MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anchor-ravi-movie-gossipe1ad0ad4-a98b-4f66-8062-5c77e1d9de3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anchor-ravi-movie-gossipe1ad0ad4-a98b-4f66-8062-5c77e1d9de3b-415x250-IndiaHerald.jpgచిలిపి యాంకర్ గా యూత్ కి నచ్చే యాంకర్ గా పేరుతెచ్చుకున్న రవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెరపై "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రామ్ తో గుర్తింపు పొందిన రవి ఆ తర్వాత ఎన్నో షోలకు యాంకరింగ్ చేశాడు. తనదైన శైలిలో పంచులు విసరడం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సరదా మాటలతో మైమరిపించడం ఇతనికున్న టాలెంట్.ANCHOR RAVI MOVIE GOSSIP{#}Lokesh;ravi anchor;Lokesh Kanagaraj;Ayodhya;Heroine;Hero;Cinema;Coronavirusఅలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?అలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?ANCHOR RAVI MOVIE GOSSIP{#}Lokesh;ravi anchor;Lokesh Kanagaraj;Ayodhya;Heroine;Hero;Cinema;CoronavirusSun, 04 Jul 2021 11:00:00 GMTచిలిపి యాంకర్ గా యూత్ కి నచ్చే యాంకర్ గా పేరుతెచ్చుకున్న రవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెరపై "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రామ్ తో గుర్తింపు పొందిన రవి ఆ తర్వాత ఎన్నో షోలకు యాంకరింగ్ చేశాడు. తనదైన శైలిలో పంచులు విసరడం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సరదా మాటలతో మైమరిపించడం ఇతనికున్న టాలెంట్.  అయితే వ్యాఖ్యాతగా భారీ సంఖ్యలో అభిమానులను తన ఖాతాలో వేసుకున్న ఈ యాంకర్ బుల్లి తెరపైనే  కాకుండా వెండితెరపై కూడా సందడి చేశారు. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఇది నా ప్రేమకథ" అనే సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మేఘన లోకేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2017 రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయింది. 

కానీ నటుడిగా రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అంజి దేవండ్ల దర్శకత్వంలో "తోట బావి" సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోవడం గమనార్హం. కరోనా కారణంగా థియేటర్లకు అనుమతి లేకపోవడంతో వాయిదా పడింది. త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు రవి గురించి మరో మూవీ గాసిప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. యాంకర్ రవి ఒక స్టార్ హీరో చిత్రంలో నెగటివ్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంప్రదింపులు సంభాషణలు జరిగిపోయాయని, రవి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని అందుకు భారీగానే పారితోషకం అందుకున్నారు అని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇది ఎవరి సినిమా మిగిలిన పాత్రధారుల వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. కరోనా సమస్య ముగిసిపోగానే నిర్మాణ పనులు మొదలవుతాయని తెలుస్తోంది. హీరోగా మొదలెట్టి నెగటివ్ పాత్రలను చేయడానికి సిద్ధపడిన రవి కెరీర్ ఊపందుకుంటుందా చూడాలి.



గురూజీ ఫోకస్ తప్పుతుందా!!

కొర‌టాల ప్రెసెంట్స్ స‌త్య‌దేవ్ పోస్టర్.. !

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్న వెంకటేష్ దూకుడు !

క‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?

వైరల్ : గేదెతో నిరసన.. చివరికి వాచిపోయింది?

అసదుద్దీన్ ఓవైసీ దేశంలోనే పెద్ద నాయ‌కుడు : యోగి

శ్రీనువైట్ల మళ్లీ అదే తప్పు.. ఇలా అయితే కష్టమే!!

నాడు టీచర్.. నేడు డ్రైవర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>