MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aha-ott-platform151dcce5-2006-4862-9026-e777e30f57d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aha-ott-platform151dcce5-2006-4862-9026-e777e30f57d3-415x250-IndiaHerald.jpgప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొత్త సినిమాలను, వెబ్ సిరీస్, షోలను ఇంకా తదితర వీడియో కంటెంట్ ని కేవలం తెలుగులోనే ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. అయితే 14 నెలల్లోనే ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ బాగా పాపులర్ అయ్యింది. మొదట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈ సంస్థ తర్వాత మంచి సినిమాలను కొనుగోలు చేస్తూ.. ఆహా ఒరిజినల్స్ అంటూ సరికొత్త కంటెంట్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. ఇటీవల కాలంలో తెలుగులో విడుదలైన చాలా వరకు సినిమాలు ఆహా వేదికగానే రిలీజ్ అఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..?aha ott platform{#}Amazon;Love;akhil akkineni;NagaShaurya;amala paul anaka;Telugu;Mahaఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..?ఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..?aha ott platform{#}Amazon;Love;akhil akkineni;NagaShaurya;amala paul anaka;Telugu;MahaSat, 03 Jul 2021 13:00:00 GMT
నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగశౌర్య "లక్ష్య", అమలాపాల్ "కుడిఎడమైతే" సినిమాలు త్వరలోనే ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయని సమాచారం. 4 తెలుగు సినిమాలను నేరుగా ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ విడుదల చేయడం ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు. మిగతా స్ట్రీమింగ్ సంస్థలు మహా అంటే నెలకు ఒకటి లేదా రెండు తెలుగు సినిమాలు విడుదల చేస్తున్నాయి. తెలుగు సినిమాలను నేరుగా రిలీజ్ చేయడంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ముందు వరుసలో ఉంటుంది. భారీ డీల్స్ ఆఫర్ చేస్తూ రీజనల్ లాంగ్వేజెస్ లో తన సత్తా చాటాలని ప్రైమ్ వీడియో బాగా ప్రయత్నిస్తోంది. కానీ దానికి ధీటుగా నిలవడానికి ఆహా దూకుడుగా వ్యవహరిస్తోంది.

తెలుగు భాషలో ఎక్స్ క్లూజివ్ వెబ్ సిరీస్ లు, సరికొత్త సినిమాలను విడుదల చేయడంలో ఆహా భారీ నిర్ణయాలు తీసుకోవడం ప్రైమ్ వీడియోకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ వీడియో లో తెలుగులో ఏం వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే. కానీ ఆహాలో 11th అవర్, లాక్డ్, హనీ మూన్, అద్దం, మస్తీస్, సిన్, కొత్త పోరడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్స్ క్లూజివ్ వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో తెలుగువారికి ఆహా అనేది ఫేవరెట్ ఓటీటీగా మారుతోంది. మరోపక్క అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులారిటీ తగ్గిపోతోంది.




రామానాయుడు స్టూడియోలో అమ‌రావ‌తి?

వకీల్ సాబ్ కి చేసిన తప్పే పవన్ ఏకే రీమేక్ కి చేస్తున్నాడా!!

హీరోయిన్ హీరా ప్రేమ వల్ల సర్వం కోల్పోయిందా.. ?

ఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

ఆ భామను వదలని సీనియర్ రైటర్!

నేత‌ల‌తో స‌మావేశ‌మైన టీబీజేపీ చీఫ్‌... చ‌ర్చ ఇదే...?

టీజర్: ఆసక్తిరేపుతున్న అమలాపాల్ క్రైమ్ థ్రిల్లర్..?

అదే ఆహా చేసిన తప్పు.. ఆడుకుంటున్న నెటిజన్స్!!

వామ్మో, శిల్పా శెట్టి ఎంటి ఇలా మారిపోయింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>