NarrativeGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/narrative/140/tag86b4e8e1-0b4b-465d-a52d-f40e8abe833a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/narrative/140/tag86b4e8e1-0b4b-465d-a52d-f40e8abe833a-415x250-IndiaHerald.jpgబుద్ధుడు జీవించిన కాలంలో ఆయ‌న‌కు తార‌స‌ప‌డిన‌వారు, ఆయ‌న‌తో కొంత స‌మ‌యం గ‌డిపిన‌వారు, ఆయ‌న శిష్యులు, ఆయ‌న ధ‌ర్మాన్ని అనుస‌రించిన‌వారిని గురించి కొన్ని క‌థ‌లుగా అందించే ప్ర‌య‌త్న‌మే బుద్ధుని క‌థ‌లు. పెద్ద‌పెద్ద‌విగా ఉంటాయ‌నే ఉద్దేశంతో ఒక క‌థ‌నే నాలుగైదు భాగాలుగా అందిస్తున్నాం. అందుకే క‌థ‌లో మొద‌టి భాగాన్ని బుద్ధుని క‌థ‌లు-1, రెండో భాగాన్ని బుద్ధుని క‌థ‌లు-2.. ఇలా చ‌దువుకోవ‌చ్చు. ఒక క‌థ ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలుగా భావించాలి.tag{#}Stree;WOMEN;Vishakapatnam;kingబుద్ధుని క‌థ‌లు-1 (విశాఖ జీవితం)బుద్ధుని క‌థ‌లు-1 (విశాఖ జీవితం)tag{#}Stree;WOMEN;Vishakapatnam;kingSat, 03 Jul 2021 20:09:37 GMT

బుద్ధుడు జీవించిన కాలంలో ఆయ‌న‌కు తార‌స‌ప‌డిన‌వారు, ఆయ‌న‌తో కొంత స‌మ‌యం గ‌డిపిన‌వారు, ఆయ‌న శిష్యులు, ఆయ‌న ధ‌ర్మాన్ని అనుస‌రించిన‌వారిని గురించి కొన్ని క‌థ‌లుగా అందించే ప్ర‌య‌త్న‌మే బుద్ధుని క‌థ‌లు. పెద్ద‌పెద్ద‌విగా ఉంటాయ‌నే ఉద్దేశంతో ఒక క‌థ‌నే నాలుగైదు భాగాలుగా అందిస్తున్నాం. అందుకే క‌థ‌లో మొద‌టి భాగాన్ని బుద్ధుని క‌థ‌లు-1, రెండో భాగాన్ని బుద్ధుని క‌థ‌లు-2.. ఇలా చ‌దువుకోవ‌చ్చు. ఒక క‌థ ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలుగా భావించాలి.

విశాఖ మ‌హాధ‌నికుడైన వ్యాపారి కుమార్తె. స‌హ‌జ సౌంద‌ర్యం తోడు చ‌దువు, సంస్కారం, తెలివితేట‌ల‌తో మిక్కిలి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. శాస్త్రాలు చెప్పే అన్ని సౌంద‌ర్య ల‌క్ష‌ణాలు ఆమెకు ఉన్నాయి. పైకి సుకుమారంగా క‌న‌ప‌డినా మాన‌సిక బ‌లంతోపాటు శారీర‌క బ‌లం కూడా ఎక్కువ‌. ధైర్యం ఎక్కువ‌. బుద్ధుడిని అభిమానించి ఒక ఆరామాన్ని నిర్మించి ఇచ్చిన ఉదార స్వ‌భావం విశాఖ సొంతం.

ఒక ఉత్స‌వం రోజు ఊరిబ‌య‌ట కాల్వ‌లో స్నానం కొర‌కు విశాఖ త‌న స్నేహితురాళ్ల‌ను తోడు తీసుకొని వెళ్లింది. కాల్వ‌లో స్నానానికి దిగ‌క‌ముందే వ‌ర్షం ప‌డ‌సాగింది. ఆమెతోపాటు వ‌చ్చిన స్నేహితురాళ్లంతా ద‌గ్గ‌ర‌లో క‌న‌ప‌డుతున్న మండ‌పంలోకి పోయి త‌డ‌వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. విశాఖ మండ‌పంలోకి ప‌రిగెత్త‌కుండా వ‌ర్షంలోనే త‌డుస్తూ న‌డుచుకుంటూ వెళ్లింది. అప్ప‌టికి ఆమె త‌డిసి ముద్ద‌యింది. అప్ప‌టికే వ‌ర్షానికి ఆ మండ‌పంలో త‌ల‌దాచుకున్న ప‌ర‌దేశి బ్రాహ్మ‌ణులు విశాఖ‌ను దూషించ‌సాగారు. మ‌హారాణిలా వ‌గ‌లు పోతున్నావు.. చిన్న‌గా న‌డిచి కాకుండా వేగంగా వ‌చ్చివుంటే త‌డిచి ఉండేదానికి కాదు క‌దా!! అని. ఆ ప‌ర‌దేశి బ్రాహ్మ‌ణుల మ‌ద‌లింపు మాట‌ల‌కు ఆమె సిగ్గుప‌డి త‌ల‌దించుకోలేదు. చిన్న‌బుచ్చుకొని దుఃఖంలో మున‌గ‌లేదు. వాళ్ల‌కు తిరిగి ఇలా బ‌దులిచ్చింది. స‌భ‌కు వ‌స్తున్న రాజు ప‌రుగెత్తుకు వ‌స్తే అది అనుచితంగా ఉంటుంది.. ఒక సాధువు ప‌రిగెత్త‌డం అనుచితంగా ఉంటుంది.. అలాగే స్త్రీ కూడా ప‌రిగెత్త‌డం అస‌హ‌జంగా ఉంటుంది. మీకు తెలియ‌దా?  నేను ప‌రిగెత్త‌డం కూడా అస‌హ‌జంగా ఉంటుంది. అందుకే ప‌రిగెత్త‌లేదు అని బదులిచ్చింది.

