PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan722dec42-f171-450a-86f5-afbb93a8852b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan722dec42-f171-450a-86f5-afbb93a8852b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్.. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రత్యేకించి ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేటీఆర్ మరింత ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు వచ్చేలా చొరవ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్‌ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త సంస్థలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటి విధానంలో అనేక రాయితీలు, ఆకర్షించే విధానాలు ప్రకటించారు. ఐటీ సంస్థల ఏర్పాటు వ్యయాన్ని భారీగా తగ్గించే విధjagan{#}KTR;INTERNATIONAL;Telangana;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;local language;Andhra Pradesh;Government;Hyderabadజగన్.. హైదరాబాద్‌కు పోటీ ఇస్తాడా..?జగన్.. హైదరాబాద్‌కు పోటీ ఇస్తాడా..?jagan{#}KTR;INTERNATIONAL;Telangana;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;local language;Andhra Pradesh;Government;HyderabadFri, 02 Jul 2021 09:13:00 GMTహైదరాబాద్.. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రత్యేకించి ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేటీఆర్ మరింత ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు వచ్చేలా చొరవ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్‌ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త సంస్థలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటి విధానంలో అనేక రాయితీలు, ఆకర్షించే విధానాలు ప్రకటించారు.


ఐటీ సంస్థల ఏర్పాటు వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేస్తామంటోంది ఏపీ. విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు  చెబుతోంది ఏపీ. ఈ టెక్నాలజీ పార్కులో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ల్యాబ్స్, కో–వర్కింగ్‌ స్పేస్, స్టేట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అంతే కాదు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్‌ లైబ్రరీలు, కోవర్కింగ్‌ ప్లేస్‌లను అభివృద్ధి చేస్తామంటున్నారు.


కొత్తగా అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌ సిటీలు, ఐటీ పార్కులకు అనుమతులు వేగంగా ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ఇస్తున్నారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా ఇస్తారు.  హైఎండ్‌ జాబ్‌ కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000, మిడ్‌ లెవల్‌ జాబ్‌కు రూ.1,12,500, ఎంట్రీ లెవల్‌ జాబ్‌కు రూ.75,000 వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది.


వీటితో పాటు పారిశ్రామిక విద్యుత్‌ రాయితీ, ప్రతి ఉద్యోగికి నెలకు రూ.500 చొప్పు రెండేళ్ల పాటు గరిష్టంగా ఒక సంస్థకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని ఏపీ ప్రకటించింది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ నిధిని ఏర్పాటు చేస్తారట. మరి ఈ కొత్త ఐటీ విధానం పారిశ్రామిక వేత్తలను ఆకర్షస్తుందా.. చూడాలి.



ఆంధ్ర ప్రదేశ్‌ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్‌ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త సంస్థలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటి విధానంలో అనేక రాయితీలు, ఆకర్షించే విధానాలు ప్రకటించారు.

ఆ మహిళలు మంత్రి హరీష్ రావును అడ్డుకోవడంలో రహస్యమేమిటి..?

సంపూర్ణేష్ బాబు చేసిన పనికి షాక్ లో నెటిజన్లు..?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

రెయిన్ అలెర్ట్ : మరో రెండ్రోజుల పాటు?

మా మూవీ ఎన్నికల సమయంలో బ్రహ్మాజీ అదిరిపోయే ఫన్నీ డైలాగ్ !

ప్రాజెక్టుల వద్ద పోటాపోటీగా పోలీసులు.. ఎవరూ తగ్గట్లేదుగా!

సజ్జలకు స్పెషల్ టాస్క్ అప్పగించిన జగన్..

తండ్రి మరణించడంతో డాక్టర్ బాబు జీవితం ఏమైందో తెలుసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>