MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroin-movies35ab81c5-6cb7-4329-a481-118276a03ba5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroin-movies35ab81c5-6cb7-4329-a481-118276a03ba5-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో దర్శకుడు - హీరో కాంబినేషన్ ఒకసారి హిట్ అయిందంటే, మరోసారి అదే కాంబినేషన్లో సినిమాలు తీయడం సహజం. హీరో - హీరోయిన్ల విషయంలో కూడా అంతే.. ఒకసారి ఆ జోడి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది అంటే వరుసగా అదే జోడీతో సినిమాలు తీయడానికి మక్కువ చూపుతారు దర్శకనిర్మాతలు. అలా మన సినీ ఇండస్ట్రీలో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు హీరో - హీరోయిన్ల జోడీలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. అలా ఎన్ని జోడీలు.. ఎన్ని సార్లు నటించారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. HERO HEROIN MOVIES{#}Vijayashanti;jamuna;savitri;Thief;Illalu;Savithri;Donga;Sindhuram;Jayam manadera;Missamma;Balakrishna;Darsakudu;krishna;Venkatesh;NTR;Chiranjeevi;marriage;Director;Chitram;Hero;Industry;Cinemaఆన్ స్క్రీన్ జతగా అధికంగా అలరించిన జోడీలు..ఆన్ స్క్రీన్ జతగా అధికంగా అలరించిన జోడీలు..HERO HEROIN MOVIES{#}Vijayashanti;jamuna;savitri;Thief;Illalu;Savithri;Donga;Sindhuram;Jayam manadera;Missamma;Balakrishna;Darsakudu;krishna;Venkatesh;NTR;Chiranjeevi;marriage;Director;Chitram;Hero;Industry;CinemaSat, 03 Jul 2021 16:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో దర్శకుడు -  హీరో కాంబినేషన్ ఒకసారి హిట్ అయిందంటే,  మరోసారి అదే కాంబినేషన్లో సినిమాలు తీయడం సహజం. హీరో - హీరోయిన్ల విషయంలో కూడా అంతే.. ఒకసారి ఆ జోడి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది అంటే వరుసగా అదే జోడీతో సినిమాలు తీయడానికి మక్కువ  చూపుతారు దర్శకనిర్మాతలు. అలా మన సినీ ఇండస్ట్రీలో 5  లేదా అంతకంటే ఎక్కువసార్లు హీరో - హీరోయిన్ల జోడీలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. అలా ఎన్ని జోడీలు.. ఎన్ని సార్లు నటించారో ఇప్పుడు ఇక్కడ  చదివి తెలుసుకుందాం..


1. వెంకటేష్ - సౌందర్య:
సినీ ఇండస్ట్రీలో వెంకటేష్ - సౌందర్యల జోడి చూడముచ్చటైనది. దాదాపుగా వీరు తీసిన అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ga తెరకెక్కడం విశేషం. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి.. 1994 లో వచ్చిన సూపర్ పోలీస్,1996లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 1997 లో వచ్చిన పెళ్లి చేసుకుందాం రా, 1999లో వచ్చిన రాజా, 1996 లో వచ్చిన పవిత్ర బంధం, 2000 సంవత్సరంలో వచ్చిన దేవి పుత్రుడు, జయం మనదేరా వంటి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులకు కన్నుల విందుగా కనిపించింది ఈ జోడి..

2. ఎన్టీఆర్ - సావిత్రి:
వెండితెరపై ఆన్ స్క్రీన్ మీద  ఈ జోడికి ఉన్నంత ప్రాముఖ్యత, మరే జోడికి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ జోడి నటించ లేని విధంగా వీరిద్దరూ కలిసి దాదాపు 15 సినిమాలలో నటించి , అన్ని సూపర్ హిట్ కావడం మరో విశేషం. 1955 సంవత్సరంలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా మొదలుకొని.. 1969 సావిత్రి  స్వీయ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవత చిత్రం వరకు వీరిద్దరు కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించడం విశేషం.


3. ఏఎన్ఆర్ - జమున:
ఆన్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ - సావిత్రి జోడి తరువాత అంత ప్రావీణ్యం పొందిన జోడి ఏఎన్నార్ - జమున ల జోడి అని చెప్పవచ్చు. ఇక సావిత్రి - ఎన్టీఆర్  జోడి కంటే,ఈ జోడి 20 చిత్రాలకంటే ఎక్కువ సినిమాలలో నటించి ఇండస్ట్రీ బెస్ట్ జోడి గా గుర్తింపు పొందింది.

4. సూపర్ స్టార్ కృష్ణ - రాధా :
ఈజోడి ల తర్వాత మంచి జోడి గా గుర్తింపు పొందిన జోడీ సూపర్ స్టార్ కృష్ణ - రాధా. ఈ జోడీ కూడా దాదాపు 19 చిత్రాలలో నటించి, అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.


5. బాలకృష్ణ - విజయశాంతి:
బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ, ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన  నటించిన అన్ని సినిమాల్లో దాదాపుగా విజయశాంతి హీరోయిన్ గా నటించడం మరో విశేషం. ఇక వీరిద్దరూ కలిసి ఏకంగా పదహారు చిత్రాల్లో నటించడం గమనార్హం.

6. చిరంజీవి - రాధా:
కృష్ణ జనరేషన్ తర్వాత చిరంజీవితో కలిసి రాధా దాదాపు 14 చిత్రాలలో నటించి బెస్ట్ ఇండస్ట్రీ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మొదట  ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1985 సంవత్సరంలో వచ్చిన రక్షా సింధూరం మొదలుకొని, చివరగా  1990 లో అదే డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొండ వీటి దొంగ చిత్రం వరకు నటించి మంచి జోడిగా గుర్తింపు పొందింది.



ఈ జోడి లే కాక ఇంకా మరెన్నో జోడీలు సూపర్ హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల  ముందుకు వచ్చి ,ఇండస్ట్రీ బెస్ట్ పెయిర్ గా గుర్తింపు పొందాయి.





క‌మ‌ల్ - గౌత‌మి సీనే ఆమీర్ - కిర‌ణ్ రావు జీవితంలో రిపీట్ ?

ఆచార్యలో హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ ఇదే..?

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

సునీల్ మెల్ల మెల్లగా మళ్ళీ గాడిలో పడుతున్నాడుగా..!!

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!

రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?

ప‌వ‌న్ ఈ రూట్లో కేంద్ర మంత్రి అవుతున్నారా ?

మాలాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో చోటు లేదు నటి ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>