MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-movies-life-s-risk62470b13-ccd0-4327-8382-e8c1f35f86ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-movies-life-s-risk62470b13-ccd0-4327-8382-e8c1f35f86ad-415x250-IndiaHerald.jpgముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల విషయానికి వస్తే , వారు సమయానికి ఎంత విలువ ఇస్తారో.. అంతకంటే ఎక్కువ డెడికేషన్ తో పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఒక సినిమా భారీగా హిట్ కొట్టాలంటే హీరో ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి హీరోలు సినిమా షూటింగ్ సమయంలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి తీస్తూ ఒక్కోసారి గాయాలపాలు అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోలు యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు గాయాలు అవ్వడం అతి సాధారణం. అలా ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన తీసిన ఎన్నో సినిNTR MOVIES LIFE S=RISK{#}surender reddy;v v vinayak;vamsi paidipally;Ileana D'Cruz;Oosaravelli;Brindavanam;Adhurs;Jr NTR;RRR Movie;NTR;Rajamouli;Chitram;Hero;Telugu;CinemaNTR .. తన ప్రాణాన్నే పణంగా పెట్టి తీసిన సినిమాలు..NTR .. తన ప్రాణాన్నే పణంగా పెట్టి తీసిన సినిమాలు..NTR MOVIES LIFE S=RISK{#}surender reddy;v v vinayak;vamsi paidipally;Ileana D'Cruz;Oosaravelli;Brindavanam;Adhurs;Jr NTR;RRR Movie;NTR;Rajamouli;Chitram;Hero;Telugu;CinemaSat, 03 Jul 2021 10:00:00 GMT
ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల విషయానికి వస్తే , వారు సమయానికి ఎంత విలువ ఇస్తారో.. అంతకంటే ఎక్కువ డెడికేషన్ తో పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఒక సినిమా భారీగా హిట్ కొట్టాలంటే హీరో ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి హీరోలు సినిమా షూటింగ్ సమయంలో తమ ప్రాణాలను కూడా  పణంగా పెట్టి  తీస్తూ ఒక్కోసారి గాయాలపాలు అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోలు యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు గాయాలు అవ్వడం అతి సాధారణం. అలా  ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన తీసిన ఎన్నో సినిమాలలో తన ప్రాణాలనే పణంగా పెట్టి  గాయాలపాలయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. శక్తి:
మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం శక్తి. ఈ చిత్రం 2011లో విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు.

2. సింహాద్రి:
2003వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా అంకిత, భూమికలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం సింహాద్రి.ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కు  బాగా గాయాలు కూడా అయ్యాయి. అయినా కూడా షూటింగ్ కంటిన్యూ చేశారు ఎన్టీఆర్.

3. స్టూడెంట్ నెంబర్.1:
2001వ సంవత్సరంలో  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్.ఈ  సినిమా ఎన్టీఆర్ సినీ కెరియర్ నే మార్చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయాలు పాలవడంతో కొద్దిరోజులు సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

4. యమదొంగ :
2007లో రాజమౌళి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ గా తెరకెక్కిన చిత్రం యమదొంగ. ఈ సినిమాలో ఒక  పాటలో అలాగే  తాడు కట్టుకున్నప్పుడు కూడాఎన్టీఆర్  గాయాలపాలయ్యారు.

5. ఆది:
2002 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం ఆది. ఫ్యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో పెద్ద ఎత్తున ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు, ఎన్టీఆర్  మోచేతికి గాయం అయ్యి, ఒక పాటలో అలాగే కట్టు కట్టుకొని చేశాడు..

ఇక అంతే కాదు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమా క్లైమాక్స్ లో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఊసరవెల్లి సినిమా లో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాలో కూడా ఎన్టీఆర్ కు గాయాలు కావడం గమనార్హం. అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా ఎన్టీఆర్ కి గాయాలయ్యాయి.





తన పని అయిపోయింది అనుకున్న వారి మీద పంజా విసిరిన ఎన్.టి.ఆర్..!

ఓటీటీ పై కోలీవుడ్ నిర్ణయంతో ఆలోచనలలో పడ్డ టాలీవుడ్ !

ఒక్క యాడ్ లో కూడా నటించని యాక్టర్స్ వీరే..?

తన పని అయిపోయింది అనుకున్న వారి మీద పంజా విసిరిన ఎన్.టి.ఆర్..!

బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం వంటి పౌరాణిక సినిమాల్లో బాలనటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

జల వివాదం : కేంద్ర జలశక్తి శాఖ కీలక ఆదేశాలు!

జగనన్న మాటసాయం.. షర్మిలకు కలిసొచ్చిన జల జగడం..

హీరో లేకుండానే ఆది పురుష్.. !

కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై మన వాళ్లు నోరు విప్పరే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>