భారీగా తగ్గుముఖం.. 869 కేసులు, 8 మంది మృతి

Hyderabad

oi-Shashidhar S

|

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 869 కరోనా కేసులు వచ్చాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా.. మృతిచెందిన వారి సంఖ్య 3 వేల 669 మందికి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని..1, 197 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 06 లక్షల 07 వేల 658 గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 13 వేల 052గా ఉంది.

ఆదిలాబాద్ 04 కరోనా కేసులు వచ్చాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 38. జీహెచ్ఎంసీ 101. జగిత్యాల 19. జనగామ 07. జయశంకర్ భూపాలపల్లి 19. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 04. కరీంనగర్ 51. ఖమ్మం 52. కొమరం భీం ఆసిఫాబాద్ 04. మహబూబ్ నగర్ 17. మహబూబాబాద్ 35. మంచిర్యాల 42. మెదక్ 06. మేడ్చల్ మల్కాజ్ గిరి 41. ములుగు 20. నాగర్ కర్నూలు 06. నల్గొండ 72. నారాయణపేట 05. నిర్మల్ 08. నిజామాబాద్ 08. పెద్దపల్లి 45. రాజన్న సిరిసిల్ల 22. రంగారెడ్డి 65. సంగారెడ్డి 10. సిద్దిపేట 28. సూర్యాపేట 54. వికారాబాద్ 08. వనపర్తి 09. వరంగల్ రూరల్ 12. వరంగల్ అర్బన్ 33. యాదాద్రి భువనగిరి 20 కేసులు వచ్చాయి. వీటన్నింటిని కలిపితే మొత్తం 869 కేసులు ఉన్నాయి.

869 people infect corona in telangana

థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. తర్వాత ఇతర ఫంగస్ కూడా వచ్చాయి. అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది.

English summary

last 24 hours 869 people infect corona in telangana and 8 people died due to virus.

Story first published: Friday, July 2, 2021, 18:55 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *