MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-shesh835741d4-946c-4b8f-a64e-ce35783db556-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-shesh835741d4-946c-4b8f-a64e-ce35783db556-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వెరైటీ సినిమాలు చేసే హీరోల జాబితా రోజురోజుకీ ఎక్కువైపోతుంది. కాకపోతే వారు ఒకే జోనర్ లోని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తున్నారు. ఒకరు రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో, ఇంకొకరు హర్రర్ జోనర్ లో, మరొకరు యాక్షన్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఒకే రకపు మూస పద్ధతికి అలవాటు పడుతున్నారు. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ కావడంతో అలాంటి సినిమాలను చేయడానికి వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రొటీన్ కి భిన్నంగా వెరైటీగా ఏదైనా చేస్తే ఒకసారి స్వాగతిస్తారు ప్రేక్షకులు. కానీ మళ్లీ మళ్లీ ఆ ప్రయోadivi shesh{#}Horror;Genre;naina;Success;Romantic;Yevaru;Love;Hero;Cinemaఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?ఈ మూస లోంచి బయటకి రావా అడవి శేష్?adivi shesh{#}Horror;Genre;naina;Success;Romantic;Yevaru;Love;Hero;CinemaFri, 02 Jul 2021 17:00:00 GMTటాలీవుడ్ లో వెరైటీ సినిమాలు చేసే హీరోల జాబితా రోజురోజుకీ ఎక్కువైపోతుంది. కాకపోతే వారు ఒకే జోనర్ లోని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తున్నారు. ఒకరు రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో, ఇంకొకరు హర్రర్ జోనర్ లో, మరొకరు యాక్షన్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఒకే రకపు మూస పద్ధతికి అలవాటు పడుతున్నారు.  వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ కావడంతో అలాంటి సినిమాలను చేయడానికి వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రొటీన్ కి భిన్నంగా వెరైటీగా ఏదైనా చేస్తే ఒకసారి స్వాగతిస్తారు ప్రేక్షకులు. కానీ మళ్లీ మళ్లీ ఆ ప్రయోగాలను ఆదరించరు.

ఆ ప్రయోగాలు కూడా రోటీన్ అయిపోతే స్టార్ హీరో కావలసిన హీరోలు అక్కడే ఆగిపోతారు. ఆ విధంగా హీరో అడవి శేష్ ఇప్పుడు అలాంటి సమస్య ఎదుర్కొంటున్నాడు. హీరో అన్నాక అన్ని రకాల పాత్రల్లో నటించాలి. అప్పుడే పేరు వస్తుంది. కానీ ఒక్క జోనర్ లోనే వరుసగా అలాంటి సినిమాలు చేస్తే వేరే పాత్రలకు సదరు హీరోనీ ఎవరు సజేస్ట్ చేయరు.   అలాంటి పాత్రలు తప్ప ఆయనకు వేరే పాత్రలు రావు కూడా. అలా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉన్న అడవి శేష్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్, క్రైమ్ జోనర్ లకే పరిమితం అయిపోతున్నాడు.

అయన హీరో గా క్షణం, గూడచారి, ఎవరు వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న మేజర్ సినిమా కూడా దానికి సంబంధించినదే.. అంతేకాదు ఆయన తర్వాత సినిమా గా చేస్తున్న హిట్ 2 కూడా అదే జోనర్ లోని సినిమా. మరి అడవి శేష్ కావాలని ఇలాంటి సినిమాలు చేస్తున్నాడా లేదా యాదృచ్చికంగా అన్నీ ఇలాంటి అవకాశాలు వస్తున్నాయా అనేది ఎవరికీ తెలియదు. మొదట్లో రొమాంటిక్, లవ్ , ఎంటర్ టైనర్ సినిమాలను చేశాడు. అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఈ జోనర్ కి మారాడో అప్పటినుంచి సక్సెస్ ను అందుకున్నాడు.  కనుక ఇప్పట్లో వేరే జోనర్ ను టచ్ చేసేలా కనిపించడం లేదు ఈ యంగ్ హీరో. మరి ఫ్యూచర్ లో నైనా అన్ని రకాల జోనర్ కథలు అడవి శేష్ చేస్తాడో చూడాలి. 



మళ్లీ నవ్వులు మొదలు.. !

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

2000 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీకాంత్.. ఎన్ని హిట్స్ అంటే..?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

అయ్యప్పనుం కోషియమ్ రీమేక్.. ఇంటర్వల్ ఫైట్ సీక్రెట్ లీక్..!

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??

మన్యం వీరుడి జ‌యంతికి అప్డేట్ ఉంటుందా.. ?

హిందీలో స‌త్తా చాటిన "మేజ‌ర్".. !

చిరు,NBK ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న రజనీకాంత్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>