PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e77617e1-448e-4555-9671-2ca3e63efc1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e77617e1-448e-4555-9671-2ca3e63efc1b-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి భూ కుంభ‌కోణం కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ఉచ్చు బిగుస్తుంది.ఈ కేసులో కీల‌క సాక్షిగా సీఆర్‌డీఏ మాజీ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయ‌న్ని సీఐడీ అధికారులు విచారించారు. విచార‌ణ‌లు చెరుకూరి శ్రీధ‌ర్ కీల‌క విష‌యాల‌ను సీఐడీ అధికారుల‌కు తెలిపారు. రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారుల‌కు శ్రీధ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు.2015లో ల్యాండ్ పూలింగ్‌కి ముందే 2014 అక్టోబ‌ర్‌లో తూళ్లూరు మండ‌లం రికార్డుల‌ను ర‌హ‌స్యంగా తెప్పించుకున్నార‌ని శ్రీధ‌ర్ తెలిపారు.జ‌న‌వ‌రిలో ల్యాండ్ పూలింగ్ ప‌క్రిtdp;{#}TDP;YCP;High court;Telugu Desam Party;Minister;Andhra Pradeshమాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు...?మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు...?tdp;{#}TDP;YCP;High court;Telugu Desam Party;Minister;Andhra PradeshSun, 04 Jul 2021 11:55:23 GMTఅమ‌రావ‌తి భూ కుంభ‌కోణం కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ఉచ్చు బిగుస్తుంది.ఈ కేసులో కీల‌క సాక్షిగా సీఆర్‌డీఏ మాజీ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయ‌న్ని సీఐడీ అధికారులు విచారించారు. విచార‌ణ‌లు చెరుకూరి శ్రీధ‌ర్ కీల‌క విష‌యాల‌ను సీఐడీ అధికారుల‌కు తెలిపారు. రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారుల‌కు శ్రీధ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు.2015లో ల్యాండ్ పూలింగ్‌కి ముందే 2014 అక్టోబ‌ర్‌లో తూళ్లూరు మండ‌లం రికార్డుల‌ను ర‌హ‌స్యంగా తెప్పించుకున్నార‌ని శ్రీధ‌ర్ తెలిపారు.జ‌న‌వ‌రిలో ల్యాండ్ పూలింగ్ ప‌క్రియ ప్రారంభ‌మైంద‌ని వెల్ల‌డించారు. అసైన్డ్ భూముల సేక‌ర‌ణ‌పై జీవో 41 తీసుకు వ‌చ్చార‌ని ఇదంతా మాజీ మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌వేక్షించార‌ని సీఐడీ అధికారుల‌కు శ్రీధ‌ర్ వివ‌రించారు.అయితే ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్దంగా ఉన్న అంశాల‌ను మాజీ మంత్రి నారాయ‌ణ దృష్టికి తాను తీసుకెళ్లాన‌ని..చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని ముందే చెప్పినా నారాయ‌ణ వినిపించుకోలేద‌ని శ్రీధ‌ర్ వెల్ల‌డించారు.మాజీ మంత్రి నారాయ‌ణ ఆదేశాల‌తోనే భూముల వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని శ్రీధ‌ర్ సీఐడీ అధికారుల‌కు తెలిపారు.అయితే దీనిపై విచార‌ణకు అనుమ‌తి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌నుంది.
2014లో ఏపీలో అధికారం చేప‌ట్టిన తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం ప్ర‌పంచం గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌ధాని నిర్మించాల‌ని భావించింది.దీనికి పెద్ద ఎత్తున రైతుల వ‌ద్ద‌నుంచి భూమిని స‌మీక‌రించారు.మంద‌డం,వెల‌గ‌పూడి,తూళ్తూరు,రాయ‌పూడితో పాటుమొత్తం 29 గ్రామాల్లో భారీగా ల్యాండ్ పూలింగ్ చేప‌ట్టారు. రైతుల నుంచి భూముల‌ను సేక‌రించే బాధ్య‌త‌ను అప్ప‌టి మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ తీసుకున్నారు.రాజ‌ధానిలో ప్ర‌తి క‌ట్ట‌డంలో నారాయ‌ణ కీల‌క పాత్ర వ‌హించారు.రాజధాని నిర్మాణానికి మొత్తం 34 వేల ఎక‌రాల భూమిని సేక‌రించారు.ఆ భూముల్లో మినిస్ట‌ర్ క్వాట‌ర్స్‌,ఎమ్మెల్యే క్వాట‌ర్స్‌, హైకోర్టు జ‌డ్జిల నివాసం,హైకోర్టు,స‌చివాల‌యం,అసెంబ్లీతో పాటు ప‌లు యూనివ‌ర్సిటీల‌కు భూముల‌ను కేటాయించారు.టీడీపీ ప్ర‌భుత్వ హ‌యంలో దాదాపుగా ఈ నిర్మాణాల‌న్నీ పూర్తికావోచ్చాయి.వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక రాజ‌ధానిలో నిర్మాణాల‌న్నీ ఆగిపోయాయి. రాజ‌ధాని నిర్మాణంలో టీడీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డింద‌ని వైసీపీ ఆరోపించింది.దీనికి సంబంధించి సీఐడీ కేసుల‌ను కూడా న‌మోదు చేసింది.ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లను కోర్టులో నిల‌వ‌లేదు.అయితే తాజాగా అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంలో సీఐడీ కీల‌క విష‌యాల‌ను రాబ‌డుతుంది.టీడీపీ ప్ర‌భుత్వంలో సీఆర్డీయే క‌మిష‌న‌ర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధ‌ర్‌ని సీఐడీ విచారించింది.దీంతో కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మాజీ మంత్రి నారాయ‌ణ‌పై ఇప్పుడు సీఐడీ ఫోక‌స్ పెట్టింది.హైకోర్టు అనుమ‌తితో ఈ కేసులో నారాయ‌ణ‌ను విచారించ‌నుంది.


ఏపీలో క‌మీష‌న్లు ఎవ‌రెవ‌రికి అందుతున్నాయి??

వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

రాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

క‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?

ఉత్తరాఖండ్ కొత్త సిఎం.. ఎవరు ఈ పుష్కర్ సింగ్ దామీ?

సీఎంకు స్పెషల్ కోర్ట్ షాక్.. ఆ భూములు ఎలా ఇస్తారు..?

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>