PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poratam-cheyalsina-samayamlo-chandrababu-silent-endukayyarub73265f5-5432-4dcb-854b-c82c456626d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poratam-cheyalsina-samayamlo-chandrababu-silent-endukayyarub73265f5-5432-4dcb-854b-c82c456626d1-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం రోజురోజుకి ముదురుతుంది. తెలంగాణ మంత్రులు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మ‌రోవైపు నాగార్జున సాగ‌ర్‌,శ్రీశైలం ప్రాజెక్టుల వ‌ద్ద రెండు రాష్ట్రాలు నుంచి భారీగా పోలీసులు మోహ‌రించ‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నీటిని త‌ర‌లించుకుపోతుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆరోపిస్తుంటే...తెలంగాణ అక్ర‌మంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆరోపిస్తుంది.గ‌త వారం రోజుల నుంచి రెండు ప్ర‌భుత్వాల మ‌ద్య మాtdp;{#}electricity;police;Telugu Desam Party;Party;TDP;Andhra Pradesh;Telangana;Minister;YCP;Akkineni Nagarjunaపోరాటం చేయాల్సిన టైంలో బాబు సైలెంట్ ఎందుక‌య్యారు...?పోరాటం చేయాల్సిన టైంలో బాబు సైలెంట్ ఎందుక‌య్యారు...?tdp;{#}electricity;police;Telugu Desam Party;Party;TDP;Andhra Pradesh;Telangana;Minister;YCP;Akkineni NagarjunaSun, 04 Jul 2021 13:19:28 GMTతెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం రోజురోజుకి ముదురుతుంది. తెలంగాణ మంత్రులు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మ‌రోవైపు నాగార్జున సాగ‌ర్‌,శ్రీశైలం ప్రాజెక్టుల వ‌ద్ద రెండు రాష్ట్రాలు నుంచి భారీగా పోలీసులు మోహ‌రించ‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నీటిని త‌ర‌లించుకుపోతుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆరోపిస్తుంటే...తెలంగాణ అక్ర‌మంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆరోపిస్తుంది.గ‌త వారం రోజుల నుంచి రెండు ప్ర‌భుత్వాల మ‌ద్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం జ‌ల‌జ‌గడంపై పెద్దగా స్పందించ‌డంలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాత్రం వైసీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి ఈ విష‌యంపై మాట్లాడారు.అయితే టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ జ‌ల వివాదాన్ని చూస్తు ఉన్నారు త‌ప్ప ఎక్క‌డా మాట్లాడ‌లేదు.

గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్ప‌ప్పుడు క‌ర్నూల్ లో జ‌ల‌దీక్ష చేప‌ట్టారు.ఆ దీక్ష‌లో చంద్ర‌బాబు,కేసీఆర్ తీరును ఎండ‌గ‌ట్టారు.ఎవ‌డ‌బ్బా సోమ్మ‌ని నీళ్లుతీసుకుపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. కృష్ణా,గోదావ‌రి నందుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టులు క‌డుతుంద‌ని జ‌ల‌దీక్ష‌లో నాడు జ‌గ‌న్ ఆరోపించారు.పాలమూరు,డిండి ప్రాజెక్టులతో రాయ‌ల‌సీమ‌,ప్ర‌కాశం,నెల్లూరు జిల్లాలు ఏడారిగా మారిపోతాయ‌ని జ‌ల‌దీక్ష‌లో వ్యాఖ్య‌నించారు.అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మించ‌డాన్ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తుంది.దీనిపై గ‌త వారం రోజులుగా రెండు రాష్ట్రాల అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతుంది.అయితే నాడు ఇదే విష‌యంపై ప్ర‌తిప‌క్షంలో ఉండి జ‌గ‌న్ పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు పోరాటం చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చినా ఎందుకు చేయ‌డంలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.నాడు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండి రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయిన్ని ప్రశ్నించార‌ని..ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌ర‌గుతున్న చంద్ర‌బాబు నోరు ఎందుకు మెద‌ప‌డంలేద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.మ‌రి జ‌ల‌జ‌గ‌డంపై టీడీనీ అధినేత చంద్ర‌బాబు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో వేచి చూడాలి.



జ‌గ‌న్ కేబినెట్లో ఈ డిప్యూటీ సీఎంలు అవుటేనా ?

రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే చెప్పు దెబ్బలే..!

అబ్బో.. కాజల్ రేంజ్ కి సరైన రోల్ ఇచ్చారుగా!!

జ‌గ‌న్ కేబినెట్లో ప‌శ్చిమ కొత్త మంత్రులు వీళ్లేనా ?

ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేనా ?

అమీర్ తో సహా విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే

ఏపీలో క‌మీష‌న్లు ఎవ‌రెవ‌రికి అందుతున్నాయి??

మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు...?

వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>