Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbi52614f30-db31-419b-9e12-dd33caabf95b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbi52614f30-db31-419b-9e12-dd33caabf95b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో ముందుంటుంది. ప్రస్తుతం తమ కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ దూసుకుపోతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులని అందిస్తోంది. అయితే కస్టమర్ల ప్రైవసీ విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఎన్నో రకాల సర్వీసులను అందిస్తూ ఉండటంతో పాటు ఎన్నోరకాల పాలసీలను కూడా అందిస్తోంది. ఇకపోతే పSbi{#}SBIఎస్బిఐ కస్టమర్లు అలర్ట్.. రేపు ఆ సేవలు బంద్?ఎస్బిఐ కస్టమర్లు అలర్ట్.. రేపు ఆ సేవలు బంద్?Sbi{#}SBISat, 03 Jul 2021 17:00:00 GMTప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో ముందుంటుంది. ప్రస్తుతం తమ కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ దూసుకుపోతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులని అందిస్తోంది. అయితే కస్టమర్ల ప్రైవసీ  విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఎన్నో రకాల సర్వీసులను అందిస్తూ ఉండటంతో పాటు ఎన్నోరకాల పాలసీలను కూడా అందిస్తోంది.



 ఇకపోతే ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. ప్రతి బ్యాంకు కస్టమర్లు కూడా డిజిటల్ లావాదేవీలు జరపడానికి ఇష్టపడుతున్నారు  ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని బ్యాంకుల కస్టమర్లు కూడా ఆన్లైన్ పేమెంట్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ లావాదేవీల విషయంలో ఎలాంటి అంతరాయం జరగకుండా ఉండేందుకు అన్ని బ్యాంకులు  చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయితే డిజిటల్ లావాదేవీల విషయంలో కొన్ని కొన్ని సార్లు అంతరాయం ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా బ్యాంకులు తమ సేవలను అప్గ్రేడ్  చేసే క్రమంలో ఇలాంటి అంతరాయాలు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో పలు బ్యాంకు కస్టమర్లకు కూడా ఇలాంటి అంతరాయాలు ఎదుర్కొన్నారు.



 ఇకపోతే ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. తమ సేవలను అప్గ్రేడ్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే జూలై నాలుగవ తేదీన తెల్లవారుజామున 3:25 నుంచి ఉదయం 5 గంటల 50 నిమిషాల వరకు తమ డిజిటల్ సేవలు పనిచేయవని ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలకు అంతరాయం కలుగుతుంది అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందే పూర్తి చేసుకోవాలి అంటూ కస్టమర్లకు సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. త్వరగా అప్గ్రేడ్ ప్రక్రియను పూర్తి చేసి మళ్ళీ అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు  కృషి చేస్తాము అంటూ చెప్పుకొచ్చింది.



కార్డు పిన్ మరియు స్వైపింగ్ లేకుండా పేమెంట్లు సురక్షితమేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>