Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుమఖం పడుతోంది. గతంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. అలాగే రికవరీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో వారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ప్రకటించారు.
ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆగస్టు రెండో వారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జూలై 1 నుంచి ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు రప్పిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో స్కూళ్లలో టీచర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో కరోనా ప్రభావంతో తాజాగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే విద్యార్ధులకు మార్కులు ఎలా ఇవ్వాలన్న దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. త్వరలో కమిటీ నివేదిక వస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నివేదిక వచ్చిన రెండు, మూడు రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్, ఈసెట్ తో పాటు అన్ని ప్రవేశపరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీంతో విద్యార్ధులు, పరీక్షార్ధుల్లో నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించినట్లయింది.
English summary
andhrapradesh government has decided to re-open schools from august second week after decline in covid 19 cases in the state.
Story first published: Friday, July 2, 2021, 19:01 [IST]