EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-joinings0ff62b9a-ab8d-44ff-8c8d-8fcbbd6e8c11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-joinings0ff62b9a-ab8d-44ff-8c8d-8fcbbd6e8c11-415x250-IndiaHerald.jpgపోనీ.. ఎన్నిక‌లే వ‌చ్చినా.. అటు టీఆర్ ఎస్‌కు, ఇటు ఏపీలోని వైసీపీకి కూడా ఎలాంటి న‌ష్టం చేకూర‌దు. ఎటొచ్చీ.. ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా అధికారంలోకి రావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపికిమాత్రం తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ వ్యూహాలు బొక్క‌బోర్లా ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఎందుకంటే.. కేంద్రం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు అలా ఉన్నాయి.BJP{#}electricity;central government;Bharatiya Janata Party;Party;Telugu;Telangana;Andhra Pradeshకేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!కేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!BJP{#}electricity;central government;Bharatiya Janata Party;Party;Telugu;Telangana;Andhra PradeshSat, 03 Jul 2021 11:20:10 GMTసంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మే. కానీ, అవి కూడా కొంత వ‌ర‌కు.. కొన్ని వ‌ర్గాల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాలి. కానీ, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌బుత్వం మాత్రం.. మితిమీరిన సంస్క‌ర‌ణ‌లు తీసుకువవ‌స్తోంది. వీటిని అమ‌లు చే్యాల్సిందేనని గ‌ద్దిస్తోంది కూడా! అలా చేయ‌క‌పోతే.. అప్పులు పుట్ట‌వ‌ని.. కేంద్ర ప‌థ‌కాలు కూడా అమ‌లు కావ‌ని హెచ్చ‌రిక‌లు చేస్తోంది. అయితే.. ఇలాంటి సంస్క‌ర‌ణ‌లు.. ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రాల్లోని బీజేపీ యేత‌ర ప్ర‌బుత్వాల‌కు ఇబ్బందులు కావు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల‌ను తీసుకుంటే.. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీల‌కు కూడా ఇబ్బందులు కానేకావు.

పోనీ.. ఎన్నిక‌లే వ‌చ్చినా.. అటు టీఆర్ ఎస్‌కు, ఇటు ఏపీలోని వైసీపీకి కూడా ఎలాంటి న‌ష్టం చేకూర‌దు. ఎటొచ్చీ.. ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా అధికారంలోకి రావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపికిమాత్రం తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ వ్యూహాలు బొక్క‌బోర్లా ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఎందుకంటే.. కేంద్రం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు అలా ఉన్నాయి.

+ రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దు
+ రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇవ్వొద్దు
+ రేష‌న్ కార్డు దారుల‌ను స‌గానికి స‌గం త‌గ్గించాలి
+ ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో.. ప‌న్నులు పెంచాలి
+ తాగునీటికి మీట‌ర్లు బిగించి చార్జీలు పెంచాలి
+ విద్య‌లో సంస్క‌ర‌ణ‌లు తెచ్చి.. పాఠ‌శాల‌ల‌ను త‌గ్గించాలి
+ హిందీని ప్ర‌ధాన భాష‌గా బోధించాలి

.. ఇలా అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం చేస్తేనే రాష్ట్రాల‌కు అప్పులు ఇస్తామ‌ని చెబుతోంది. దీనిలో ఇప్ప‌టికే తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు.. కొన్నింటిని అంగీక‌రించారు. గ‌తంలో తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు.. ఇదే వ్యాఖ్య చేశారు. నాలుగు వేల కోట్ల కోసం ఆశ‌ప‌డి.. జ‌గ‌న్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. అయితే.. ఇప్పుడు తెలంగాణ కూడా ఇదే బాట‌లో ఉంది.

ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇవే సంస్క‌ర‌ణ‌లు  ఆ పార్టీ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది మ‌రి ప్ర‌జ‌లు వీటిపై నిల‌దీస్తే.. ఏం చేస్తారో చూడాలి. ఇది అంతిమంగా బీజేపీని మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్ట‌డం ఖాయం. ఇప్ప‌టికే.. కేంద్రంలోని బీజేపీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగ్ర‌హం ఉండ‌డం గ‌మ‌నార్హం.

 



ఏపీలో కాపుల కొత్త పార్టీ వ‌స్తోందా...!

కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

కొత్త సంస్క‌ర‌ణ‌ల‌తో బీజేపీ బొక్క బోర్లానే...!

విశాఖ‌ప‌ట్న‌మా? విజ‌య‌సాయి ప‌ట్న‌మా?

అక్కడ టిఆర్ఎస్ పతనమేనా..?

కుర్ర డైరెక్టర్ తో పూరి కొడుకు... తండ్రికి అచ్చొచ్చిన జోనర్ లో ?

స్థిరంగా పెట్రోల్..బీట్ చేసేలా డీజిల్.. !

జ‌గ‌న్ ఆస్తుల జ‌ప్తు?

శ్రీవారి భక్తులకు షాక్.. ప్రసాదం ధర భారీగా పెంపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>