Telangana
oi-Srinivas Mittapalli
హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం(జులై 3) రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లోని రెండు గదుల్లో తనిఖీలు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులు,ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిర్వాహకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు,యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా యువతుల ఫోటోలతో విటులను ఆకర్షించి ఈ దందా నడుపుతున్నారు. దీని వెనక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రెండు రోజుల క్రితం నేరెడ్‌మెట్‌లోనూ ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాంజానియాకు చెందిన డయానా(24), కాబాంగిలా వారెన్(24) స్టడీ వీసాపై హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వీరు… అదే ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడులు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కొత్తవారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.
రెండు నెలల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోనూ ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. స్థానిక రోడ్ నం.41లోని ఓ హోటల్ ఓయో రూమ్‌పై దాడులు చేసి ముగ్గురు సెక్స్ వర్కర్లు,ఇద్దరు విటులు,ఒక నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదర,మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు అశ్విన్‌తో పాటు రాహుల్ సురాన(32),వెంకట అప్పయ్య(44)అనే విటులను అరెస్ట్ చేశారు.ఇలా నగరంలో తరచూ వ్యభిచార ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వ్యభిచార నిర్వాహకులు వారి కళ్లు గప్పి ఇలాంటి దందాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవుతున్నారు.
English summary
Police have uncovered a prostitution racket in Somajiguda, Hyderabad. Seven sex workers and two main persons behind this racket have been arrested in connection with the prostitution after the raid on hotel.
Story first published: Saturday, July 3, 2021, 16:41 [IST]