MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-movies104db7bc-9aec-4832-a4ba-7c28b661d589-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-movies104db7bc-9aec-4832-a4ba-7c28b661d589-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ శ్రీనివాస్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సీనియర్ సినిమాలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడు త్రివిక్రమ్. అప్పుడెప్పుడో సీనియర్ హీరోలతో సినిమా ఉంటుందని ప్రకటన చేసిన త్రివిక్రమ్.. వాళ్లను పక్కన పెట్టడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. trivikram movies{#}Audience;Aravinda Sametha Veera Raghava;Venkatesh;trivikram srinivas;srinivas;Success;Chiranjeevi;Cinema"తర్వాత చూసుకుందాం" అనే ధోరణిలో త్రివిక్రమ్..!"తర్వాత చూసుకుందాం" అనే ధోరణిలో త్రివిక్రమ్..!trivikram movies{#}Audience;Aravinda Sametha Veera Raghava;Venkatesh;trivikram srinivas;srinivas;Success;Chiranjeevi;CinemaFri, 02 Jul 2021 06:03:37 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. తనకున్న సాహిత్య పరిజ్ఞానంతో.. అద్భుతమైన డైలాగులతో సినిమాను అద్భుతంగా పండించగల వ్యక్తి. అందుకే ఆయన తీసే సినిమాల్లో తమకు చోటు దక్కితే బాగుంటుందని చాలా మంది భావిస్తారు. కుర్ర హీరోలు మొదలుకొని సీనియర్ హీరోల వరకు అదే భావనలో ఉంటారు. ఇక ఆయన చేతిలో పడితే..ఎవరైనా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల్సిందే. ఇప్పటికే వచ్చిన అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో, అరవింద సమేత ఎలాంటి హిట్ సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రిరిలీజ్, సక్సెస్ ఈవెంట్స్ లో స్టేజ్ ఎక్కాడంటే చాలు ఆయన డైలాగుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి డైలాగులు షోలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. నిజజీవితంలో ఇవి అమలు చేసేందుకు ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సీనియర్ సినిమాలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడు త్రివిక్రమ్.

ఇక విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చి అయి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇటీవల వెంకటేశ్ 75వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం కూడా  జరిగింది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కూడా ఒక సినిమాపై ప్రకటన వచ్చింది. 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని చిరంజీవే స్వయంగా చెప్పాడు. అయితే ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చి రెండేళ్లు అవుతున్నా.. లాంచింగ్‌ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.  

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రస్తుతం మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. జూ.ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయాక మహేశ్‌ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'అతడు, ఖలేజా' తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. అప్పుడెప్పుడో సీనియర్ హీరోలతో సినిమా ఉంటుందని ప్రకటన చేసిన త్రివిక్రమ్.. వాళ్లను పక్కన పెట్టడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇపుడు టాప్ హీరోలకే ప్రాధాన్యత ఇస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.  



సీనియర్లను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన త్రివిక్రమ్, టాప్ హీరోలతోనే సినిమాలు

బన్నీ 'ఐకాన్' కి ఇంకా మూడు నెలలే.. మరీ ఇంత స్పీడా..?

ఇండియన్ 2 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే!!

డేటింగ్ ఓకే.. నో మ్యారేజ్..అంటున్న సినీ భామలు..

విజయం మీదే: ప్రపంచమే నిన్ను వెలేసినా... నిన్ను నువ్వు నమ్ముకో ?

కళ్యాణ్ రామ్ ఏంటి అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు..?

పెద్ద సినిమాలు టెంప్ట్ అయితే మూసుకోవాల్సిందే... ?

'మా' కోసం రంగంలోకి చిరంజీవి?

జూలై మాసంలో పుట్టినరోజు జరుపుకోనున్న స్టార్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>