PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/canada-fire-village12848ce5-3eb2-46ef-abb8-a16db0bf34d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/canada-fire-village12848ce5-3eb2-46ef-abb8-a16db0bf34d3-415x250-IndiaHerald.jpgకెనడాలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో అడవుల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఓ గ్రామం పూర్తిగా కాలిబూడిదయింది. అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. canada fire village{#}East;Friday;kaliఅడవిలో మంటలు.. కాలి బూడిదయిన గ్రామం..!అడవిలో మంటలు.. కాలి బూడిదయిన గ్రామం..!canada fire village{#}East;Friday;kaliFri, 02 Jul 2021 07:00:00 GMTకెనడాలో ఆందోళనకర పరిస్థితులు తాండవిస్తున్నాయి. అక్కడి పరిస్థితులు తలచుకుంటేనే భయమేస్తోంది. ఎందుకంటే అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావడం లేదు. ముఖ్యంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కేవలం ఐదు రోజులలో 486 మరణాలు నమోదయ్యాయి. ఇక కొలంబియాలోని అతిపెద్ద నగరమైన వాంకోవర్లో గత శుక్రవారం నుండి ఇప్పటి వరకు 65 మంది మరణించారు. ఇక అమెరికాలోని ఒరెగాన్ లో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్ లో 20మంది మృతి చెందారు.   కెనడాలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రోడ్ల పక్కన ఉండేవారికి షెల్టర్ లు ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉష్ణోగ్రతలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి.

కొలంబియాలోని లైటన్ లో అత్యధిక టెంపరేచర్ నమోదయింది. 49.6సెంటీగ్రేడ్ నమోదయినట్టు అక్కడి వాతావరణ అధికారులు  తెలిపారు. ఆ వేడికి చుట్టుపక్కనున్న అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో లైటన్ ప్రాంతం కాలి బూడిదయింది. 15నిమిషాల్లోనే జరగాల్సింది అంతా జరిగిపోయింది. అయితే అప్పటికే అప్రమత్తమైన ప్రజలు ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సుమారు 250 మందికి నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్మాయి. ఏం జరుగుతుందో తెలియక ఆ గ్రామస్థులు ఆందోళన చెందారు. పొగతో మంటలు కూడా చెలరేగడంతో వాంకోవర్‌కు ఈశాన్యంగా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న నివాసితులు ఆ ప్రాంతం నుండి బయటికొచ్చేశారు.

ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రైరీ ప్రావిన్సుల మీదుగా తూర్పు వైపు ప్రభావం చూపిస్తున్నాయి. అల్బెర్టా, సస్కట్చేవాన్, మానిటోబాలోని కొన్ని ప్రాంతాలలో వాతావరణ హెచ్చరికలు  జారీ చేశారు. సీటెల్, పోర్ట్ ల్యాండ్ నగరాల్లో ఆల్ టైమ్ హీట్ రికార్డులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 46డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.



రష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?

జగన్ వన్ మ్యాన్ షోకు బాబు-పవన్‌లు బ్రేక్ వేస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>