PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-modi-mamatha-benarjee60454aad-bef4-4cac-8207-45bfded896e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-modi-mamatha-benarjee60454aad-bef4-4cac-8207-45bfded896e3-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం మార్చింది. నాలుగు నెల‌లు కూడా కాక‌ముందే ప‌ద‌వి నుంచి దింపి కొత్త‌గా మ‌రొక‌రిని తెచ్చింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగ‌నున్నాయి. తీర‌త్‌ను దింపేయడానికి కారణం పని తీరు కాదని, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మేన‌ని బీజేపీ చెపుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఆయన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయలేదు. ఇప్పటికీ ఎంపీగా కొన‌సాగుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో ఎంపిక కావాల్సి ఉండ‌గా రెండు నెలలు మాత్రమే ఇంకా స‌మ‌యం ఉందిPOLITICS;MODI ;MAMATHA BENARJEE{#}West Bengal - Kolkata;Mamta Mohandas;Elections;రాజీనామా;Party;MP;Assembly;Bharatiya Janata Party;Coronavirusఉత్త‌రాఖండ్ నుంచి బెంగాల్ రాజ‌కీయం..?ఉత్త‌రాఖండ్ నుంచి బెంగాల్ రాజ‌కీయం..?POLITICS;MODI ;MAMATHA BENARJEE{#}West Bengal - Kolkata;Mamta Mohandas;Elections;రాజీనామా;Party;MP;Assembly;Bharatiya Janata Party;CoronavirusSun, 04 Jul 2021 19:00:00 GMT
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం మార్చింది. నాలుగు నెల‌లు కూడా కాక‌ముందే ప‌ద‌వి నుంచి దింపి కొత్త‌గా మ‌రొక‌రిని తెచ్చింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగ‌నున్నాయి. తీర‌త్‌ను దింపేయడానికి కారణం పని తీరు కాదని, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మేన‌ని బీజేపీ చెపుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఆయన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయలేదు. ఇప్పటికీ ఎంపీగా కొన‌సాగుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో ఎంపిక కావాల్సి ఉండ‌గా రెండు నెలలు మాత్రమే ఇంకా స‌మ‌యం ఉంది.

ఉత్తరాంఖండ్‌లో రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండ‌టంతో కేంద్రం ఎప్పుడ‌నుకుంటే అప్పుడు ఉప ఎన్నిక‌లు పెట్ట‌వ‌చ్చు. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం స్ప‌ష్టం చేస్తోంది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ‌లేర‌నే ఉద్దేశంతో ఆయ‌న్ను తొల‌గించి మ‌రొక‌రిని నియ‌మించారు. కానీ బీజేపీ అధిష్టానం ఎన్నిక‌లు పెట్టాల‌నుకుంటే పెద్ద క‌ష్ట‌మేం కాదు. ఎందుకంటే క‌రోనా ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో కూడా ప‌శ్చిమ‌బెంగాల్ కోసం త‌హ‌త‌హ‌లాడారు ఆ పార్టీ పెద్ద‌లు. రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్న‌ప్ప‌టికీ ఆయనను తప్పించాలనే బీజేపీ అధిష్టానం డిసైడైంది.

దీనికి కారణం.. బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికలలో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటికీ మ‌మ‌త నందిగ్రామ్‌లో ఓట‌మిపాల‌య్యారు. తన సొంత నియోజ‌క‌వ‌ర్గం భవానీపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించారు. అక్కడ ఉపఎన్నిక నవంబర్‌లోపు జ‌ర‌గాలి. ఒక‌వేళ మ‌మ‌త అసెంబ్లీకి ఎన్నిక కాకపోతే ఆమె కూడా రాజీనామా చేయాల్సిందే.

క‌రోనా మూడోద‌శ గురించి వైద్య‌నిపుణులు హెచ్చ‌రిక‌లతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలంటున్నాయి. న‌వంబ‌రులోపు ఎన్నిక జ‌ర‌గ‌క‌పోతే తీర‌త్ చేసిన‌ట్లే మ‌మ‌త కూడా రాజీనామా చేయాలి. బెంగాల్ కోసం ర‌క‌ర‌కాల వ్యూహాలు అమ‌లుచేస్తోన్న బీజేపీని ఈసారి మ‌మ‌త ఎలా ఎదుర్కొంటార‌నే ఉత్కంఠ దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది.



కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కేసీఆర్ ముహూర్తం.. అవుట్‌... ఇన్ లిస్ట్ ఇదే..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖ‌ర్చు రు. 300 కోట్లు ?

జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

జ‌గ‌న్‌పై జ‌డ్జి రామ‌కృష్ణ ధ్వ‌జం.. మ‌తిమ‌రుపు.. మాయ‌రోగం అని సెటైర్లు

కృష్ణా జ‌లాల‌పై కేసీఆర్ విశ్వ‌రూపం..?

న‌వంబ‌ర్ లోపు ఉప ఎన్నిక‌లు లేక‌పోతే సీఎం ప‌ద‌వికి మామ‌త రాజీనామాయే..!

షాక్‌: హుజూరాబాద్ ఉప ఎన్నిక గోవిందా..?

పరశురామ్ ని తొందర చేస్తున్న మహేష్... త్రివిక్రమ్ కోసమేనా?

పోతిరెడ్డిపాడుకు కేసీఆర్ మార్క్ ఎస‌రు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>