PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-monydf0666c2-fb32-4bb7-8d7c-0084dea4cde1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-monydf0666c2-fb32-4bb7-8d7c-0084dea4cde1-415x250-IndiaHerald.jpgతిరుమలలో జూన్ నెలలో వచ్చిన ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. భక్తుల సంఖ్య తగ్గినా.. ఆదాయం మాత్రం బాగానే వచ్చినట్టు తెలిపింది. మరోవైపు సామాన్య భక్తులు సర్వదర్శనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పునరుద్దరిస్తారా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా భక్తులకు సేవలు అందించే కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని కూడా వారి చేతుల్లోనే పెట్టారు. ttd mony{#}Tirumala Tirupathi Devasthanam;June;Coronavirus;Teluguజూన్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?జూన్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?ttd mony{#}Tirumala Tirupathi Devasthanam;June;Coronavirus;TeluguFri, 02 Jul 2021 11:48:17 GMTటీటీడీ వెల్లడించింది. గత నెలలో శ్రీవారిని 4లక్షల 14వేల 674 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం ద్వారా రూ.36.02కోట్లు సమకూరినట్టు తెలిపింది. మరోవైపు తిరుమలలో లడ్డూ వితరణ, కళ్యాణకట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా వస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి.. ఇతర దేశాల నుండి కూడా వేంకటేశ్వరుడి దర్శనానికి వస్తారు. ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ కానుకలు సమర్పిస్తారు. అయితే శ్రీవారిని జూన్ లో దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా హుండీ ఆదాయం మాత్రం పెరిగింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది.  

అంతేకాదు లక్షా 67వేల 3906మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. స్వామి వారి ఆదాయంలో తగ్గుదల దాదాపు కనిపించదు. శ్రీవారికి మొక్కుల రూపంలో కానుకలు అధిక సంఖ్యలో వస్తాయి. ఇక తాజాగా భక్తులకు సేవలు అందించే కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని కూడా వారి చేతుల్లోనే పెట్టారు.

మరోవైపు సామాన్య భక్తులకు శ్రీవారం దర్శనం కరువైందనే చెప్పాలి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో శ్రీవారి సర్వ దర్శనాలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 12 నుంచి టీటీడీ సర్వదర్శనాలను నిలిపివేసింది. ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. దీంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గినా.. ఆదాయంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు.





టాలీవుడ్‌ను షేక్ చేసిన తమిళ సినిమాలివే..!

రంభ వచ్చేస్తోంది.. అయితే ఈసారి అలా ?

తొలిసారి రవితేజ సాహసం.. ఫలిస్తుందా?

మర్యాద దక్కదు.. జాగ్రత్త!

ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ స్టార్ నటుడు?

ప్రారంభం కాబోతున్న ఓటీటీ పండుగ !

అక్కడ ఇంత మంది చిన్నారులు అనాధలెందుకయ్యారు..?

అంతరిక్షంలోకి తొలి తెలుగు సంతతి మహిళ..ఎవరో తెలుసా?

దేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్..తాజా కేసులివే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>