PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rafel67867ee5-f8e3-43e2-9f18-08c840e704db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rafel67867ee5-f8e3-43e2-9f18-08c840e704db-415x250-IndiaHerald.jpgరఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ వివాదంపై పెద్ద దుమారమే చెలరేగింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఈ వివాదాన్ని ప్రధాన అస్త్రంగా వాడింది. డసో ఏవియేషన్‌ భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవడంపై కూడా అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎలా చేర్చుకుంటారని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆ తరవాత వివాదం సrafel{#}Congress;Hanu Raghavapudi;contract;mediaమోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?మోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?rafel{#}Congress;Hanu Raghavapudi;contract;mediaSun, 04 Jul 2021 08:06:00 GMTరఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ వివాదంపై పెద్ద దుమారమే చెలరేగింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఈ వివాదాన్ని ప్రధాన అస్త్రంగా వాడింది. డసో ఏవియేషన్‌ భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవడంపై కూడా అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎలా చేర్చుకుంటారని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.


ఆ తరవాత వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు లేవని సుప్రీంకోర్టు తేల్చడంతో వివాదం చాలా వరకూ సమసిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ రఫేల్ వివాదం మొదలైంది. రఫేల్‌ యుద్ధ విమానాల విక్రయ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో విచారణ ప్రారంభం కావడం మళ్లీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది.


ఫ్రాన్స్‌లో ఈ కేసు దర్యాప్తునకు ఒక న్యాయమూర్తిని  నియమించినట్లు ఆ దేశ మీడియా పార్ట్‌ తెలిపింది. ఒప్పందంలో లంచాల వ్యవహారం నిగ్గుతేల్చనున్నట్లు చెబుతోంది. భారత్‌తో 2016లో కుదిరిన 59వేల కోట్ల రూపాయల రఫేల్‌ యుద్ధ విమానాల విక్రయ ఒప్పందంలో లంచాలు, అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైందని మీడియా పార్ట్‌ చెబుతోంది. జూన్‌ 14న ప్రారంభమైన ఈ దర్యాప్తులో భాగంగా ఒక న్యాయమూర్తిని కూడా నియమించారట. ఫ్రాన్స్‌ జాతీయ ఆర్థిక ప్రాసిక్యూటర్స్‌ కార్యాలయం ఈ దర్యాప్తు నిర్వహిస్తోందట.


రఫేల్ ఒప్పందం ఖరారు సమయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్‌ హోలండే వ్యవహరించిన తీరుపైనే ప్రధానంగా దర్యాప్తు సాగుతుందట. రఫేల్‌ ఒప్పందం విజయవంతంగా పూర్తి కావడానికి తయారీ సంస్ధ డసో ఏవియేషన్‌ భారత్‌లోని మధ్యవర్తికి ఒక మిలియన్‌ యూరోలు లంచంగా ఇచ్చిందని మీడియాపార్ట్‌ గతంలోనూ ఆరోపించింది. రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభంకావడంతో భారత్‌లో మళ్లీ వేడి రాజుకుంటోంది.





రఫేల్‌ యుద్ధ విమానాల విక్రయ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో విచారణ ప్రారంభం కావడం మళ్లీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఫ్రాన్స్‌లో ఈ కేసు దర్యాప్తునకు ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ దేశ మీడియా పార్ట్‌ తెలిపింది.

జోక్యం చేసుకోడానికి నువ్వెవరు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తైవాన్?

బిగ్ బాస్ దివి.. సిలక ముక్కు దాన సాంగ్.. ఓ లుక్కేసుకొండి..!

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మద్దాలికి మద్ధతు పెరుగుతుందా?

రేవంత్‌ రూట్‌లో ట్విస్ట్‌లు..బ్యాగ్రౌండ్‌లో బాబు సెట్ చేస్తున్నారా?

మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?

కాజల్ ప్రెగ్నెన్సీ పై క్లారిటీ.. !

చంద్ర‌బాబు తెర‌మ‌రుగు.. రీజ‌న్ ఇదేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>