Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd46b80127-dab6-4813-9208-6b44d1ef92d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd46b80127-dab6-4813-9208-6b44d1ef92d5-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇక నిరంతరం టిటిడి దేవస్థానాన్ని పర్యవేక్షించేందుకు వేల సంఖ్యలో సిబ్బంది పని చేస్తూనే ఉంటారు. భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముTtd{#}Ladoo;Service;Tirupati;Tirumala Tirupathi Devasthanam;historyటీటీడీ నిర్ణయం.. అందరూ ఆగ్రహం?టీటీడీ నిర్ణయం.. అందరూ ఆగ్రహం?Ttd{#}Ladoo;Service;Tirupati;Tirumala Tirupathi Devasthanam;historySat, 03 Jul 2021 13:40:00 GMTతిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇక నిరంతరం  టిటిడి దేవస్థానాన్ని పర్యవేక్షించేందుకు వేల సంఖ్యలో సిబ్బంది పని చేస్తూనే ఉంటారు.



 భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది టిటిడి బోర్డు. భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే ఇటీవలే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  ఇప్పటికే టీటీడీ ఆలయంలో వేలాది సంఖ్యలో సిబ్బంది పని చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించు కోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.



 భక్తులకు సేవలు అందించే కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది అని ఇటీవలే ప్రకటించారు.  లడ్డు పంపిణీ, కల్యాణకట్ట కేంద్రాల నిర్వహణ, వైకుంఠం టికెట్లు తనిఖీ కేంద్రం, సర్వ దర్శనం టైమ్ స్లాట్ లాంటి సేవలు అన్నింటిని కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిగాయని.. నాణ్యమైన  సేవలు అందించేందుకు ఏజెన్సీకు అప్పగిస్తున్నామని టిటిడి బోర్డు తెలిపింది. అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెరుగైన నాణ్యమైన సర్వీసుల కోసం ప్రైవేట్ ఏజెన్సీలు ఇస్తున్నాము అని చెబుతున్న టిటీడీ బోర్డు ఇన్ని రోజుల వరకు నాణ్యమైన సేవలు అందించలేదు అన్న విషయం ఒప్పుకున్నట్లే అంటూ ప్రశ్నిస్తున్నారు.  అన్ని సేవలు ప్రైవేట్ ఏజెన్సీలకు  ఇస్తే.. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేసే సిబ్బంది ఏం చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.



కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

శ్రీవారి భక్తులకు షాక్.. ప్రసాదం ధర భారీగా పెంపు?

చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు...

ఏపీలో ఉపపోరుకు రంగం సిద్ధమైందా? ఆ విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటి?

రోజాకు జ‌గ‌న్ మరో ఆఫ‌ర్ రెడీ... !

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం అప్పుడే...?

జూన్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>