PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla-have-many-problems-7b2f8b77-f37b-4883-8ec4-e46d1026b806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mla-have-many-problems-7b2f8b77-f37b-4883-8ec4-e46d1026b806-415x250-IndiaHerald.jpgఇక వైఎస్సార్ చలువతో 2009లోనూ రెండవమారు గెలిచిన కన్నబాబురాజు నాడే మంత్రి పదవిని ఆశించారు. అయితే జిల్లాలో ఉన్న సమీకరణల నేపధ్యంలో ఏజెన్సీకి చెందిన సీనియర్ నేత పసుపులేటి బలరాజుని మంత్రిని చేశారు వైఎస్సార్. రూరల్ జిల్లాకు రెండవసారి చాన్స్ ఇస్తానని అన్నారు. అలా కనుక చూసుకుంటే నాడు రాజు మంత్రి అయ్యేవారు అంటారు. కానీ వైఎస్సార్ ఆకస్మిక మరణంతో జిల్లా రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఆ రెండవ పదవిని ప్రజారాజ్యం నుంచి నాడు జంప్ చేసిన గంటా శ్రీనివాసరావుకు దక్కింది. సరే 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుYsrcp{#}Kurasala Kannababu;Chakram;Hanu Raghavapudi;District;TDP;Congress;ashok;Minister;Y. S. Rajasekhara Reddy;Jagan;king;war;Vishakapatnam;YCP;MLAఈ వైసీపీ రాజు గారు మంత్రి అవుతారా... ?ఈ వైసీపీ రాజు గారు మంత్రి అవుతారా... ?Ysrcp{#}Kurasala Kannababu;Chakram;Hanu Raghavapudi;District;TDP;Congress;ashok;Minister;Y. S. Rajasekhara Reddy;Jagan;king;war;Vishakapatnam;YCP;MLASun, 04 Jul 2021 15:24:00 GMTవిశాఖ జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాలలో ఎలమంచిలి ఒకటి. ఇక్కడ రాజులకు మొదటి నుంచి పట్టుంది. అలాగే సామాజికవర్గ సమీకరణలు చూసుకున్నపుడు కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ ఇద్దరి మధ్యనే రాజకీయ యుద్ధం ఎపుడూ జరుగుతూ ఉంటుంది. ఒకసారి వారు గెలిస్తే మరోసారి వీరు చక్రం తిప్పుతారు. ఈ విధంగా చూసుకుంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కన్నబాబురాజు తొలిసారి  ఎమ్మెల్యేగా గెలిచి జెండా ఎగరేశారు. ఆయన వైఎస్సార్ చరిష్మాతో పాటు తన సొంత బలాన్ని జత కలిపి ఎమ్మెల్యే అయిపోయారు.

ఇక వైఎస్సార్ చలువతో 2009లోనూ రెండవమారు గెలిచిన కన్నబాబురాజు నాడే మంత్రి పదవిని ఆశించారు. అయితే జిల్లాలో ఉన్న సమీకరణల నేపధ్యంలో ఏజెన్సీకి చెందిన సీనియర్ నేత  పసుపులేటి బలరాజుని మంత్రిని చేశారు వైఎస్సార్. రూరల్ జిల్లాకు రెండవసారి చాన్స్ ఇస్తానని అన్నారు. అలా కనుక చూసుకుంటే నాడు రాజు మంత్రి అయ్యేవారు అంటారు. కానీ వైఎస్సార్ ఆకస్మిక మరణంతో  జిల్లా రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఆ రెండవ పదవిని  ప్రజారాజ్యం నుంచి నాడు  జంప్ చేసిన గంటా శ్రీనివాసరావుకు దక్కింది. సరే 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన కన్నబాబు రాజు 2019 నాటికి వైసీపీలో చేరిపోయారు. ఆయన అనుకున్నట్లుగానే ఎమ్మెల్యే అయ్యారు.

ఆయన్ని వైసీపీ సర్కార్ టీడీపీ పాలకమండలి మెంబర్ గా చేసింది. ఇక ఆయన కుమారుడి సుకుమార వర్మను రెండవసారి డీసీసీబీ చైర్మన్ ని చేసింది. అయితే ఈసారితో తన రాజకీయ సరి అని రాజు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకుని తాను రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. అందువల్ల తన చిరకాల కోరిక మంత్రి పదవిని ఆయన వైసీపీ అధినాయకత్వం ముందుంచుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల్లోని ప్రముఖ రాజ కుటుంబం అయిన పూసపాటి వారితో వైసీపీ అతి పెద్ద రాజకీయ  యుద్ధమే చేస్తోంది. దాంతో ఈ ప్రాంతంలో రాజుల మద్దతు దక్కాలి అంటే మాత్రం కన్నబాబురాజుని మంత్రిని చేయడం మంచి ఆలోచనే అనే వారు ఉన్నారు.

ఇక విశాఖ జిల్లాలో చూసుకుంటే గతంలో టీడీపీ హయాంలో ఆనందగజపతిరాజు, ఆర్ ఎస్ డీపీ అప్పలనరసిం హరాజు మంత్రులు అయ్యారు. కాంగ్రెస్ జమానాలో ఎపుడూ వారికి చాన్స్ దక్కలేదు. జగన్ ఆ చరిత్రను తిరగరాస్తే మాత్రం సీనియర్ ఎమ్మెల్యేగా రాజుకు ఛాన్స్ దక్కవచ్చు. ఇపుడు అశోక్ తో వైసీపీ వైరం ఏమైనా ఆయనకు ప్లస్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి..!

 



తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్?

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?

రామారావు మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండు : కేసీఆర్

ఫోన్లు వదిలేసి పారిపోతున్నారంట!

అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే VS టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ ?

'రామ్ చరణ్ - శంకర్' సినిమా కథ ఇదే..?

వైసీపీలో ఆమె వ‌న్ టైం ఎంపీగా మిగిలిపోతారా.. ?

వైసీపీలో ఎంపీ స‌త్య‌వ‌తి వ‌ర్సెస్ ఎమ్మెల్యే అమ‌ర్నాథ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>