EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth15e8d763-8dd3-4880-9854-46e7101ffa54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth15e8d763-8dd3-4880-9854-46e7101ffa54-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి.. తెలంగాణలో దూకుడు ఉన్న నాయకుడు.. నోటి మాటలతోనే మంటలు పుట్టించగలిగిన కొద్ది మంది తెలంగాణ నాయకుల్లో ఆయన ఒకడు. తెలుగు దేశం నుంచి కాంగ్రెస్‌లో చేరేటప్పుడే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తనకు కావాలని డిమాండ్ చేశాడని అంటుంటారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు.. లక్ష్యం దిశగా తొలి అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పీఠం పై కూర్చున్న రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాడు. తనను విమర్శించిన వీహెచ్ వంటి నేతలను కూడా పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి.. అందిరినీ కలుపుకుని పోrevanth{#}Telugu Desam Party;V Hanumantharao;Dookudu;revanth;Elections;KCR;Josh;Revanth Reddy;Congress;Bharatiya Janata Party;Party;Telanganaరేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. కేసీఆర్‌ కొంప ముంచేలా ఉన్నాడే..?రేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. కేసీఆర్‌ కొంప ముంచేలా ఉన్నాడే..?revanth{#}Telugu Desam Party;V Hanumantharao;Dookudu;revanth;Elections;KCR;Josh;Revanth Reddy;Congress;Bharatiya Janata Party;Party;TelanganaSat, 03 Jul 2021 12:00:00 GMTరేవంత్ రెడ్డి.. తెలంగాణలో దూకుడు ఉన్న నాయకుడు.. నోటి మాటలతోనే మంటలు పుట్టించగలిగిన కొద్ది మంది తెలంగాణ నాయకుల్లో ఆయన ఒకడు. తెలుగు దేశం నుంచి కాంగ్రెస్‌లో చేరేటప్పుడే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తనకు కావాలని డిమాండ్ చేశాడని అంటుంటారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు.. లక్ష్యం దిశగా తొలి అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పీఠం పై కూర్చున్న రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాడు.


తనను విమర్శించిన వీహెచ్ వంటి నేతలను కూడా పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి.. అందిరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కొన్ని నెలలుగా తెలంగాణలో డీలా పడిన పార్టీ శ్రేణుల్లో మళ్లీ కదలిక తెస్తున్నాడు. రాజకీయ నాయకుడు నిత్యం వార్తల్లో ఉండాలి.. అదెలాగో బాగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడైన తొలి రోజే.. ఈటల ను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అంటూ బాంబు పేల్చాడు. కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం సమకూర్చి డిల్లీ పంపింది కేసీఆరేనని రేవంత్ రెడ్డి విమర్శించాడు.


రేవంత్ విమర్శలపై టీఆర్ఎస్‌, బీజేపీ కూడా పెద్దగా ఖండించలేదు. ఇక ఇప్పుడు తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని రేవంత్ మరో ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ పూర్తి కాలం పదవిలో ఉండరని.. త్వరలోనే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో చెప్పుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. కానీ.. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు.. కార్యోన్ముఖులను చేసేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి కొత్త విషయాలు ప్రచారంలోకి తెస్తున్నారు.


మొత్తం మీద రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. రేవంత్ జోష్ బీజేపీ, టీఆర్ఎస్‌లకు కాస్త కలవరం కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో బలంగానే ఉంది. దానికి కావాల్సిందల్లా దారి చూపే దీటైన నాయకత్వమే. అది రేవంత్ రెడ్డి సమర్థంగా అందిస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తోంది. మరి అది ఏ స్థాయిలో ఉంటుంది. రేవంత్‌ జోరుకు టీఆర్ఎస్, బీజేపీ ఎలా అడ్డుకుంటాయన్నది చూడాలి.  





"దీదీ" సీఎం పదవికి గండమేనా ?

ష‌ర్మిల కొత్త పార్టీకి ఇన్ని సెంటిమెంట్లా..!

కత్తి మహేష్ విషయం 'అన్న' ఫాన్స్ కి కూడా నచ్చలేదా?

ఏపీలో కాపుల కొత్త పార్టీ వ‌స్తోందా...!

కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

కేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!

విశాఖ‌ప‌ట్న‌మా? విజ‌య‌సాయి ప‌ట్న‌మా?

అక్కడ టిఆర్ఎస్ పతనమేనా..?

స్థిరంగా పెట్రోల్..బీట్ చేసేలా డీజిల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>