PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-volunteers-athmakuru9de52014-8288-4475-ba8b-7692ed1af6dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-volunteers-athmakuru9de52014-8288-4475-ba8b-7692ed1af6dc-415x250-IndiaHerald.jpgఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా లక్షలాదిమంది ప్రాణం తీస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి మన వద్ద ఉన్న సమర్థవంతమైన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. కరోనాకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చికిత్సా విధానం లేని నేపథ్యంలో.. టీకా మాత్రమే మనల్ని రక్షించగలదు. కానీ ఈ విషయం తెలిసి కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరచడం లేదు.VACCINE-VOLUNTEERS-ATHMAKURU{#}Kurnool;monday;Atmakur;job;Andhra Pradesh;Coronavirusవ్యాక్సిన్ వేసుకోని వాలంటీర్లను ఏంచేశారంటే ?వ్యాక్సిన్ వేసుకోని వాలంటీర్లను ఏంచేశారంటే ?VACCINE-VOLUNTEERS-ATHMAKURU{#}Kurnool;monday;Atmakur;job;Andhra Pradesh;CoronavirusSat, 03 Jul 2021 20:21:20 GMTఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా లక్షలాదిమంది ప్రాణం తీస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి మన వద్ద ఉన్న సమర్థవంతమైన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. కరోనాకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చికిత్సా విధానం లేని నేపథ్యంలో.. టీకా మాత్రమే మనల్ని రక్షించగలదు. కానీ ఈ విషయం తెలిసి కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరచడం లేదు. అగ్రరాజ్యంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆఫర్లు ప్రకటిస్తున్న పరిస్థితి. అక్కడి ఎక్కువ మంది ప్రజలు టీకాను వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. టీకా వేసుకుంటే శృంగార సామర్థ్యంలో మార్పులు వస్తాయని వారిలో కోరికలు తగ్గిపోతాయని, టీకాలు వేసుకుంటే ఆ ప్రభావం వల్ల నపుంసకత్వం వస్తుందని అక్కడ వినిపిస్తున్న వార్తలతో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడుతున్నారు.

అనవసరమైన అపోహల కారణంగా టీకా వేసుకునేందుకు మొగ్గు చూపించడం లేదు. ఇటు మన భారత దేశంలోనూ టీకా వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు కలిగి మరణిస్తున్నారని, భవిష్యత్తులో ఈ టీకా ప్రభావం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మొదట్లో ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా ఎవరూ వ్యాక్సిన్ కేంద్రాల వైపు అసలు చూడలేదు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ ను నమ్మి వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మరో వైపు ఈ విషయంలో ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే టీకాను వేయించుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదనే కారణంతో వార్డు వాలంటీర్లను తొలగించారు అధికారులు. ఆత్మకూరు మున్సిపాలిటీలో విధుల్లో ఉన్నటువంటి 65 మంది వాలంటీర్లను వారి జాబ్ నుండి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అధికారికంగా వెల్లడించారు . అంతే కాకుండా ఈ అరవై ఐదు వాలంటీర్ల స్థానాలు భర్తీ చేసేందుకు కొత్త వాలంటీర్ల కోసం సోమవారం నోటిఫికేషన్ ఇస్తామని కమిషనర్  పేర్కొన్నారు. ఇకనైనా వ్యాక్సిన్ వేసుకోవడానైకి సంకోచించకుండా ముందుకు వచ్చి కరోనా బారి నుండి రక్షణ పొందండి.









అప్పటిదాకా ఓటిటిలకు సినిమాలు అమ్ముకోవద్దు....

మెహరీన్ పెళ్లి ఆగిపోవడానికి కారణం..?

చంద్ర‌బాబు తెర‌మ‌రుగు.. రీజ‌న్ ఇదేనా?

శిరీష బండ్ల గర్వకారణం.. చిరు ఎమోషనల్ ట్వీట్

ఆహాలో లైన్ కట్టిన క్రేజీ సినిమాలు..!

కేసీఆర్‌ను అడ్డంగా ఫిక్స్ చేసిన జ‌గ‌న్ ?

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>