PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr6f14dbbf-5f0b-49f1-b2aa-470be696b13d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr6f14dbbf-5f0b-49f1-b2aa-470be696b13d-415x250-IndiaHerald.jpgకేటీఆర్ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ఆయనే.. ఒక్క మాటలో చెప్పాలంటే అనధికార ముఖ్యమంత్రి కూడా. కానీ.. ఆయన పరిధికి కూడా పరిమితులు ఉంటాయి. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి.. ఆయన చేతిలో కొన్ని అధికారాలు ఉంటాయి. అందుకే కేటీఆర్‌ తన పరిమితికి మించి కేంద్రం పరిధిలోని అంశంపై కొన్నాళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అలా కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలకించారు. ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేటీఆర్ అడిగిన పని పూర్తయ్యేలా చేశారు. ఇంతకీ కేటీఆర్ అడిగిందేంటి.ktr{#}KTR;Hyderabad;G Kishan Reddy;CM;Prime Minister;Telangana Chief Minister;Minister;contract;Letter;central government;Coronavirus;Indiaకేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?ktr{#}KTR;Hyderabad;G Kishan Reddy;CM;Prime Minister;Telangana Chief Minister;Minister;contract;Letter;central government;Coronavirus;IndiaSun, 04 Jul 2021 06:12:08 GMTకేటీఆర్ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ఆయనే.. ఒక్క మాటలో చెప్పాలంటే అనధికార ముఖ్యమంత్రి కూడా. కానీ.. ఆయన పరిధికి కూడా పరిమితులు ఉంటాయి. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి.. ఆయన చేతిలో కొన్ని అధికారాలు ఉంటాయి. అందుకే కేటీఆర్‌ తన పరిమితికి మించి కేంద్రం పరిధిలోని అంశంపై కొన్నాళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అలా కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలకించారు. ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేటీఆర్ అడిగిన పని పూర్తయ్యేలా చేశారు.


ఇంతకీ కేటీఆర్ అడిగిందేంటి.. కిషన్ రెడ్డి ఇచ్చిందేంటి.. అదే వ్యాక్సిన్ టెస్టింగ్‌ కేంద్రం.. అవును.. హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా మారుతోంది. ప్రత్యేకించి ఈ కరోనా సమయంలో దేశానికి వ్యాక్సిన్ అందించింది హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ. హైదరాబాద్‌ లోని జీనోమ్‌ వ్యాలీ అనేక పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్‌కే చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో వ్యాక్సీన్ల కోసం కేంద్రం ఒప్పందం కూడా కుదుర్చుకుంది.


ఇలా వ్యాక్సీన్ల రాజధానిగా మారిన హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ మాత్రం లేదు. ప్రస్తుతం దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవీ ఉత్తరాదిలోనే ఉన్నాయి. అందుకే హైదరాబాద్‌ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కొన్నాళ్ల క్రితం కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై దృష్టి సారించిన కిషన్ రెడ్డి.. మొత్తానికి కేంద్రాన్ని ఒప్పించి హైదరాబాద్‌కు వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ మంజూరు చేయించారు. వచ్చేనెల రోజుల్లో హైదరాబాద్‌లో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

పీఎం కేర్ నిధుల ద్వారా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి వివరించారు. దేశంలోని మూడో టెస్టింగ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ అనేక పెద్ద ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందన్న కిషన్‌రెడ్డి ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం హైదరాబాద్‌కు తలమానికం కానుందని పేర్కొన్నారు. పీఎం కేర్ నిధులతో.. హైదరాబాద్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీకి కిషన్‌రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.





హైదరాబాద్‌ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కొన్నాళ్ల క్రితం కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై దృష్టి సారించిన కిషన్ రెడ్డి.. మొత్తానికి కేంద్రాన్ని ఒప్పించి హైదరాబాద్‌కు వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ మంజూరు చేయించారు.

జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...

జగన్‌కు బలమైన ఓటు బ్యాంక్ దూరం కానుందా?

సోలోగా ఫైట్ చేస్తున్న జనసేన నేత...వర్కౌట్ అవుతుందా?

మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?

అన్నమా, ఆన్ లైన్ తరగతులా?

ధనుష్.. వెంకీ.. స్టోరీ లీక్..!

ఒప్పందాలే లేవ్.. కృష్ణా బోర్డు చెప్పేదేంటి.. కేసీఆర్ వాదన..!

66:34 కాదు.. 50:50 - ఏపీపై బాంబు పేల్చిన కేసీఆర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>