PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr1ad82bc4-4e75-4f41-99cc-98d247d687c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr1ad82bc4-4e75-4f41-99cc-98d247d687c1-415x250-IndiaHerald.jpgఅయితే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించినా.. మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అటు పార్టీలోనూ... ఇటు ప్రభుత్వంలోనూ కేటీఆర్ హ‌వా మామూలుగా లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావ‌డంతో కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. తెలంగాణ లో చ‌చ్చిపోయింద‌నుకున్న Kcr{#}KTR;Khammam;Warangal;Revanth Reddy;Congress;Bharatiya Janata Party;KCR;Telangana Chief Minister;CM;Party;Minister;Telanganaఎంపీగా కేసీఆర్‌... గ‌జ్వేల్‌కు గుడ్ బై ?ఎంపీగా కేసీఆర్‌... గ‌జ్వేల్‌కు గుడ్ బై ?Kcr{#}KTR;Khammam;Warangal;Revanth Reddy;Congress;Bharatiya Janata Party;KCR;Telangana Chief Minister;CM;Party;Minister;TelanganaSat, 03 Jul 2021 16:20:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా మంత్రి కేటీఆర్ ను చాప కింద నీరులా ప్రమోట్‌ చేసుకుంటూ వస్తున్నారు. కెసిఆర్ తొలి సారి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దూకుడుగా ఉన్న కేటీఆర్‌ వరంగల్ - ఖమ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు పాలేరు ఉప ఎన్నికల సమయంలో బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచే కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... 2018 ముందస్తు ఎన్నికల్లో పార్టీ గెలిస్తే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల వైపు వెళ్లిపోతార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించినా.. మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అటు పార్టీలోనూ... ఇటు ప్రభుత్వంలోనూ కేటీఆర్ హ‌వా మామూలుగా లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావ‌డంతో కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. తెలంగాణ లో చ‌చ్చిపోయింద‌నుకున్న కాంగ్రెస్ రేవంత్ నాయ‌క‌త్వంతో జ‌వ‌స‌త్వాలు నింపుకుంటుంద‌ని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ తెలంగాణ‌లో కేటీఆర్ కు నాయ‌క‌త్వం అప్ప‌గించి... అటు జాతీయ రాజ‌కీయాల్లో కూడా రాణించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్‌, అటు బీజేపీ యువ‌నేత‌ల‌ను ఎదుర్కొని ఇటు రాష్ట్రంలో స‌త్తా చాట‌డంతో పాటు అటు తాను జాతీయ రాజ‌కీయాల్లో థ‌ర్డ్ ఫ్రంట్‌లో కీ రోల్ పోషించాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని.. కేటీఆర్‌కు ప‌గ్గాలు ఇస్తారా ?  లేదా ?  ఎన్నిక‌ల త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల‌కు వెళ‌తారా ? అన్న‌ది చూడాలి. అయితే పార్టీ వ‌ర్గాల్లో ఒక ప్ర‌చారం మాత్రం జ‌రుగుతోంది. కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా పోటీ చేస్తార‌ని.. గ‌జ్వేల్‌కు బైబై చెపుతార‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చార‌మే ఆయ‌న జాతీయ రాజ‌కీయాల వైపు వెళుతున్నార‌న్న సంకేతాలు ఇస్తోంది.

 



కేసీఆర్‌ను అడ్డంగా ఫిక్స్ చేసిన జ‌గ‌న్ ?

క‌మ్మ‌, వెల‌మల‌కు రూ.100 కోట్ల భూమి?

జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...

బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!

ప‌వ‌న్ ఈ రూట్లో కేంద్ర మంత్రి అవుతున్నారా ?

ఇల్లు క‌ట్టి చూడు.. జ‌గ‌న‌న్న‌ను భోజ‌నానికి పిలిచి చూడు??

2024 ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కేసీఆర్ పోటీ ?

బ్రేకింగ్ : కొత్త సీఎం ఎవరంటే ?

రూ.400 కోట్ల భూ కుంభ‌కోణం??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>