EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-kcr3104d0d2-0970-45e6-ab0a-fdd062d72465-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-kcr3104d0d2-0970-45e6-ab0a-fdd062d72465-415x250-IndiaHerald.jpgపైకి అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం జరుగుతున్న పోరాటం. కానీ లోపల బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీన పరిచే వ్యూహం. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల వేళ, బీజేపీని దారుణంగా దెబ్బతీసేందుకు కేసీఆర్ అమలు పరచిన పక్కా స్కెచ్ అది. తాజాగా నీటి వాటాలపై కామెంట్ చేసిన కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ కొత్త మెలిక పెట్టారు. గతంలో కృష్ణా నది నీటిని 66శాతం ఏపీ, 34శాతం తెలంగాణ వాడుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే దాన్ని వద్దని, ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో యాభైశాతం వాటా ఉంటుందని షాకిచ్చారు కేసీఆర్. jagan kcr{#}yajamanya;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Krishna River;Eatala Rajendar;Aqua;Huzurabad;Letter;KCR;Rayalaseema;Telugu;Jagan;contract;Telanganaజగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..జగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..jagan kcr{#}yajamanya;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Krishna River;Eatala Rajendar;Aqua;Huzurabad;Letter;KCR;Rayalaseema;Telugu;Jagan;contract;TelanganaSun, 04 Jul 2021 08:56:47 GMTపైకి అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం జరుగుతున్న పోరాటం. కానీ లోపల బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీన పరిచే వ్యూహం. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల వేళ, బీజేపీని దారుణంగా దెబ్బతీసేందుకు కేసీఆర్ అమలు పరచిన పక్కా స్కెచ్ అది. తాజాగా నీటి వాటాలపై కామెంట్ చేసిన కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ కొత్త మెలిక పెట్టారు. గతంలో కృష్ణా నది నీటిని 66శాతం ఏపీ, 34శాతం తెలంగాణ వాడుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే దాన్ని వద్దని, ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో యాభైశాతం వాటా ఉంటుందని షాకిచ్చారు కేసీఆర్.

ఈ షాక్ జగన్ కి కాదు, బీజేపీకి..
కేసీఆర్ వినిపిస్తున్న కొత్త వాదన ఏపీకి నష్టం కలిగించేదే అయినా.. పరివాహక ప్రాంతం లెక్కల ప్రకారం దాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ అదే సమయంలో తెలంగాణలో బీజేపీ కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నామనే స్టేట్ మెంట్ వరకు పర్వాలేదు. ఆ తర్వాత మాత్రం వారికి అడుగు ముందుకు పడటంలేదు. కృష్ణా నది నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు 50శాతం మేర వాడుకోవాలనే ప్రతిపాదనను బీజేపీ సమర్థించే అవకాశమే లేదు. ఒకవేళ అదే జరిగితే ఏపీలో బీజేపీ పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతుంది. అటు జనసేనతో పొత్తు కూడా ఉండదు. బీజేపీ కేంద్ర పార్టీకి కూడా ఇది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కేవలం హుజూరాబాద్ ఎన్నికలకోసమే అయితే.. బీజేపీ తెలంగాణకే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. అందుకే జగన్, కేసీఆర్ కావాలనే ఈ గొడవను పెద్దది చేస్తున్నారంటూ బండి సంజయ్ వంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.

టార్గెట్ హుజూరాబాద్..
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బలంగా కనిపిస్తున్నారు. స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉండటం, ఇప్పుడు బీజేపీ బలం తోడవడంతో కేసీఆర్ కాస్త కంగారు పడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో జల జగడం తెరపైకి వచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద మొదలైన గొడవ, జలవిద్యుత్ ఉత్పత్తి వరకు సాగింది. ఇప్పుడు కృష్ణా నది నీటి వాటాల వరకు వెళ్లింది. ఈ నీటివాటాల లెక్కపై బీజేపీ ఇరుకున పడింది. హుజురాబాద్ ఎన్నికలను కృష్ణా నీటివాటాలు కచ్చితంగా ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. ఒకవేళ ఈటల ఇండిపెండెంట్ గా బరిలో దిగినా ఆయనపై ఈ ప్రభావం ఉండేది కాదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తుంటడంతో, టీఆర్ఎస్ చేతికి కృష్ణా నీటివాటాల అస్త్రం దొరికింది.



రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!

పైకి అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం జరుగుతున్న పోరాటం. కానీ లోపల బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీన పరిచే వ్యూహం. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల వేళ, బీజేపీని దారుణంగా దెబ్బతీసేందుకు కేసీఆర్ అమలు పరచిన పక్కా స్కెచ్ అది. తాజాగా నీటి వాటాలపై కామెంట్ చేసిన కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ కొత్త మెలిక పెట్టారు. గతంలో కృష్ణా నది నీటిని 66శాతం ఏపీ, 34శాతం తెలంగాణ వాడుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే దాన్ని వద్దని, ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో యాభైశాతం వాటా ఉంటుందని షాకిచ్చారు కేసీఆర్.

టీ సర్కార్ జీవో రద్దు చేయండి!

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

మోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?

పెట్రో మంట.. మళ్ళీ మొదలు!

నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?

ఇడుపుల పాయలో జగన్, షర్మిల భేటీ ఎప్పుడంటే..?

ఇటీవల కాలంలో బెస్ట్ జోడీగా నిలిచిన జంటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>