరం దగ్గర కొవ్వాడ ప్రాంతానికి మకాం మార్చారు. భీమవరం మిషన్ హైస్కూల్లో చేరాడు. 1912 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో  ఏడో తరగతి పాస్ అయ్యారు. 1915 ఇంటినుంచి వెళ్ళిపోయి  ఉత్తర భారతదేశం అంతా పర్యటించారు. రెండు సంవత్సరాల తర్వాత  కృష్ణదేవిపేట చేరుకున్నారు. ఆ సమయంలోనే  ఆయనకు బ్రిటిష్ వారు ప్రజలను ఏవిధంగా దోచు కుంటున్నారో ఆ కష్టాల అన్నింటిని  చూశాడు. వారిలో చైతన్యం తీసుకువచ్చి బ్రిటిష్ వారిని కొంతమంది ఉంచాలని నిర్ణయించుకున్నాడు.

అలా  మన్యం ప్రజలలో తనకు వచ్చిన విద్య, ఆయుర్వేదంతో, ఆధ్యాత్మిక బోధనలతో వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శ్రీ రామ రాజు నాయకుడయ్యాడు. మన్యం ప్రజలకు యుద్ధ విద్యలు నేర్పి పోరాటానికి సిద్ధం చేశారు. 1922 ఆగస్టు 22వ తేదీన  మన్యం ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయింది.  మొదటిసారి 300 మంది మాన్యం వీరులతో  చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడ ఉన్న రికార్డులను తుంచేసి, తుపాకులను మందుగుండును ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్ కి ఎలాంటి హాని తలపెట్టలేదు. అలా  తన తిరుగుబాటును ప్రారంభించి  బ్రిటిషర్లకు  చుక్కలు చూపించిన మగధీర అల్లూరి సీతారామరాజు. చివరికి 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామం దగ్గర స్నానం చేస్తుండగా, పోలీసులు చుట్టుముట్టి, అక్కడే ఒక చెట్టుకు కట్టివేసి కాల్చి చంపారు. అతని చితా భస్మాన్ని దగ్గరలో ఉన్న వహార నదిలో పడేశారు. అలా 27 ఏళ్ల ఈ వయసులోనే ప్రాణాలర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు.



రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

ఇండియన్ క్రికెట్ ని శాసిస్తున్న లేడీ క్రికెటర్..!!

ఆన్లైన్ క్లాసులు కాదు.. అశ్లీల వీడియోలు?

యువకుడి కామం.. చెరువులో శవం.. విచారణలో దిమ్మతిరిగే నిజం?

సీఎంకు స్పెషల్ కోర్ట్ షాక్.. ఆ భూములు ఎలా ఇస్తారు..?

రాజమౌళి సినిమా.. కీరవాణి మ్యూజిక్.. ఈ కాంబోకి తిరుగులేదు..!

బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

ఆమె దొంగ ప్రేమ యువకుడి ప్రాణాలు తీసిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>