Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickete187071b-1e59-4e21-9166-7bbc44f7b980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickete187071b-1e59-4e21-9166-7bbc44f7b980-415x250-IndiaHerald.jpgఇటీవలే యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ముంబైలో 14 రోజులపాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత జట్టు ఇక ఇటీవలే ప్రత్యేక ఫ్లైట్ లో కొలంబోలో అడుగు పెట్టింది. ఇక అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. జూలై 13వ తేదీ నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే టీ 20 సిరీస్ లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక భారత్ శ్రీలంక మధ్య వన్డే టి20 సిరీస్ నిర్వహించేందుకు అటు శ్రీలంక బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో లంక బోర్డుకి ఇటీవల ఊహించని షాక్ ఇచ్చారు ఆ దేశ క్రికెటర్లు. కొన్ని రోజుల నుంచి శCricket{#}ICC T20;vishwa;Sri Lanka;Indiaటీమిండియాతో ఆడబోము.. లంక బోర్డుకి షాకిచ్చిన క్రికెటర్లు?టీమిండియాతో ఆడబోము.. లంక బోర్డుకి షాకిచ్చిన క్రికెటర్లు?Cricket{#}ICC T20;vishwa;Sri Lanka;IndiaSat, 03 Jul 2021 18:50:00 GMTఇటీవలే యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ముంబైలో 14 రోజులపాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత జట్టు ఇక ఇటీవలే ప్రత్యేక ఫ్లైట్ లో కొలంబోలో అడుగు పెట్టింది. ఇక అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. జూలై 13వ తేదీ నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే టీ 20 సిరీస్ లు జరగబోతున్నాయి.  ఈ క్రమంలోనే ఇక భారత్ శ్రీలంక మధ్య వన్డే టి20 సిరీస్ నిర్వహించేందుకు అటు శ్రీలంక బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో లంక బోర్డుకి  ఇటీవల ఊహించని షాక్ ఇచ్చారు ఆ దేశ క్రికెటర్లు. కొన్ని రోజుల నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు క్రికెటర్లకు మధ్య కాంట్రాక్టు వివాదం జరుగుతూ వస్తోంది.  ఈ క్రమంలోనే ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు.. క్రికెటర్లకు మధ్య మీమినీ మాటల యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే భారత్తో జరగాల్సిన టీ20 వన్డే సిరీస్కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లు షాకిచ్చారు. జూలై 13వ తేదీ నుంచి కొలంబో వేదికగా శ్రీలంక ఇండియా మధ్య వరుసగా సిరీస్ లు జరగాల్సిఉంది. అయితే ఇటీవలే ఐదుగురు శ్రీలంక క్రికెటర్లు బారత్ సిరీస్కు ముందు కాంట్రాక్టుపై సంతకం చేసేందుకు నిరాకరించారట. అటు బోర్డు సభ్యులు సర్ది చెప్పినా వినలేదట. శ్రీలంక క్రికెట్ బోర్డు మొత్తం 24 మంది క్రికెటర్లతో కాంట్రాక్ట్ ఆఫర్ చేసింది.  అయితే ఈ కాంట్రాక్టుపై ఐదుగురు క్రికెటర్లు సంతకం చేయలేదు. విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా శ్రీలంక బోర్డు కాంట్రాక్టుపై సంతకం చేసేందుకు నిరాకరించారట.



 దీంతో లంక బోర్డు ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో టీమిండియాతో సిరీస్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇక క్రికెటర్లు ఇలాంటి షాక్ ఇవ్వడంతో అయోమయంలో పడింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అయితే ఇప్పటికే ఇంగ్లాండు టూర్ లో ఉన్న శ్రీలంక జట్టులో ఇటీవల ఇద్దరు ఆటగాళ్ళు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయటికి వచ్చినందుకుగాను ఐసీసీ వారిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు ఆటగాళ్లపై నిషేధం ఉండగా మరో ఐదుగురు ఆటగాళ్లు కాంట్రాక్టుపై సంతకం చేయకపోవడంతో మరి కొన్ని రోజులలో శ్రీలంక టీమ్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచులు ఎలా జరిగబోతాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.



ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ ఆవిష్క‌రించిన జ‌గ‌న్ మోహ‌న్‌రావు

షాకింగ్ ఘటన : మైదానంలో కుప్పకూలిన ఇద్దరు క్రికెటర్లు?

డ్రోన్ దాడిపై స్పందించిన బిపిన్ రావత్.. ఏమన్నారో తెలుసా?

పృద్వి షా కి భలే డిమాండ్.. అక్కడినుండి పిలుపు?

త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..?

రూమర్స్ కి చెక్ పెట్టిన మహేష్...

రంగమ్మత్త ఈ పాత్రకి సూట్ అవుతుందా ?

ఆస్కార్ కమిటీలో ఉన్నది వీల్లేనా..?

ప్రమాదంలో కోహ్లీ కెప్టెన్సీ.. మాజీ కీపర్ షాకింగ్ కామెంట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>