PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawane60f6b82-ff19-400b-afae-1d2336380238-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawane60f6b82-ff19-400b-afae-1d2336380238-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో జనసేన నాయకులు యాక్టివ్‌గా పనిచేస్తున్నారా? అంటే అబ్బే అసలు లేదని చెప్పేయొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది జనసేన నేతలు పార్టీలు మారిపోయారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం పెద్దగా ఏపీ వచ్చి పోరాటాలు చేసే పరిస్తితి కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.pawan{#}Krishna River;Janasena;Jagan;Pawan Kalyan;TDP;Minister;YCP;job;Andhra Pradeshసోలోగా ఫైట్ చేస్తున్న జనసేన నేత...వర్కౌట్ అవుతుందా?సోలోగా ఫైట్ చేస్తున్న జనసేన నేత...వర్కౌట్ అవుతుందా?pawan{#}Krishna River;Janasena;Jagan;Pawan Kalyan;TDP;Minister;YCP;job;Andhra PradeshSun, 04 Jul 2021 01:00:00 GMTఏపీ రాజకీయాల్లో జనసేన నాయకులు యాక్టివ్‌గా పనిచేస్తున్నారా? అంటే అబ్బే అసలు లేదని చెప్పేయొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది జనసేన నేతలు పార్టీలు మారిపోయారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం పెద్దగా ఏపీ వచ్చి పోరాటాలు చేసే పరిస్తితి కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.


అధ్యక్షుడే సైలెంట్‌గా ఉండేసరికి ఏపీలోని జనసేన నేతలు కంటికి కనిపించడం లేదు. ఏ నియోజకవర్గంలో చూసిన టీడీపీ నేతలు, వైసీపీ మీద పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు గానీ, జనసేన నేతలు బయటకొచ్చి పోరాటం చేయడం ఎక్కువగా కనబడట్లేదు. ఇక కృష్ణా జిల్లాలో ఉన్న జనసేన నేతలది అదే పరిస్తితి. కానీ ఈ జిల్లాలో జనసేన తరుపున ఒక నాయకుడు మాత్రం సోలోగా ఫైట్ చేస్తున్నారు.


విజయవాడ వెస్ట్ ఇన్‌చార్జ్ పోతిన మహేష్ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో మహేష్ జనసేన తరుపున పోటీ చేసి 20 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు. ఇలా ఘోరంగా ఓడిపోయినా సరే మహేష్ మాత్రం తన పోరాటాన్ని ఆపడం లేదు. ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై మహేష్ గట్టిగానే పోరాడుతున్నారు. వెల్లంపల్లి ఆలయాల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ ఏదొక విషయంపై మహేష్ స్పందిస్తూ, వెల్లంపల్లిని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.


వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ యాక్టివ్‌గా లేకపోయినా సరే జనసేన తరుపున మహేష్ మాత్రం యాక్టివ్‌గా ఉంటూ వెల్లంపల్లి అవినీతి చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. అలాగే ఇతర సమస్యలపై కూడా మహేష్ పోరాటం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ నిరుద్యోగులని మోసం చేశారని చెప్పి మహేష్ నిరుద్యోగులకు మద్ధతుగా పోరాటం చేస్తున్నారు. ఇలా జనసేన నాయకుల్లో మహేష్ మాత్రం సోలోగానే ఫైట్ చేస్తూ ముందుకెళుతున్నారు. మరి ఈయన పోరాటం ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి. 




నల్లారి బ్రదర్ రంగంలోకి దిగారుగా...సెట్ అవుతారా?

మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?

ఒప్పందాలే లేవ్.. కృష్ణా బోర్డు చెప్పేదేంటి.. కేసీఆర్ వాదన..!

66:34 కాదు.. 50:50 - ఏపీపై బాంబు పేల్చిన కేసీఆర్..!

కరోనా తగ్గుముఖంతో ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ ....

ఏపీలో అధికారంలో ఉన్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో విఫలమయ్యారని పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన కూడా కొందరు ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఏదో జగన్ ఇమేజ్ మీద ఆధారపడి మాత్రం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప, సొంతంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందా? అంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ చేసి రేవంత్‌కు పీసీసీ ఇప్పించారని ఆరోపణలు వస్తున్నాయి. బాబు కాంగ్రెస్ అధిష్టానాన్ని కొనేశారని మాట్లాడుతున్నారు.

రాజకీయాల్లో యువత ఓట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. యువత ఎక్కువగా ఎవరికి మద్ధతుగా ఇస్తే వారే గెలుస్తారు. అలాంటి యువత గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్‌కు మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన ఓటర్లతో సహ, ఇంకా రాష్ట్రంలో ఉన్న యువ ఓటర్లు జగన్‌కు సపోర్ట్ చేసి వైసీపీని గెలిపించారు.

ఏపీ రాజకీయాల్లో జనసేన నాయకులు యాక్టివ్‌గా పనిచేస్తున్నారా? అంటే అబ్బే అసలు లేదని చెప్పేయొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది జనసేన నేతలు పార్టీలు మారిపోయారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం పెద్దగా ఏపీ వచ్చి పోరాటాలు చేసే పరిస్తితి కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>