SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/d-ramanaidu8e6ac344-e9b1-4d00-9b79-407c7a4269cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/d-ramanaidu8e6ac344-e9b1-4d00-9b79-407c7a4269cb-415x250-IndiaHerald.jpgడి రామానాయుడు.. భారతీయ చలన చిత్ర నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. డి రామానాయుడు 1936వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే గ్రామంలో జన్మించారు. అదే గ్రామంలో తన పాఠశాల విద్యను అభ్యసించి చీరాలకు ఉన్నత పాఠశాల చదువుల కోసం వెళ్ళాడు. తర్వాత చెన్నై లోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు. జీవనోపాధి కోసం మొదట బియ్యం మిల్లు యజమానిగా మారి , ఆ తర్వాత రవాణా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. D RAMANAIDU{#}Degree;February;Cancer;Akkineni Nageswara Rao;Bapatla;Parliament;June;savitri;Savithri;Chitram;Prakasam;Chennai;House;Cinema;School;Andhra Pradesh;Suresh;D Ramanaidu;Fatherస్మరణ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన డి.రామానాయుడు..స్మరణ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన డి.రామానాయుడు..D RAMANAIDU{#}Degree;February;Cancer;Akkineni Nageswara Rao;Bapatla;Parliament;June;savitri;Savithri;Chitram;Prakasam;Chennai;House;Cinema;School;Andhra Pradesh;Suresh;D Ramanaidu;FatherSun, 04 Jul 2021 02:00:00 GMT
డి రామానాయుడు.. భారతీయ చలన చిత్ర నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. డి రామానాయుడు 1936వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే గ్రామంలో జన్మించారు. అదే గ్రామంలో తన  పాఠశాల విద్యను అభ్యసించి చీరాలకు ఉన్నత పాఠశాల చదువుల కోసం వెళ్ళాడు. తర్వాత చెన్నై లోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు. జీవనోపాధి కోసం మొదట బియ్యం మిల్లు యజమానిగా మారి , ఆ తర్వాత రవాణా వ్యాపార రంగంలోకి  ప్రవేశించారు.


ఒకసారి తన తండ్రి బంధువులను కలిసినప్పుడు వారు సినిమాలకు నిర్మాతగా ఉండమని అడిగారట.అలా మొదటిసారిగా 1958వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి జంటగా వచ్చిన నమ్మినబంటు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు డూప్ గా కూడా పనిచేశారు. రైసుమిల్లులో  లాభాలు సరిగ్గా రావడం లేదని అసంతృప్తి చెంది, మిల్లు ను  మూసి వేయడం కూడా  జరిగింది. ఆ తర్వాత ఇటుకల వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. కానీ  రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. ఇక ఆంధ్ర క్లబ్ కు తరచు వెళ్తూ ఉండటం వల్ల అక్కడ చలనచిత్ర నటీనటులతో మంచి పరిచయం ఏర్పడింది.


1963లో తన స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. 1963లో వచ్చిన అనురాగం చిత్రాన్ని నిర్మించారు. ఇక వాణిజ్య పరంగా ఈ చిత్రం కలెక్షన్లు ఏ మాత్రం రాబట్టలేకపోయింది. ఆ తర్వాత తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ హౌస్ ను  ఏర్పాటు చేసి, దాని ద్వారా సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు డి.రామానాయుడు. అలా 1964 లో  రాముడు భీముడు చిత్రాన్ని మొదటిసారిగా నిర్మించారు. ఇక అప్పుడు మొదలై ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నారు సురేష్ ప్రొడక్షన్ వారు..


రామానాయుడు తన నిర్మాణ సంస్థ ద్వారా ఏకంగా 150 చిత్రాల కంటే ఎక్కువ సినిమాలను  నిర్మించడంతో, ఈ అరుదైన రికార్డును సృష్టించిన ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్  రికార్డులో 2013లో స్థానం సంపాదించుకున్నారు.అంతేకాదు  పార్లమెంటు సభ్యుడిగా కూడా 1999 నుంచి 2004 వరకు పనిచేశారు. బాపట్ల నియోజకవర్గం నుండి లోకసభ సభ్యుడుగా ఎంపికయ్యారు. 2015 ఫిబ్రవరి 18వ తేదీన ప్రోస్టేట్ క్యాన్సర్ తో  మరణించారు.





సోలోగా ఫైట్ చేస్తున్న జనసేన నేత...వర్కౌట్ అవుతుందా?

నల్లారి బ్రదర్ రంగంలోకి దిగారుగా...సెట్ అవుతారా?

మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?

ధనుష్.. వెంకీ.. స్టోరీ లీక్..!

ఒప్పందాలే లేవ్.. కృష్ణా బోర్డు చెప్పేదేంటి.. కేసీఆర్ వాదన..!

66:34 కాదు.. 50:50 - ఏపీపై బాంబు పేల్చిన కేసీఆర్..!

కాజల్ ప్రెగ్నెన్సీ పై క్లారిటీ.. !

అఖిల్ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న మెగాస్టార్..!

డి.రామానాయుడు తన నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఏకంగా 150 చిత్రాల కంటే ఎక్కువ సినిమాలను నిర్మించడంతో, ఈ అరుదైన రికార్డును సృష్టించిన ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2013లో స్థానం సంపాదించుకున్నారు.అంతేకాదు పార్లమెంటు సభ్యుడిగా కూడా 1999 నుంచి 2004 వరకు పనిచేశారు. బాపట్ల నియోజకవర్గం నుండి లోకసభ సభ్యుడుగా ఎంపికయ్యారు. 2015 ఫిబ్రవరి 18వ తేదీన ప్రోస్టేట్ క్యాన్సర్ తో మరణించారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>