విశాఖ స‌మాధాన‌మిస్తున్న స‌మ‌యంలో ఆ బ్రాహ్మ‌ణులు ఆమెను ప‌రిశీల‌న‌గా చూశారు. ఆమె శిరోజాలు, దంతాల వ‌రుస‌, పెద‌వులు, దేహ‌ఛాయ‌, య‌వ్వ‌న సంప‌ద‌ను ప‌రిశీలించారు. వారికి చాలా ఆనంద‌మేసింది. ఎందుకంటే వారిది శ్రావ‌స్తి నివాస‌స్తులు. ఆ న‌గ‌రంలో మ‌హాధ‌నికుడైన మిగారుడి దూత‌లు వారు. అత‌ని ఒక్క‌గానొక్క కుమారుడైన పుణ్య‌వ‌ర్ధ‌నుడికి త‌గిన సంబంధం కోస‌మ‌ని ఊరూరా తిరుగుతున్నారు. త‌న కుమారుడికి వ‌ధువు కోసం మిగారుడు ప్ర‌త్యేక దూత‌లుగా వీరిని నియ‌మించారు.








జ‌గ‌న్‌ని వ‌ద‌ల‌ని ఆర్ఆర్ఆర్‌...తెర‌పైకి మ‌రో అంశం...?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అత్యంత ఖ‌రీదైన భూముల‌ను రెండు కుల‌సంఘాల‌కు కేటాయించారు. అది కూడా హైటెక్‌సిటీ లాంటి అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా ప్ర‌భుత్వం జారీచేసింది. ఇంత ఆగ‌మేఘాల‌మీద భూముల‌ను కేటాయించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? హ‌డావిడిగా ఉత్త‌ర్వుల‌ను ఎందుకు జారీ చేయాల్సి వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానం లేదు. హైటెక్ సిటీ ఎదురుగా ఉండే అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో కేటాయించిన ఐదెక‌రాల భూమి విలువ రూ.100 కోట్లుగా ఉన్న‌ట్లు స‌మాచారం.

క‌మ్మ‌, వెల‌మల‌కు రూ.100 కోట్ల భూమి?

అవి ఇళ్లు కాదు.. ఊళ్లు అంటూ ప్ర‌చారం చేశారు.. చిన్న చిన్న ప్రాంతాలు కాదు.. పెద్ద పెద్ద కాల‌నీల‌న్నారు. ఆ స్థాయిలో.. ఆ సంఖ్య‌లో ఇళ్లు మంజూరు చేశామ‌న్నారు. తీరా చూస్తే ల‌బ్ధిదారులు ఆ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వానికే ఇచ్చేస్తున్నారు. ఇల్లు క‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే స్థ‌లమిస్తుంటే ఏమిట్రా బాబూ.. వీళ్లంతా స్థ‌లాలు వెన‌క్కిచేస్తున్నార‌ని వారిని అడిగితే.. అక్క‌డ ఇల్లు క‌ట్టుకోవ‌డం అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. కార‌ణ‌మేంట‌ని అడిగితే కొవిడ్ లాంటి విప‌త్తువేళ కూడా వెంట‌నే శంకుస్థాప‌న చేయాల‌నే నిబంధ‌న విధించ‌డ‌మే..!! అని చెప్పారు.

ఇల్లు క‌ట్టి చూడు.. జ‌గ‌న‌న్న‌ను భోజ‌నానికి పిలిచి చూడు??

చిత్తూరు జిల్లా పీలేరులో రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. పీలేరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారికి ఆనుకొనివున్న భూముల్లోనే ఈ కుంభ‌కోణం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. జిల్లా మంత్రి, ఎంపీల అండ చూసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు భూకబ్జాకు పాల్ప‌డ్డార‌ని కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వానికి చెందిన భూముల‌నే లేఔట్లుగా మార్చి అమ్ముతున్నార‌న్నారు. ఎక్క‌డెక్క‌డ కుంభ‌కోణం జ‌రిగింది? ఏయే గ్రామాల్లో జ‌రిగింది? వాటి స‌ర్వే నెంబ‌ర్లు ఎంత‌? త‌దిత‌ర వివ‌రాల‌న్నింటినీ ఆయ‌న ఈరోజు మీడియా ఎదుట బ‌హిర్గ‌త‌ప‌రిచారు.

రూ.400 కోట్ల భూ కుంభ‌కోణం??

ప్రేమకు నో చెప్పిన పేరెంట్స్.. ప్రియుడితో కలిసి యువతి ఏం చేసిందంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మొద‌టినుంచీ చిన్న‌చూపే. ఎందుకంటే రైతులు త‌మ భూముల‌ను తెలుగుదేశం ప్ర‌భుత్వానికిచ్చి ఓట్ల‌ను వైసీపీకిచ్చారు కాబ‌ట్టి. రాజ‌ధాని గ్రామాల ప‌రిధిలో ఉన్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మంగ‌ళ‌గిరి, తాడికొండ(ఎస్సీ) వైసీపీ ప‌ర‌మ‌య్యాయి. దీన్నిబ‌ట్టే అక్క‌డి ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్‌వైపు మొగ్గుచూపిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయినా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి రైతులపై, రాజ‌ధానిపై అవాకులు, చెవాకులు పేలుతూనే ఉన్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మంపై త‌రుచూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తోన్న ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి తాజాగా మ‌రోసారి త‌న నోటిదురుసుత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. దీనిపై రాజ‌ధాని రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>