PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telugu-states-water-issue63a90e7a-bc03-4845-93bb-dab1fa9b05b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telugu-states-water-issue63a90e7a-bc03-4845-93bb-dab1fa9b05b5-415x250-IndiaHerald.jpgకొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా జల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ వివాదంపై పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.TELUGU STATES WATER ISSUE{#}Srisailam;Huzurabad;Rayalaseema;dr rajasekhar;Aqua;electricity;Delhi;Jagan;News;KCR;CM;Telangana;Andhra Pradesh;Teluguజగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...TELUGU STATES WATER ISSUE{#}Srisailam;Huzurabad;Rayalaseema;dr rajasekhar;Aqua;electricity;Delhi;Jagan;News;KCR;CM;Telangana;Andhra Pradesh;TeluguSat, 03 Jul 2021 17:00:00 GMTకొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా జల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ వివాదంపై పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మంత్రుల వ్యాఖ్యలను ఖండించకపోగా, ఏపీపై మరియు దివంగత నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్సధాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ అక్రమంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడుతోందని మాట్లాడుతున్నారు. ఇటువంటి పద్దతికి ఏపీ సీఎం జగన్ స్వస్తి చెప్పాలని, వెంటనే నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేసిన వైనం మనము చూస్తూనే ఉన్నాము. 

అయితే ఇక్కడ పలు అంశాలు చర్చకు వస్తున్నాయి మరియు ఈ విషయంపై కేసీఆర్ ప్రవర్తన పట్ల సందేహాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా రాయలసీమ ప్రాజెక్ట్ జీవో జనవరిలోనే తెచ్చినప్పటికీ, దీనిపై కేసీఆర్ జూన్ లో స్పందించడం పై అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఏపీపై తప్పు చేస్తోందని విమర్శిస్తున్న కేసీఆర్, శ్రీశైలం ప్రాజెక్ట్ పై అభ్యంతరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఏమిటని అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వలన అధిక మోతంలో నీరు వృధా అవుతోందని చెబుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదు. ఇపుడు కేసీఆర్ దృష్టంతా హుజురాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక మీదనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికలకు ఈ జల వివాదాన్ని ఉపయోగించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇలా తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రజలకు తెలిసేలా చేయడానికి. ఆ సింపతీని పొందేందుకు మరో ప్రణాళికతో రెడీ గా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఈ వివాదాన్ని అక్కడ హైలైట్ చేసి ఏపీపై ఫిర్యాదులు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగితే పర్వాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ లో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా అటు ఏపీ ని మరియు కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారట. మరి ఏమి జరగనుందో ఈ జల వివాదం ఇంకెంత దూరం వెళుతుందో అర్ధం కావట్లేదు.



కార్తీక దీపం హిమ ఇంటికి ఈటల... నెట్టింట వైరల్.. !

కేసీఆర్‌ను అడ్డంగా ఫిక్స్ చేసిన జ‌గ‌న్ ?

క‌మ‌ల్ - గౌత‌మి సీనే ఆమీర్ - కిర‌ణ్ రావు జీవితంలో రిపీట్ ?

క‌మ్మ‌, వెల‌మల‌కు రూ.100 కోట్ల భూమి?

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా జల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ వివాదంపై పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!

ప‌వ‌న్ ఈ రూట్లో కేంద్ర మంత్రి అవుతున్నారా ?

ఎంపీగా కేసీఆర్‌... గ‌జ్వేల్‌కు గుడ్ బై ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>