Hyderabad
oi-Shashidhar S
పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారడం.. పార్టీ ఫిరాయింపులే. ఫిరాయింపుల చట్టం కింద నేరం కూడా.. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్తగా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓటుకు నోటు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి.. ఇప్పుడు వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అందుకే వారిని తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని… దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి గెలవాలని సవాల్ విసిరారు.

తప్పుడు కూతలు మానుకోకుంటే ప్రజలే రాళ్లతో కొడతారని సీతక్క హెచ్చరించారు. కార్యకర్తల అభీష్టం మేరకే రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారని సీతక్క చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే స్పీకర్‌పైనా చర్యలు తీసుకోవాలని.. కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.
సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొన్నారని ఆరోపించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే, అధికార పార్టీకి అమ్ముడుపోయే వారికి సిగ్గుండాలని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్లపై కొందరు పార్టీ మారిన, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దానికి సీతక్క కౌంటర్ ఇచ్చారు.
English summary
congress mla sithakka suggest to mlas, pls resign and contest than win again.
Story first published: Sunday, July 4, 2021, 19:32 [IST]