PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan290fc382-1d1e-47fb-8e09-5c2702d14c96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan290fc382-1d1e-47fb-8e09-5c2702d14c96-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. సంక్షేమంలో జగన్ కి మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో అభివృద్ధి విషయంలో మాత్రం విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ మంత్రివర్గంలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వారి పనితీరును కూడా జనాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. jagan{#}Ministerసీనియర్లకు దారి చూపుతున్న జగన్... ?సీనియర్లకు దారి చూపుతున్న జగన్... ?jagan{#}MinisterSat, 03 Jul 2021 20:01:05 GMTఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. సంక్షేమంలో జగన్ కి మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో అభివృద్ధి విషయంలో మాత్రం విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ మంత్రివర్గంలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వారి పనితీరును కూడా జనాలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే పాతిక మంది మంత్రులలో చూసుకుంటే అయిదారుగురు తప్ప మిగిలిన వారు అంతా జూనియర్లే. అయితే జగన్ చెప్పిన మేరకు మంత్రి వర్గ విస్తరణ జరగాలి అంటే కచ్చితంగా మరో అయిదు నెలల గడువు మాత్రమే ఉంది. అంటే మంత్రుల మెడ మీద కత్తి వేలాడుతోంది అన్న మాటే. జగన్ మంత్రులలో సీనియర్లు సేఫ్ అన్న మాట ఇంతకాలం వినిపించేది. కానీ ఇపుడు అలా కాదు ఎవరైనా ఒక్కటే అంటున్నారు.

పనితీరు కూడా కొలబద్ధ కాబోదు అన్న మరో మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ లో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కాక సీనియారిటీతో ఉన్న ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలంటే ప్రస్తుత మంత్రి మండలి నూటికి నూరు శాతం మారుస్తారు అంటున్నారు. అంటే సీనియర్లు కూడా పక్కలు తప్పుకోవాలి అన్న మాట.

ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకరరెడ్డికి కానీ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కానీ చాన్స్ ఇవ్వాలి అంటే కచ్చితంగా పెద్దిరెడ్డిని మాజీని చేయాల్సిందే. ఇక ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ కానీ, నెల్లూరులో మేకపాటి, అనిల్ కుమార్ కానీ మాజీలు అవుతారనే టాక్ వస్తోంది. ఇక క్రిష్ణా జిల్లాలో  వెల్లంపల్లి సహా  ఇద్దరు నానీలు ఇంటికే అన్న టాక్ కూడా ఉంది. విజయన‌గరంలో బొత్స సత్యనారాయణ,  శ్రీకాకుళంలో ధర్మాన క్రిష్ణ దాస్ కూడా మాజీలు అయితేనే కొత్త వారు క్యాబినేట్లోకి వస్తారు అని చెబుతున్నారు. మొత్తం మీద జగన్  ఆలోచనల మేరకు మరో పాతిక మంది కొత్తవారు మంత్రులు అవుతారు. అంటే ఇపుడు ఉన్న వారి మంత్రి వైభోగం ముగిసినట్లే. సీనియర్లు కూడా అదే రూట్ పట్టాల్సిందే అంటున్నారు.






జ‌గ‌న్‌ని వ‌ద‌ల‌ని ఆర్ఆర్ఆర్‌...తెర‌పైకి మ‌రో అంశం...?

ఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. సంక్షేమంలో జగన్ కి మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో అభివృద్ధి విషయంలో మాత్రం విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ మంత్రివర్గంలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వారి పనితీరును కూడా జనాలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

వెల్లంపల్లి నోరు అదుపులోపెట్టుకో - టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి

అన్న‌కు ఓకే... త‌మ్ముడికి కూడా టీడీపీ టిక్కెట్ ఖ‌రారైందా ?

కార్తీక దీపం హిమ ఇంటికి ఈటల... నెట్టింట వైరల్.. !

జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...

ప‌వ‌న్ ఈ రూట్లో కేంద్ర మంత్రి అవుతున్నారా ?

ఎంపీగా కేసీఆర్‌... గ‌జ్వేల్‌కు గుడ్ బై ?

పాపం వైసీపీలో ఆ రెడ్డి గారి క‌ష్టం ఎవ్వ‌రికి వ‌ద్దా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>