PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-waves1f248944-4a92-4eb3-831e-9135d50d8303-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-waves1f248944-4a92-4eb3-831e-9135d50d8303-415x250-IndiaHerald.jpgకరోనా ఇప్పటి వరకూ రెండు విడతలుగా ప్రపంచాన్ని వణికించింది. సెకండ్ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. అయితే మూడో వేవ్‌ కూడా పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రానప్పటికీ ఈ అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే ఇప్పటి వరకూ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ గణాంకాలు పరిశీలించుకుని మూడో వేవ్ కు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈ గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. కరోనా మొదటిదశతో పోలిస్తే రెండో దశలోనే ప్రభావం తీవ్రంగా ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మcorona-waves{#}Kanna Lakshminarayana;Coronavirus;Newsకరోనా ఫస్ట్‌ వేవ్‌ Vs సెకండ్ వేవ్‌.. షాకింగ్‌ వాస్తవాలు..!కరోనా ఫస్ట్‌ వేవ్‌ Vs సెకండ్ వేవ్‌.. షాకింగ్‌ వాస్తవాలు..!corona-waves{#}Kanna Lakshminarayana;Coronavirus;NewsSat, 03 Jul 2021 09:00:00 GMTకరోనా ఇప్పటి వరకూ రెండు విడతలుగా ప్రపంచాన్ని వణికించింది. సెకండ్ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. అయితే మూడో వేవ్‌ కూడా పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రానప్పటికీ ఈ అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే ఇప్పటి వరకూ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ గణాంకాలు పరిశీలించుకుని మూడో వేవ్ కు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈ గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. కరోనా మొదటిదశతో పోలిస్తే రెండో దశలోనే ప్రభావం తీవ్రంగా ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.


కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మరణాలు రేటు 40శాతం అధికంగా ఉందని మ్యాక్స్‌ హెల్త్‌కేర్ స్టడీలో తేలింది. కరోనా మొదటి, రెండో దశలో కోవిడ్ బాధితులు, మరణాల గణాంకాలను మాక్స్‌హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలోని 13ఆసుపత్రుల్లో విశ్లేషించి ఈ గణాంకాలు రూపొందించరు. యువత కరోనా బారిన పడి మరణించడం ఆందోళన కలిగించే విషయమని ఈ స్టడీ తెలిపింది. మొదటి దశతో పోలిస్తే, రెండోదశలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయట. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగించింది.


కరోనా రెండో దశలో ఎక్కువమంది డెల్టా వేరియంట్‌ బారిన పడ్డారు. మొదటి దశలో 7.2శాతంగా నమోదైన మరణాల రేటు రెండో దశలో 10.5 శాతానికి చేరింది. పురుషుల్లో కరోనా మరణాలు మొదటి దశలో 7.2శాతం, రెండో దశలో 10.4శాతం ఉంది. మహిళల్లో ఇది 9.8శాతం, 6.8శాతంగా నమోదైంది. 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన కొవిడ్‌ బాధితుల్లో మరణాల రేటు 1.3శాతం నుంచి 4.1శాతానికి పెరిగింది.


వెంటిలేటర్‌, ICUలో చికిత్స తీసుకునేవారి సంఖ్య రెండో దశలో పెరిగింది. ప్రతి ముగ్గురు కరోనా బాధితుల్లో ఒకరికి ఐసీయూ అవసరమైంది. ఆక్సిజన్‌ అవసరంకూడా 63.4శాతం నుంచి 74.1శాతానికి పెరిగింది. కరోనా బాధితులకు అవసరమైన ఔషధాల విషయంలో కూడా డిమాండ్‌ నెలకొంది. ముఖ్యంగా రెమ్‌డిసివర్‌ అవసరం 55.3శాతం నుంచి 74.4శాతానికి పెరిగిందని ఈ అధ్యయనం చెప్పింది.





పెరుగుతున్న కరోనా ఉధృతి... రక్షణ మన చేతుల్లోనే ?

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ధనుష్ కొత్త ఇల్లు !

యాంటిజెన్ కిట్లో నిమ్మరసం.. చివరికి కరోనా పాజిటివ్ అని చెప్పి?

మళ్లీ పవన్, రవితేజ లే దిక్కయ్యారు!!

కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మరణాలు రేటు 40శాతం అధికంగా ఉందని మ్యాక్స్‌ హెల్త్‌కేర్ స్టడీలో తేలింది. కరోనా మొదటి, రెండో దశలో కోవిడ్ బాధితులు, మరణాల గణాంకాలను మాక్స్‌హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలోని 13ఆసుపత్రుల్లో విశ్లేషించి ఈ గణాంకాలు రూపొందించారు.

ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

షర్మిల పార్టీ జెండా.. ఆ కలర్ లోనే ఉంటుందట?

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

ఎమ్మెల్యే బేతి ఆ మహిళా కార్పొరేటర్ మధ్య ఏం జరుగుతోంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>