PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-jagan4390ec1c-fb0b-4963-8148-16cd2bfa5cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-jagan4390ec1c-fb0b-4963-8148-16cd2bfa5cde-415x250-IndiaHerald.jpgఆమధ్య ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యుడు భాస్కర్ రావు వైద్యం కోసం కోటి రూపాయలు వెంటనే మంజూరు చేసిన సీఎం జగన్ ని అందరూ దేవుడంటూ కొనియాడారు. ఊపిరితిత్తుల మార్పిడికోసం కోటి రూపాయల ఆర్థికసాయం చేసి, అవసరమైతే మరో 50లక్షలు ఇస్తానంటూ జగన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. కానీ ఇప్పుడు అదే జగన్, కత్తి మహేష్ అనే వ్యక్తి చికిత్సకోసం కేటాయించిన 17లక్షల రూపాయలు మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. కత్తి మహేష్ చికిత్సకోసం ఏపీ ప్రభుత్వం 17లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం ఇప్పుడుcm jagan{#}bhaskar;Hyderabad;Bigboss;Baba Bhaskar;Prakasam;Chittoor;Qualification;Kathi Mahesh;Andhra Pradesh;Katthi;Jagan;Government;CM;Telanganaఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..cm jagan{#}bhaskar;Hyderabad;Bigboss;Baba Bhaskar;Prakasam;Chittoor;Qualification;Kathi Mahesh;Andhra Pradesh;Katthi;Jagan;Government;CM;TelanganaSat, 03 Jul 2021 06:55:30 GMTఆమధ్య ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యుడు భాస్కర్ రావు వైద్యం కోసం కోటి రూపాయలు వెంటనే మంజూరు చేసిన సీఎం జగన్ ని అందరూ దేవుడంటూ కొనియాడారు. ఊపిరితిత్తుల మార్పిడికోసం కోటి రూపాయల ఆర్థికసాయం చేసి, అవసరమైతే మరో 50లక్షలు ఇస్తానంటూ జగన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. కానీ ఇప్పుడు అదే జగన్, కత్తి మహేష్ అనే వ్యక్తి చికిత్సకోసం కేటాయించిన 17లక్షల రూపాయలు మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. కత్తి మహేష్ చికిత్సకోసం ఏపీ ప్రభుత్వం 17లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. సీఎం జగన్ చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు నెటిజన్లు.\

ఎవరీ కత్తి మహేష్..?
సినీ విమర్శకుడు, సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్.. ఇలా కత్తి మహేష్ గురించి చాలా చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా స్వస్థలం, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి, ఆయన్ని తెలంగాణవాసిగా చెప్పుకోవాలి. అలాంటి సందర్భంలో అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు సాయం చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన గతంలో శ్రీరాముడిని కించపరిచేలా మాట్లాడారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, అలాంటి వ్యక్తికి ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సాయం చేసిందని అడుగుతున్నారు.


తెలంగాణ వ్యక్తికి ఏపీలో ప్రమాదం జరిగింది, తమిళనాడులో చికిత్స చేస్తున్నారు. రాగాపోగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి కానీ ఏపీ ఎందుకు హడావిడి చేస్తోందని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ కోణం ఉందా..?
గతంలో కత్తి మహేష్ పవన్ కల్యాణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సమయంలో వైసీపీకి, జగన్ కి ఆయన అనుకూలంగా కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్ చేసిన ఆర్థిక సాయాన్ని రాజకీయ కోణంలో కూడా విమర్శిస్తున్నారు నెటిజన్లు. అంత ఉదార స్వభావం ఉంటే వ్యక్తిగతంగా సాయం చేయాలని, ప్రజల సొమ్ముతో కత్తి మహేష్ కి ట్రీట్ మెంట్ ఇప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సొంతగా కారులో ప్రయాణించే స్థోమత ఉన్న కత్తి మహేష్ కు ప్రభుత్వం తరపున సాయం అందించడం సరికాదంటున్నారు. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందిస్తే ఎవరూ కాదనరని, కానీ ఏ అర్హత ఉందని కత్తి మహేష్ కి సాయం చేశారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇటీవల కాలంలో ఏ విషయంలో కూడా జగన్ ఈ రేంజ్ లో ట్రోలింగ్ కి గురికాలేదు. తొలిసారిగా కత్తి మహేష్ చికిత్సకోసం చేసిన సాయం విషయంలో జగన్ ఇలా బుక్కైపోయారు.



కృష్ణా రి'వార్' : జూలై 9న కీలక సమావేశం!

ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

'దిశ'కు సూపర్ రెస్పాన్స్

షర్మిల పార్టీ జెండా.. ఆ కలర్ లోనే ఉంటుందట?

షాకింగ్ : 300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

ఎమ్మెల్యే బేతి ఆ మహిళా కార్పొరేటర్ మధ్య ఏం జరుగుతోంది..?

కేటీఆర్‌ పట్టాభిషేకానికి.. హూజూరాబాద్ గండం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>