PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kasmirc994c875-576a-4718-a4f4-d9b0361d77c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kasmirc994c875-576a-4718-a4f4-d9b0361d77c4-415x250-IndiaHerald.jpgఅందాల కాశ్మీర్ దారిలోకి వచ్చినట్లేనా అంటే సమాధానం అసంపూర్తిగానే వస్తుంది. రెండేళ్ల క్రితం ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కేంద్రం కంట్రోల్ కి వెళ్ళిన తరువాత కాశ్మీర్ లో శాంతి భద్రతలు బాగా మెరుగు అయ్యాయి. పాక్ ఆడించినట్లుగా ఆడే వారి ఆటలు కట్టాయి. kasmir{#}Jammu and Kashmir - Srinagar/Jammuఆపరేషన్ కాశ్మీర్... టార్గెట్ అదేనా... ?ఆపరేషన్ కాశ్మీర్... టార్గెట్ అదేనా... ?kasmir{#}Jammu and Kashmir - Srinagar/JammuSun, 04 Jul 2021 21:00:00 GMTఅందాల కాశ్మీర్ దారిలోకి వచ్చినట్లేనా అంటే సమాధానం అసంపూర్తిగానే వస్తుంది. రెండేళ్ల క్రితం ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కేంద్రం కంట్రోల్ కి వెళ్ళిన తరువాత కాశ్మీర్ లో శాంతి భద్రతలు బాగా మెరుగు అయ్యాయి. పాక్ ఆడించినట్లుగా ఆడే వారి ఆటలు కట్టాయి.

కాశ్మీర్ ను ఉగ్రవాదుల అడ్డాగా మార్చడానికి చూసే వారికి కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపధ్యంలో కాశ్మీర్ లో ఎన్నికలు పెట్టాలని కేంద్రం చూస్తోంది. అయితే అదంత సులువుగా కనిపించడంలేదు. ఇప్పటికే రెక్కలు తెగిన కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు జరిపి బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తే తట్టుకోలేదు. అంతే కాదు అక్కడితో వారి రాజకీయ అస్థిత్వం కూడా ముగుస్తుంది.

దాంతో రాష్ట్ర హోదా కావాలని, ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కొన్ని పక్షాలు పాట పాడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కొత్తగా డ్రోన్లతో దాడులకు ఉగ్రవాదులు తెగపడుతున్నారు. కాశ్మీర్ లో నచ్చిన ప్రదేశంలో బాంబులు వేసేందుకు రెడీ అవుతున్నారు వారి దాడులను తట్టుకుంటున్నా యాంటీ డ్రోన్ మెకానిజం రావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో వైపు చూస్తే కాశ్మీర్ లో పూర్తి శాంతి రావాలి అంటే ఆక్రమిత కాశ్మీర్ ని కూడా కలిపేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు.

అంటే దాని కోసం పాక్ తో యుద్ధానికి మోడీ సర్కార్ సాహసించాలి అన్న మాట ఉంది. అక్కడ నుంచే ఉగ్రవాదులు అన్ని ఆయుధాలు సమకూర్చుకుని పాక్ మీద దాడులు చేస్తున్నారు. అందుకే అక్కడ నుంచే ఆపరేషన్ మొదలు పెడితేనే తప్ప కాశ్మీర్ కధకు విజయవంతమైన ముగింపు దొరకదు అన్న మాట ఉంది. బహుశా ఈ విషయాలు కేంద్ర పెద్దలకు తెలియనివి కావు. మరి కాశ్మీర్ లో ఎన్నికలు అంటున్నారు. ఆక్రమిత కాశ్మీర్ ని కూడా చేర్చి పూర్తిగానే ఎన్నికలు పెడితే ఒక పని అయిపోతుంది కదా. కానీ ఇది అనుకున్నంత  ఈజీ కాదు, ఆక్రమిత కాశ్మీర్ అంటే పాక్ యుద్ధానికే వస్తుంది. తోడుగా దానికి మద్దతు ఇచ్చే దేశాలూ ఉంటాయి. ఏది ఏమైనా ఆక్రమిత కాశ్మీర్ ని దారికి తేకపోతే మాత్రం కాశ్మీర్ కి పూర్తి శాంతి అన్నది కుదిరే పని కాదు అంటున్నారు.
   





సర్జికల్ స్ట్రైక్- 3 కి భారత్ సిద్ధమవుతుందా?

అణు బాంబుల డ్రోన్లు వాడతారట.. స్టేట్మెంట్ సంచలనం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>