MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ak-remake68ebc918-ce77-46c4-a61b-144b1044e937-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ak-remake68ebc918-ce77-46c4-a61b-144b1044e937-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీ ల్ సాబ్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి ఇక్కడ విడుదల చేయగా ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా విడుదలైన 21వ రోజు అమెజాన్ లో విడుదలై అక్కడ కూడా బంపర్ హిట్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలు సెట్స్ పైన ఉంచిన సంగతి తెలిసిందే.Ak remake{#}Pawan Kalyan;trivikram srinivas;Amazon;kalyan;Remake;Cinemaవకీల్ సాబ్ కి చేసిన తప్పే పవన్ ఏకే రీమేక్ కి చేస్తున్నాడా!!వకీల్ సాబ్ కి చేసిన తప్పే పవన్ ఏకే రీమేక్ కి చేస్తున్నాడా!!Ak remake{#}Pawan Kalyan;trivikram srinivas;Amazon;kalyan;Remake;CinemaSat, 03 Jul 2021 13:00:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీ ల్ సాబ్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి ఇక్కడ విడుదల చేయగా ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా విడుదలైన 21వ రోజు అమెజాన్ లో విడుదలై అక్కడ కూడా బంపర్ హిట్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలు సెట్స్ పైన ఉంచిన సంగతి తెలిసిందే.

వీటిలో మొదటగా ఏకే రీమేక్ సినిమా విడుదల కాబోతుంది అంటే వకీల్ సాబ్ లాంటి హిట్ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కొషియం సినిమా విడుదల కాబోతుందన్న మాట.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రానా లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజులలో పూర్తి చేసుకోబోతుండగా ఇప్పుడు ఒక వార్త అభిమానులను ఎంతగానో కలవరపరుస్తోంది.

కమర్షియల్ గా వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయినా కూడా అందులో ఒరిజినల్  వెర్షన్ కి మార్పులు చేసిన కారణంగా సినిమా కొంత డల్ అయ్యింది అన్న విమర్శలు ఎదుర్కొంది. ఆ విధంగానే మలయాళ సినిమా అయినా ఏకే రీమేక్ ను కూడా కొంత మార్పులు చేశారట. అభిమానుల ఆకాంక్షలు కు తగ్గట్లే ఈ సినిమాలో మార్పులు చేసినట్లు పవన్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తయారు చేసినట్లు ఈ సినిమా రచయిత త్రివిక్రమ్ చెబుతున్నారట. మాతృకలో పూర్తిస్థాయి యాక్షన్ సీన్ క్లైమాక్స్ లో మాత్రమే ఉంటుంది. అంతకుముందు అలాంటి యాక్షన్ ఘట్టాలు ఉండవు. అయితే ఈ రీమేక్ లో అదనపు సీన్లు జోడించి యాక్షన్ కి ఎక్కువ స్కోప్ ఉండేలా చూస్తున్నారట. వకీల్ సాబ్ సమయంలో కూడా ఇదే చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. 



ఆ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ హీరో..? 1

ఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..?

హీరోయిన్ హీరా ప్రేమ వల్ల సర్వం కోల్పోయిందా.. ?

ఆ భామను వదలని సీనియర్ రైటర్!

టీజర్: ఆసక్తిరేపుతున్న అమలాపాల్ క్రైమ్ థ్రిల్లర్..?

ఊర్వశి తమ్ముడు పిన్న వయసులోనే ఎలాంటి సినిమాలు చేశాడో తెలుసా ?

అదే ఆహా చేసిన తప్పు.. ఆడుకుంటున్న నెటిజన్స్!!

సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ రమ్యకృష్ణ ఏం చేసేదో తెలుసా ?

లీకైన ఎన్టీఆర్ షో బిగ్ అప్డేట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>