PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp8759fbae-674a-4fec-83b6-d1492d194fe7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp8759fbae-674a-4fec-83b6-d1492d194fe7-415x250-IndiaHerald.jpgఅశోక్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయ్యాక కీలకమైన ఫైళ్ళు పత్రాలు తీసుకురమ్మని అధికారులను కోరినా ఇంతవరకూ వారు ఆయన మాటను ఖాతరు చేయకపోవడం విశేషం. మాన్సస్ అధికారులు ఏకంగా చైర్మన్ మాటను బేఖాతరు చేయడం వెనక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి గత ఏడాదిన్నర కాలంలో సంచయిత చైర్ పర్సన్ గా ఉండగా జరిగిన కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు కావాలని కోరినా కూడా అధికారులు స్పందించకపోవడం నిజంగా విడ్డూరంగానే చెప్పాలి. Ashok Gajapathi Raju{#}ashok;Simhachalam;Service;central government;Party;Minister;YCPమాన్సాస్‌లో యేడాదిలోనే ఇన్ని అవకతవకలా.. అశోక్‌కు బ్రేకులు ?మాన్సాస్‌లో యేడాదిలోనే ఇన్ని అవకతవకలా.. అశోక్‌కు బ్రేకులు ?Ashok Gajapathi Raju{#}ashok;Simhachalam;Service;central government;Party;Minister;YCPSun, 04 Jul 2021 13:44:08 GMTవిజయనగరం పూసపాటి రాజులు అంటే అందరికీ గౌరవం. అది వారి సేవలు, దానాలకు జనాలు ఇచ్చే మర్యాద. వందల ఏళ్ళ నుంచి వారి సంస్థానం ద్వారా ప్రజలకు అనేక రకాలుగా ప్రయోజనం సమకూరింది. ఇక దాదాపు ఆరున్నర దశాబ్దాల కాలంగా మాన్సాస్ ట్రస్ట్ ద్వారా రాజులు చేస్తున్న సేవ నిరుపమానం, విద్యా, వైద్య రంగాలల్లో వారి కృషి గొప్పదని అంతా చెబుతారు. అటువంటి మాన్సాస్ ట్రస్ట్ ని రాజకీయాల  కోసం వివాదాల పాలు చేస్తోంది వైసీపీ సర్కార్ అన్న విమర్శలు అంతటా ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని తప్పించడం తప్పుడు విధానం అన్న మాట అంతటా ఉంది. అయినా సరే తమ మాటే నెగ్గాలన్న వైసీపీ పెద్దల పంతంతో అశోక్ ని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారు.

అశోక్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయ్యాక కీలకమైన  ఫైళ్ళు పత్రాలు తీసుకురమ్మని అధికారులను కోరినా ఇంతవరకూ వారు ఆయన  మాటను ఖాతరు చేయకపోవడం విశేషం. మాన్సస్ అధికారులు ఏకంగా చైర్మన్ మాటను బేఖాతరు చేయడం వెనక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి గత ఏడాదిన్నర కాలంలో సంచయిత చైర్ పర్సన్ గా ఉండగా జరిగిన కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు కావాలని కోరినా కూడా అధికారులు స్పందించకపోవడం నిజంగా విడ్డూరంగానే చెప్పాలి.

మరో విషయం ఏంటి అంటే సింహాచలం వంశపారంపర్య ధర్మకర్త హోదాలో అశోక్ స్వామిని దర్శనం చేసుకుంటే  ఆయనకు ఆలయ మర్యాదలు పూర్తిగా చేయకపోవడం కూడా ప్రభుత్వ వివక్షకు నిదర్శనం అంటున్నారు. ఇదిలా ఉంటే అశోక్ ని చైర్మన్ గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన హోదా తాత్కాలికమే అని గట్టిగా చెబుతారు. బహుశా ఈ మాటలు వినే మాన్సాస్ అధికారులు, అటు దేవస్థానం అధికారులు కూడా అశోక్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు అంటున్నారు.

ఒక విధంగా పదవిలో ఉన్నా కూడా అశోక్ చేతులు కట్టేసి కధ నడిపించడానికే చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి అశోక్ విషయంలో వైసీపీ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు విమర్శల పాలు అవుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ వారిది. ప్రభుత్వ పరిధి ఈ విషయంలో ఎంత ఉండాలో అంతే ఉండాలని మేధావులు అంటున్నారు. అశోక్ ప్రభుత్వ సహకారం కోసం చూస్తూంటే ఆయన్ని నిలువరించాలని అక్కసులో చేస్తున్న‌ ప్రయత్నాలు బెడిసి కొడతాయి అని కూడా హెచ్చరిస్తున్నారు. కాగా అశోక్ అడిగిన కీలకమైన పత్రాలు ఇవ్వకపోవడం వెనక సీక్రెట్ ఏంటి, ఏడాదిన్నర సంచయిత ఏలుబడిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి మరి.



నాపై అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నారు - ష‌ర్మిల అనుచ‌రురాలు

ఏపీకి విభ‌జ‌న చ‌ట్టాలు.. కేసీఆర్‌కు చుట్టాలు..!!

మాన్సాస్‌లో యేడాదిన్న‌ర‌లోనే లెక్క‌కు మిక్కిలిగా అవ‌క‌త‌వ‌క‌లు ?

జ‌గ‌న్ కేబినెట్లో ఈ డిప్యూటీ సీఎంలు అవుటేనా ?

పోరాటం చేయాల్సిన టైంలో బాబు సైలెంట్ ఎందుక‌య్యారు...?

రీల్ కోసం రియల్ ఫైట్..! మనోళ్లు మాత్రం..!

రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే చెప్పు దెబ్బలే..!

జ‌గ‌న్ కేబినెట్లో ప‌శ్చిమ కొత్త మంత్రులు వీళ్లేనా ?

ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>