PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila7ea88de9-b293-479b-83d0-50ee25c54465-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila7ea88de9-b293-479b-83d0-50ee25c54465-415x250-IndiaHerald.jpgకొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుని... ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అదే రోజు మ‌ధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించి అక్క‌డ కొద్ది సేపు ప్ర‌సంగిస్తారు. Y S Sharmila{#}Jayanthi;kadapa;Evening;anil kumar singhal;Huzur Nagar;dr rajasekhar;Sharmila;Party;CM;Telanganaష‌ర్మిల కొత్త పార్టీకి ఇన్ని సెంటిమెంట్లా..!ష‌ర్మిల కొత్త పార్టీకి ఇన్ని సెంటిమెంట్లా..!Y S Sharmila{#}Jayanthi;kadapa;Evening;anil kumar singhal;Huzur Nagar;dr rajasekhar;Sharmila;Party;CM;TelanganaSat, 03 Jul 2021 12:10:00 GMTతెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు రెడీ అవుతోన్న వైఎస్‌. ష‌ర్మిల అందుకు త‌గిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న కోసం ష‌ర్మిల చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. త‌న తండ్రి, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు.  ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుండ‌గా... పార్టీ పేరును  ఇప్పటికే 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా పేరును ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. ఇక కొత్త పార్టీ ప్ర‌క‌టన రోజునే తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌తంలో యాక్టివ్ గా ఉన్న‌ ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునే ప్లాన్ చేస్తున్నారు.

కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుని... ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అదే రోజు మ‌ధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించి అక్క‌డ కొద్ది సేపు ప్ర‌సంగిస్తారు.

అనంత‌రం సాయంత్రం 4 గంటలకు జే ఆర్ సీ కన్వెన్షన్‌కు చేరుకొని.. 5 గంటలకు షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వ్య‌వ‌హారాలు ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక ష‌ర్మిల త‌న పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా త‌మిళ‌నాడుకు చెందిన పీకే శిష్యురాలు ప్రియ‌ను నియ‌మించుకున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రియ గ‌తంలో ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌లకు ప్ర‌శాంత్ కిషోర్ బృందంలో ప‌నిచేశారు. ఏదేమైనా ష‌ర్మిల కొత్త పార్టీ వేడి తెలంగాణ‌లో మొద‌లైంద‌నే చెప్పాలి. ఈ పార్టీ ప్ర‌భావం ఎలా ?  ఉంటుందో ?  కాల‌మే నిర్ణ‌యించాలి.

 



"దీదీ" సీఎం పదవికి గండమేనా ?

జూలై 8 సాయంత్రం 5 గంట‌ల‌కు ష‌ర్మిల కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌

రేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. కేసీఆర్‌ కొంప ముంచేలా ఉన్నాడే..?

ఏపీలో కాపుల కొత్త పార్టీ వ‌స్తోందా...!

కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

కేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!

విశాఖ‌ప‌ట్న‌మా? విజ‌య‌సాయి ప‌ట్న‌మా?

అక్కడ టిఆర్ఎస్ పతనమేనా..?

జగన్‌ కేసుల్లో లాజిక్‌.. సీఎం కొడుకైతే పెట్టుబడులు పెట్టకూడదా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>