PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojad36254b0-4de4-47c6-a843-b60e54ca371f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojad36254b0-4de4-47c6-a843-b60e54ca371f-415x250-IndiaHerald.jpg గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం గురించి ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఒకపక్క ఏపీ మంత్రులను, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం సరిగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు అని మాత్రం చెప్పక తప్పదు. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ అంశం మీద స్పందించారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జల వివాదం, మహిళల భద్రత గురించి, ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి కామెంట్స్ roja{#}Roja;SV Mohan Reddy;Krishna River;electricity;Aqua;dr rajasekhar;CBN;Letter;Police Station;Telangana;YCP;Coronavirus;Telangana Chief Minister;Jagan;CM;Telugu;Andhra Pradeshమర్యాద దక్కదు.. జాగ్రత్త!మర్యాద దక్కదు.. జాగ్రత్త!roja{#}Roja;SV Mohan Reddy;Krishna River;electricity;Aqua;dr rajasekhar;CBN;Letter;Police Station;Telangana;YCP;Coronavirus;Telangana Chief Minister;Jagan;CM;Telugu;Andhra PradeshFri, 02 Jul 2021 11:45:00 GMT

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం గురించి ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఒకపక్క ఏపీ మంత్రులను, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం సరిగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు అని మాత్రం చెప్పక తప్పదు. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ అంశం మీద స్పందించారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జల వివాదం, మహిళల భద్రత గురించి, ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి కామెంట్స్ చేశారు. 


జగన్ ను విమర్శిస్తున్న వారిపై రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల భద్రత గురించి ఆలోచించి మన రాష్ట్రంలో దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మహిళలు కోసం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నారని పేర్కొన్న ఆమె మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును  ప్రశ్నించని తెలుగు మహిళలు జగన్ ను విమర్శించడం విడ్డురంగా ఉందని అన్నారు. అంతేకాకుండా కరోనా బారిన పడ్డ వారికి న్యాయం చేయాలంటూ బాబు దొంగ దీక్షలు చేశారని అన్నారు. ప్రజలు ఈ దీక్షలను నమ్మే పరిస్థితిలో లేరు అంటూ చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు.

 

ఇక తెలంగాణ జల వివాదం గురించి మాట్లాడుతూ టీఎస్ నేతలపై మండిపడ్డారు రోజా. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని, ఏపీకి అన్యాయం చేస్తే సీఎంతో పాటు మేము సహించబోమని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాన్ని పరిష్కరించి, తమ వాటాను తమకు కేటాయించాలని మోదీ, షేకావత్ లకు సీఎం జగన్ లేఖ రాసినట్టు రోజా వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని, ఏపీ నీటిని వినియోగిస్తూ తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.

 

 

 




చంద్ర‌బాబు యాప్ కు దిశ యాప్ కాపీ.. !

రేవంత్ విషయంలో విజయసాయి టార్గెట్ ఏంటి?

రంభ వచ్చేస్తోంది.. అయితే ఈసారి అలా ?

తొలిసారి రవితేజ సాహసం.. ఫలిస్తుందా?

జూన్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?

ఆ కులాలు వైసీపీకి దూరం దూరం... ?

ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ స్టార్ నటుడు?

ప్రారంభం కాబోతున్న ఓటీటీ పండుగ !

అక్కడ ఇంత మంది చిన్నారులు అనాధలెందుకయ్యారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>