EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ntr-trust-bhavan-lo-kotlalo-avakatavakalu2b93df22-2819-4736-910d-6bd86cef6394-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ntr-trust-bhavan-lo-kotlalo-avakatavakalu2b93df22-2819-4736-910d-6bd86cef6394-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ ట్రస్ట్.. నందమూరి తారక రామారావు పేరిట నమోదైన ట్రస్టు.. ట్రస్టు అంటే సేవా కార్యాకలాపాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇలాంటి చోట్ల స్వచ్చంద సేవలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి సంస్థల పట్ల ప్రభుత్వాలు కూడా ఉదారంగా ఉంటాయి.. ఉండాలి కూడా. ఇలాంటి ట్రస్టులకు ఉచితంగానో.. నామ మాత్రపు ధరకో భూములు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్టు విషయంలోనూ అదే జరిగింది. అయితే స్వచ్చంధ సేవ కోసం తీసుకున్న భూముల్లో ఇతర కార్యక్రమాలు చేపడితే.. అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ JAGAN{#}CBN;NTR;Jagan;V Vijayasai Reddy;Government;Service;TDP;YCP;Party;Telanganaఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?JAGAN{#}CBN;NTR;Jagan;V Vijayasai Reddy;Government;Service;TDP;YCP;Party;TelanganaSun, 04 Jul 2021 10:00:00 GMTఎన్టీఆర్ ట్రస్ట్.. నందమూరి తారక రామారావు పేరిట నమోదైన ట్రస్టు.. ట్రస్టు అంటే సేవా కార్యాకలాపాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇలాంటి చోట్ల స్వచ్చంద సేవలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి సంస్థల పట్ల ప్రభుత్వాలు కూడా ఉదారంగా ఉంటాయి.. ఉండాలి కూడా. ఇలాంటి ట్రస్టులకు ఉచితంగానో.. నామ మాత్రపు ధరకో భూములు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్టు విషయంలోనూ అదే జరిగింది.  


అయితే స్వచ్చంధ సేవ కోసం తీసుకున్న భూముల్లో ఇతర కార్యక్రమాలు చేపడితే.. అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు పేరిట అదే జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఉన్న పార్టీ ఆఫీసులన్నీ బాబు కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయని సాక్షాత్తూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టు లీజుకు తీసుకున్న స్థలాల్లో, ఆక్రమించుకున్న భూముల్లో అనేక భారీ భవనాలు  నిర్మించారని.. ఈ భారీ భవనాలు వేటికీ సరైన అనుమతులు లేవని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా ఆరోపించారు.


ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ పేరిట ఉన్న భూముల్లోని భవనాల విలువ వందల కోట్లలో ఉంటుందని.. దర్యాప్తు జరిపిస్తే బండారం మొత్తం  బయట పడుతుందని విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇది నిజమే అని విజయసాయిరెడ్డి భావిస్తే.. కేవలం ట్వీట్ చేసి వదిలిపెట్టకుండా న్యాయపోరాటం చేయాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భూమలు ప్రధానంగా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇప్పుడంటే కళ కోల్పోయింది కానీ.. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ ఓ వెలుగు వెలిగింది.


టీడీపీ ప్రధాన కార్యాలయం కొలువు తీరింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే కదా. మరి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భూములు, అక్రమ భవనాల విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతుందా.. లేక ట్వీట్లతోనే వ్యవహరం వదిలేస్తుందా.. సరే.. తెలంగాణ విషయం వదిలేద్దాం.. ఏపీలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు భూములు, భవనాలు ఉంటాయి కదా. మరి వాటిపై జగన్ సర్కారు విచారణ జరిపిస్తుందా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

" style="height: 328px;">
 





చైనా చీప్ ట్రిక్స్.. స్టూడెంట్స్ ఆయుధంగా?

జెండా వెంకయ్య సేవలు మరువలేం.. చివరి రోజుల్లో ఆయన !

అక్రమ ప్రాజెక్టులకు కెసిఆరే కారణం.. !

రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!

జగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..

టీ సర్కార్ జీవో రద్దు చేయండి!

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

పెట్రో మంట.. మళ్ళీ మొదలు!

నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>