PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pm-modi-petro-rates5f937505-2b96-4ff4-9230-543d65f9d0eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pm-modi-petro-rates5f937505-2b96-4ff4-9230-543d65f9d0eb-415x250-IndiaHerald.jpgఅడ్డూఆపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రజల మౌనాన్ని మోదీ ప్రభుత్వం అలుసుగా తీసుకుంటోంది. కరోనా కష్టకాలంలో ప్రజల్ని దారుణంగా వంచిస్తోంది. వ్యాక్సిన్ కి డబ్బులు కావాలి, పేదలకు ఇస్తున్న ఉచిత తిండిగింజల సరఫరాకు డబ్బులు కావాలి అంటూ.. రకరకాల కారణాలతో, పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోంది. పెట్రోలు, డీజిల్ తోపాటు ఇటీవల గ్యాస్ సిలిండర్ రేటుని కూడా భారీగా పెంచేసింది కేంద్రం. పన్నుల్లో వాటాలు రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. అదేమని అడిగితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్pm modi; petro rates{#}Narendra Modi;Diesel;Coronavirus;Bharatiya Janata Party;Congress;central government;Delhiరంగంలోకి రైతులు.. మోదీకి బ్యాండ్ బాజానే..రంగంలోకి రైతులు.. మోదీకి బ్యాండ్ బాజానే..pm modi; petro rates{#}Narendra Modi;Diesel;Coronavirus;Bharatiya Janata Party;Congress;central government;DelhiSat, 03 Jul 2021 08:03:23 GMTఅడ్డూఆపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రజల మౌనాన్ని మోదీ ప్రభుత్వం అలుసుగా తీసుకుంటోంది. కరోనా కష్టకాలంలో ప్రజల్ని దారుణంగా వంచిస్తోంది. వ్యాక్సిన్ కి డబ్బులు కావాలి, పేదలకు ఇస్తున్న ఉచిత తిండిగింజల సరఫరాకు డబ్బులు కావాలి అంటూ.. రకరకాల కారణాలతో, పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోంది. పెట్రోలు, డీజిల్ తోపాటు ఇటీవల గ్యాస్ సిలిండర్ రేటుని కూడా భారీగా పెంచేసింది కేంద్రం. పన్నుల్లో వాటాలు రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. అదేమని అడిగితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు పన్ను తగ్గించుకోని ప్రజలకు మేలు చేయండనే ఉచిత సలహా కూడా పడేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ దశలో మోదీకి చుక్కలు చూపించడానికి రంగంలోకి దిగుతున్నారు రైతులు.


ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం దేనికైనా భయపడింది అంటే అది కేవలం ఒక్క రైతు ఉద్యమానికి మాత్రమే. రైతు చట్టాల రద్దుకోసం ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఉద్యమాన్ని ఎదుర్కోవడం కేంద్రానికి సాధ్యం కావడంలేదు. చట్టాల అమలుని వాయిదా వేసుకుని ఓ మెట్టు దిగినా, రద్దు చేస్తామంటేనే వెనక్కి వెళ్తామంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కరోనా కష్టకాలంలో కూడా వారు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి రైతు సంఘం నేతలు ఇప్పుడు పెట్రోరేట్ల పెంపుపై మండిపడుతున్నారు. రైతు సంఘాలు ఇంధన ధరలపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 8న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించడానికి పిలుపునిచ్చాయి.

ఉదయం 10గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపుకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రజలు కూడా ఈ ఆందోళనల్లో భాగస్వాములు కావాలని కోరారు రైతు సంఘం నేతలు. డీజిల్ ధరలు పెరిగిపోవడంతో వ్యవసాయరంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని మండిపడుతున్నారు. రైతు సంఘాల నిరసన ప్రదర్శన విజయవంతం అయితే దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళనలు ఉధృతం అవుతాయనడంలో అనుమానం లేదు. ఇన్నాళ్లూ ప్రజల మౌనాన్ని అలుసుగా తీసుకున్న కేంద్రం, రైతుల ఆందోళనకైనా దిగొస్తుందేమో చూడాలి.





ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

రాజమౌళి కి అసహనాన్ని కలిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ !

కేటీఆర్‌ పట్టాభిషేకానికి.. హూజూరాబాద్ గండం..?

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు.. ఎంత వరకూ నిజం..?

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అదీప్‌కు రామ్మోహన్ బామ్మర్ది చెక్ పెట్టగలరా?

కాపు-కేతిరెడ్డి: ఈ ఇద్దరులో జగన్ ఛాయిస్ ఎవరు?

పెరిగిన హోండా బైక్స్ సేల్స్.. వివరాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>