MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashmika-vijaydevara-konda8147c516-c303-405d-a8d3-22fe81166f5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashmika-vijaydevara-konda8147c516-c303-405d-a8d3-22fe81166f5b-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నల మధ్య ఏదో ఉందనే పుకారు షికారు చేస్తోంది. వీరి బంధం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. ముంబయిలో విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసి రెస్టారెంట్‌లో కనిపించడం.. వాళ్ల ఊహాగానాాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది రష్మిక మందన్న.rashmika vijaydevara konda{#}rashmika mandanna;Kannada;Joseph Vijay;Romantic;Love;Tollywood;Hero;Arjun;Newsరౌడీ హీరో తనకు ఏమవుతాడో చెప్పిన రష్మిక..!రౌడీ హీరో తనకు ఏమవుతాడో చెప్పిన రష్మిక..!rashmika vijaydevara konda{#}rashmika mandanna;Kannada;Joseph Vijay;Romantic;Love;Tollywood;Hero;Arjun;NewsFri, 02 Jul 2021 08:00:00 GMTవిజయ్ దేవరకొండకు రౌడీహీరో మాత్రమ కాదు.. రొమాంటిక్ హీరో కూడా. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టడం విజయదేవర కొండకే సాధ్యమైంది. కుర్రకారు ఈ హీరో అంటే పడిచచ్చిపోతున్నారు. ఏమని అర్జున్ రెడ్డిలో నటించాడో గానీ అప్పటి నుంచి విజయ్ యూత్ దృష్టిలో పడిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే యూత్ ఐకాన్ అయ్యాడు. విజయ్ దేవరకొండకు రొమాంటిక్ సీన్స్ బాగా సెట్ అయ్యాయి. అందులో ఆయన ఒదిగిపోయే గుణం కుర్రకారులో ఎగ్జయిట్ మెంట్ ను తీసుకొస్తుంది.

ఇక విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నల మధ్య ఏదో ఉందనే పుకారు షికారు చేస్తోంది. వీరి బంధం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. అయితే ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది రష్మిక మందన్న. అభిమానులతో చర్చ సందర్భంగా విజయ్ దేవరకొండతో తనకున్న బంధాన్ని చెప్పకనే చెప్పేసింది.  

రష్మిక మందన్న అభిమానులకు అలాంటి అనుమానం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు రొమాంటిక్ సీన్స్ పండించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'గీత గోవిందం, డియర్ కామ్రేడ్' సినిమాల్లో వీళ్ల జోడీకి వందకు వంద మార్కులు వేశారు ప్రేక్షకులు. అయితే ఆన్‌ స్క్రీన్‌లోనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపించాయి. ముంబయిలో విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసి రెస్టారెంట్‌లో కనిపించడం.. వాళ్ల ఊహాగానాాలు మరింత ఎక్కువయ్యాయి.

రష్మిక మందన్నకు ఇప్పటికే లవ్ హిస్టరీ ఉంది. కన్నడ సినిమా 'కిరిక్‌ పార్టీ' సమయంలో హీరో రక్షిత్ శెట్టితో లవ్ లో పడింది. వీళ్లిద్దరికి అప్పట్లో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఏమయిందో ఏమో గానీ రష్మిక తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక ఆ ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. అయితే ఇలా వరుసగా జరిగిన పరిణామాలు రష్మిక- విజయ్ బంధంపై మరింతగా బలపడ్డాయి.  

రష్మిక మందన్న ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అభిమానులతో మాటామంతీ జరిపింది. అందులో భాగంగా విజయ్‌తో తనకున్న బంధం గురించి అడిగారు నెటిజన్లు. దీనికి రష్మిక తామీద్దరం మంచి స్నేహితులనీ..అంతకుమించి ఏం లేదని క్లారిటీ ఇచ్చింది.  మరి ఈ ఆన్సర్‌తో అయినా వీళ్లిద్దరి రిలేషన్‌ గురించి వస్తున్న గాసిప్స్ కు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.  ప్రస్తుతం రష్మిక 'పుష్ప'తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.



అమ్మకానికి అనాధలు.. రేట్ ఎంతంటే?

బుల్లితెరపై నితిన్ హవా మాములుగా లేదుగా..??

సంపూర్ణేష్ బాబు చేసిన పనికి షాక్ లో నెటిజన్లు..?

అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణ భగవాన్ ఎందుకు సినిమాలకు దూరమయ్యారో తెలుసా..?

రెయిన్ అలెర్ట్ : మరో రెండ్రోజుల పాటు?

శిరీష్ కి 'సినిమాలొద్దు'.. ఆ పనిలో పెడుతున్న అరవింద్ ?

మూడు రోజులు వ్యవసాయ బావిలోనే వృద్ధుడు.. చివరికి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>