PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-president-chandrababu-special-focus-on-vijayawada-central820011b3-974b-4171-a73e-b33ca4434901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-president-chandrababu-special-focus-on-vijayawada-central820011b3-974b-4171-a73e-b33ca4434901-415x250-IndiaHerald.jpgబెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టారు. 2019 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో ఈ సీటుని టీడీపీ కోల్పోయింది.2014 ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి మ‌ల్లాది విష్ణు గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది.అయితే ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పెద్ద‌గా సీట్ల‌ను గెలుచుకోలేక‌పోయింది.దీనికి ప్ర‌ధాన కారణం నాయ‌కులు మ‌ధ్య ఆధtdp{#}Meera;swetha;vishnu;Bonda;Kesineni Nani;Vemuri Radhakrishna;Nani;Hanu Raghavapudi;TDP;MLA;MP;Party;Amaravathi;YCP;Cheque;Minister;mediaబెజ‌వాడ సెంట్ర‌ల్‌పై బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌...ఈ సారి ఛాన్స్ ఆయ‌న‌కేనా..?బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌...ఈ సారి ఛాన్స్ ఆయ‌న‌కేనా..?tdp{#}Meera;swetha;vishnu;Bonda;Kesineni Nani;Vemuri Radhakrishna;Nani;Hanu Raghavapudi;TDP;MLA;MP;Party;Amaravathi;YCP;Cheque;Minister;mediaSun, 04 Jul 2021 20:07:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టారు. 2019 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో ఈ సీటుని టీడీపీ కోల్పోయింది.2014 ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి మ‌ల్లాది విష్ణు గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది.అయితే ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పెద్ద‌గా సీట్ల‌ను గెలుచుకోలేక‌పోయింది.దీనికి ప్ర‌ధాన కారణం నాయ‌కులు మ‌ధ్య ఆధిప‌త్య‌మే అని స్ప‌ష్టంగా క‌నిపించింది.ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు టీడీపీ నేత‌లు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు,బుద్దా వెంక‌న్న‌,నాగుల్ మీరా పెట్టిన మీడియా స‌మావేశం వ‌ల్ల పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది.

నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా ఉన్న బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు గ‌తంలో మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అధిష్టానంపై అలిగారు.అప్పుడే పార్టీ మారుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగింది.బోండా ఉమాని ఎంపీ కేశినేని నాని బుజ్జ‌గించి పార్టీలో కొన‌సాగించేలా చేశారు.2019 ఎన్నిక‌ల్లో పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత మాత్రం నాయ‌కులు క్యాడ‌ర్‌ని ప‌ట్టించుకోకుండా ఎవ‌రి ప‌ని వారు చూసుకుంటున్నారు. బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు ఎంపీ కేశినేని నానికి మంచి స‌న్నిహిత సంబంధాలు ఉండేవి.గ‌త కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని శ్వేత పేరును అధిష్టానం ప్ర‌క‌టించ‌డంతో బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అసంతృప్తిని వ్యక్త‌ప‌రిచారు.దీంతో ఇప్పుడు కేశినేని,బోండాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింది.
బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు స‌మాచారం.పార్టీలో ప‌ద‌వులు ఇచ్చిన‌ప్ప‌టికి స్థానికంగా ఉన్న నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరుతో ఆయ‌న కినుకు వ‌హించిన‌ట్లు క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నారు.విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలో వైసీపీ ప్ర‌భంజ‌నం కొన‌సాగిన ఎంపీగా కేశినేని నాని గెలిచారు.దీంతో జిల్లాలో కేశినేని నానికి అధినేత చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇస్తున్నారు.దీన్ని స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌లు ఓర్చుకోలేక‌పోతున్న‌ట్లు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ఈసారి బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైన పాగా వేయాల‌ని అధినేత చంద్ర‌బాబు దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం.నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితుల‌పై చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు.ప్ర‌ధానంగా నాయ‌కుల మ‌ధ్య జ‌ర‌గుతున్న ఆధిప‌త్య పోరుని అధినేత చంద్ర‌బాబు నిశితంగా గ‌మినిస్తున్నారు.నియోజ‌క‌వ‌ర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్న బోండా ఉమామహేశ్వ‌ర‌రావు ప‌నితీరుపై అధినేత నివేదిక‌లు తెప్పించుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.నేత‌ల తీరు మార్చుకోక‌పోతే వీరంద‌రికి చెక్ పెట్టాల‌ని అధిష్టానం భావిస్తుంది.
బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌కి టీడీపీలో ఎక్కువ‌గా ప్రాధ‌న్య‌త ఉంది.ఇటీవ‌ల కాలంలో వంగ‌వీటి రాధాకృష్ణ‌ అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.ఉద్య‌మ నాయ‌కుల‌కు అండ‌గా ఉంటూ అమ‌రావ‌తిపై గ‌ట్టిగా త‌న గ‌ళాన్ని రాధాకృష్ణ‌ వినిపిస్తున్నారు.గ‌త ఎన్నిక‌ల ముందు టీడీపీలోకి వ‌చ్చిన రాధాకు అధిష్టానం ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆ హ‌మీ నేర‌వేర‌లేదు.అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంగ‌వీటి రాధాని బ‌రిలోకి దింపాల‌ని అధిష్టానం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది.గ‌తంలో వంగ‌వీటి రాధాకృష్ణ‌ వైసీపీలో ఉన్న‌ప్పుడు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ త‌రువాత మ‌ల్లాది విష్ణు వైసీపీలోకి రావ‌డంతో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు.దీంతో వంగ‌వీటి రాధాకృష్ణ టీడీపీ గూటికి చేరారు.వ‌చ్చే ఎన్న‌క‌ల్లో పోటీ చేయ‌డానికి రాధ రెఢీగా ఉన్న‌ట్లు తెలుస్తుంది.విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రాధ‌కి ప‌ట్టున్న తూర్పు,సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌దానిని అధిష్టానం ఆయ‌న‌కి కేటాయించ‌నుంది.తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఉండ‌టంతో సెంట్ర‌ల్‌పైనే రాధ చూపు ఉన్న‌ట్లు చూస్తుంది.విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌ర్గంలో దివంగ‌త నేత వంగ‌వీటి రంగ అభిమానులు,కాపు సామాజిక‌వ‌ర్గం ఆయ‌న‌కి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో సెంట్ర‌ల్ టిక్కెట్ వంగ‌వీటి రాధ‌కి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం.


షాహిద్ కి విద్యాబాలన్ అందుకే బ్రేక్ అప్ చెప్పిందట...

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కేసీఆర్ ముహూర్తం.. అవుట్‌... ఇన్ లిస్ట్ ఇదే..

జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

ఉత్త‌రాఖండ్ నుంచి బెంగాల్ రాజ‌కీయం..?

షాక్‌: హుజూరాబాద్ ఉప ఎన్నిక గోవిందా..?

మెహరీన్ పెళ్లి క్యాన్సల్ వెనక అసలు కారణం అదేనట.. !

తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్?

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>